(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: ఆ మకరం మామాలు మకరం కాదు. ఆ మకరం సాతానును సూచిస్తున్న ఉపమాన భాష. యెహెజ్కేలు 29:3లో “ఐగుప్తు రాజైన ఫరో నైలునదిలో పండుకొని యున్న పెద్ద మొసలి, నేను నీకు విరోధిని, నైలునది నాది నేనే దానిని కలుగజేసితినని నీవు చెప్పుకొనుచున్నావే”. అక్కడ ఐగుప్తు రాజైన ఫరో ఒక పెద్ద మొసలి అనే సంగతి చెబుతున్నాడు. ఇక్కడ మొసలి అంటే అక్షరార్ధమైన మొసలి కాదు. మొసలి అనేది సాతానుకు సంబంధించిన వర్ణన. గనుక యోబు గ్రంథంలో దానిని వర్ణన చెబుతాడు. అది తుమ్మగా వెలుగు ప్రకాశించును. దాని కన్నులు ఉదయకాలపు కనురెప్పలవలెనున్నది (18వ వచనం). 19లో దాని నోట నుండి జ్వాలలు బయలుదేరును. దాని నాసికారంధ్రములో నుండి పొగ లేచును. దాని ఊపిరి నిప్పులను రాజబెట్టును. దాని నోట నుండి జ్వాలలు బయలుదేరును అంటాడు. భౌతికంగా మొసలి తుమ్మితే మంటలు రావడం లాంటిది జరగదు! గనుక ఇదంతా ఉపమాన భాషలో దేవుడు సైతానును గూర్చి చెప్పిన వర్ణన. యోషయా 51:9లో “యెహోవా బాహువా, లెమ్ము, లెమ్ము, బలము తొడుగుకొనుము పూర్వపు కాలములలో పురాతన తరములలోను లేచినట్లు లెమ్ము. రాహాబును తుత్తునియలుగా నరికివేసినవాడవు నీవే గదా? మకరమును పొడిచినవాడవు నీవే గదా? పూర్వకాలములో మకరము పారిపోతుంటే వెంటనే ఆయన పొడిసాడట. ఆ మకరము పారిపోతుంటే పొడిసినవాడే యేసు ప్రభువు అని చెబుతాడు. అంటే పరలోకంలో తిరుగుబాటు చేసి దేవుని చేత పడద్రోయబడి పారిపోతున్న లూసీఫరన్ను పొడిచాడు యేసు ప్రభు. నేను రాసిన “విశ్వచరిత్ర” గ్రంధం చదవండి. ఈ మకరం గురించి కూడా అందులో చెప్పాను.