(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: యాషారు గ్రంధం అనే దాన్ని గూర్చి మీరు Google search చేస్తే ఇప్పటికీ కూడా యాషారు గ్రంథం దొరుకుతుంది. Apocrypha అంటారు. (అప్రామాణికమైన గ్రంథాలు). ఆ గ్రంథాలలో ఒకటి యాషారు గ్రంథము. దానికి హెబ్రీ భాషలో నీతిమంతుని గ్రంథము అని అర్థం. అది క్రీస్తు ప్రభువారు అవతరించడానికి ముందే, పాత నిబంధన గ్రంథాలు ప్రామాణికత అనేది అప్పుడు Finalise అయిపోయి, ఎంత వరకు మనం లేఖనాలను ప్రామాణికంగా ఎంచుకోవాలి, ఏ గ్రంధాలు ప్రామాణికం కావో అప్పుడే final form of the Old Testament వచ్చేసింది. దాని బట్టి అప్పుడే యాషారు తీసేసారు. యాషారు ప్రమాణికం కాదని యూదా పండితులే తీసేసారు. గనుక ఇప్పుడు అది మనకు అవసరం లేదు. అందులో ఏమి concept, content ఉన్నదో అది Google లో downloadable form లో ఉంది. అది దేవుని వాక్కుగా ఎంచుకొని, మనకు అవసరమైన matter ఏమి లేదని యూదా మత పెద్దలే తీసివేసారు. అదీ విషయం.