(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: మొదటి పునరుత్థానంలో పాలుగలవారు ధన్యులును, పరిశుద్ధులై ఉంటారు ప్రకటన 20:6. ఏదైనా ఒక విషయంలో ఫలానా అనుభవం కలిగినవాడు ధన్యుడు అని ఎందుకంటారు? అందరూ దాని కొరకు ఆశపడతారు గానీ అందరికి దక్కదు. ఎవరో కొందరికే దక్కుతుంది. ఆ దక్కిన వారు ధన్యులు, Lucky people అంటారు. అలాగే మొదటి పునరుత్థానంలో పాలు గలిగిన వాళ్ళను చూసి, వెనక కొంతమంది ఎంత అదృష్టవంతులు వీరు? అనుకుంటారు. ఈ మొదటి పునరుత్థానం ఎప్పుడంటే 1000 ఏండ్ల పరిపాలనకు ముందు కడబూర ధ్వనించినప్పుడు మొదటి పునరుత్థానం జరుగుతుంది. అందులో అబద్ధ క్రీస్తు ద్వారా శిరచ్ఛేదనము చేయబడి, హతసాక్షులైన వారు కూడా లేస్తారు, శ్రమల కాలంలో కూడా చచ్చిపోయిన భక్తులు కూడా లేచినదే మొదటి పునరుత్థానం. అంటే అబద్ధ క్రీస్తుపరిపాలన 42 నెలలు అయిన తరువాతనే 2 రెండవ రాకడ, భక్తులు లేవడం జరగాలి. ఆ తరువాత ఇశ్రాయేలీయులు అప్పటికి ఇంకా రక్షణ పొందరు. రెండవ అర్ధవారంలో రక్షణ పొందుతారు. ప్రకటన 12:6లో “ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను. అచ్చట వారు 1260 దినాలు (రెండవ అర్ధవారం) ఆమెను పోషింపవలెననని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరచి ఉంచెను. అంటే ఇశ్రాయేలీయుల మీద దాడి చేయడానికి అబద్ధ క్రీస్తు సైన్యాలు ప్రయత్నం చేస్తాయి గానీ వాళ్ళను దేవుడు కాపాడుతాడు అనే విషయం వాళ్ళను కాపాడిన తరువాత వాళ్ళు దాగుకోడానికి కూడా ఆయన ఒక స్థలం సిద్ధపరచి ఉంచుతాడు. Absolute protection ఇస్తాడు. ఇశ్రాయేలు జనాంగాన్ని ఏమీ చేయలేని పరిస్థితితో అక్కసు పట్టలేక, ద్వేషం అనేది వెల్లగ్రక్కడానికి పరలోకం మీదికే యుద్ధానికి వెళ్తాడు. 12:6,7లో “దేవుడామెకు ఒక స్థలము సిద్దపరచియుంచెను. అంతట పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును, అతని దూతలును ఆ ఘటసర్పముతో యుద్ధము చేయవలెనని యుండగా? ఆ ఘటసర్పము, దాని దూతలును యుద్ధము చేసిరి గాని గెలువ లేకపోయిరి. గనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయెను. అంటే ఆ తరువాత వాడికి entrance ఉండదు. అప్పటిదాకా entrance ఉంటుంది. గనుకనే యోబు గ్రంథంలో మాటిమాటికీ వాడు వెళ్తున్నాడు, మాట్లాడుతున్నాడు. గనుక most of the Israelite వాళ్ళు హతసాక్షులు కాకుండా దేవుని చేత కాపాడబడతారు. గనుక ఆ రెండవ అర్ధవారం కూడా గడిచాక యేసుప్రభువు అర్మెగిదోను యుద్ధమునకు చూచినప్పుడు వాళ్ళ శరీరాలు మహిమ శరీరాలుగా మార్చబడతాయి. తరువాత సంఘ కన్యకలో కలిసిపోతారు. ప్రాముఖ్యత లేని భాగాలుగా కలిసిపోతారు. ఇది కూడా “మహిమ ప్రపంచం” అనే గ్రంథంలో వ్రాసాను.