(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: అందరూ తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మనము వెదుకుతున్న జవాబు వలన మనకు ఏ రీతిగా ప్రయోజనం కలుగుతుందో మనం clarity ఏర్పరచుకోవాలి. ఇప్పుడు వీటి గురించి clarity గా చెప్పండి అని అడిగారు. దాన్ని తెలుసుకోవడం వలన మనకు ఏ రకమైన లాభం కలుగుతుందో clarity గా చెప్పగలరా? అది మనకు అవసరమైన ప్రశ్న కాదు. జ్ఞానము అంటే అర్థమేమిటంటే దేవుని జ్ఞానము వేరు మానవుని పరిదిలో వేరు. మనుషులం అయిన మనకు సర్వజ్ఞత లేదు. సర్వజ్ఞత అవసరం లేదు. మనం రోడ్డుపై కారులో ప్రయాణిస్తున్నాం. ముందు ఒక లారీ వెళ్తుంది. ఉన్నటుండి హఠాత్తుగా లారీ ఆగింది ఎందుకంటే దాని ముందుకు ఏదో జంతువు వచ్చింది. అప్పుడు మనం ఎడమ వైపుకు టర్న్ చేయాలి, కుడి వైపుకి టర్న్ చేయాలి. momentary decision తీసుకొని యాక్సిడెంట్ను తప్పించుకోవడం అప్పటికప్పుడు ఏం చేయాలి? ఆ సంగతి ఎరిగి ఉండి అలా యాక్సిడెంట్ను తప్పించుకునే ప్రాప్తకాలజ్ఞత. మనకు దాపురించిన సమయము, సమస్యలలో మనం ఏమి చేయాలో తెలసుకుంటే చాలు. అంతేగాని నీ ముందు లారీ సడన్గా ఆగింది. నేను ఎటూ టర్న్ తీసుకోవాలో మానేసి ఎందుకు ఆగావు, నాకు explain చేయి, నువ్వు ఇలా ఆపితే నేనెలా నా కార్ని కంట్రోల్ చేయాలి? ఇది న్యాయమా? అని వాదన పెట్టుకోవడం బుద్ధిహీనత. ఎందుకంటే ఈ లోపల యాక్సిడెంట్ జరిగిపోతుంది. ప్రశ్నలు కూడా అడగడానికి సమయంలేనంత సంకుచిత సమయంలో క్షేమంగా మనం తప్పించుకోవడానికి decision తీసుకునే ఆ సామర్థ్యం పేరు ప్రాప్తకాలజ్ఞత. అది మనకు ఉంటే చాలు. సృష్టిలో ఎన్నో విషయాలు ఉన్నవి. అవి తెలిసినా మనకు లాభం లేని విషయాలు. ఇప్పుడు ఆత్మ, ప్రాణము వేరు అనే సంగతి మాత్రమే మనం స్పష్టంగా గ్రహించాలి. ఎందుకు గ్రహించాలి అంటే, రెండు చోట్ల ఆ రెండిటిని ఆయన వేరువేరుగా mention చేసాడు. హెబ్రీ 4:12 “ఎందుకనగా దేవుని వాక్యము సజీవమైన బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గముకంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్ళను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచూ”. కీళ్ళను మూలగను అంటే అవి వేరు వేరు పదార్ధాలు విభజన చేయవచ్చు. దాని విభజించగలిగింది దేవుని వాక్యం. అలాగే ప్రాణమును ఆత్మను dividing soul and spirit అనే మాట బైబిల్లో ఉంది. గనుక ప్రాణమును ఆత్మను వేరు వేరుగా దేవుడు చూస్తున్నాడు అనే సంగతి మనకు తెలుస్తుంది. 1థెస్సలో 5:23 “…. మీ ఆత్మయు, జీవమును, శరీరమును మన ప్రభువైన యేసు క్రీస్తు రాకడయందు నిందారహితము గాను, ….” గనుక ప్రాణం అనే మాట, జీవం అనే మాట ఒక్కటే. ఆత్మ, ప్రాణము, శరీరము అనే మాట ఈ రెండు చోట్ల కూడా ఈ మూడు భాగములు మానవుడిలో ఉన్నట్లు చెప్పబడింది. గనుక దాన్ని మానవ త్రిత్వంగా మనం recognise చేస్తున్నాం. దేవుడు కూడా త్రిత్వమే గనుక ఆ పోలికను గూర్చి చెప్పుకున్నాడు. ఆ తరువాత ఆత్మయొక్క శరీరం యొక్క ప్రత్యేకమైన characteristics ఏంటి? అని specified clarified knowledge వల్ల మీరు ఏ రకంగా లబ్ది పొందున్నారు? అంటే ఏమి పొందరు. గనుక “trying to know everything is not wisdom trying to know only those things which are necessary for me to fulfil the will of God”. దేవుని చిత్తము నేను జరిగించునట్లు నన్ను సమర్ధునిగా చేయగలిగే విషయాలు నాకు అవసరం. అందుకు సంబంధించని విస్తారమైన విజ్ఞానం ఉన్నది. కాబట్టి మిగతావి నాకు అవసరం లేదు. అదీ విషయం.
