(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: ఆయనకు పడ్డటువంటి కొరడా దెబ్బలు, బెత్తము దెబ్బలు, వాటివల్ల మిగిలిపోయిన మచ్చలు. అవన్నీటిని ఆయన అతిశయంగా చెప్పుకుంటున్నాడు. ఏంటంటే ఇవ్వన్నీ యేసు ప్రభు యొక్క ముద్రలు అని చెప్పుకుంటున్నాడు. ఆయనను చాలా సార్లు బెత్తముతో కొట్టారు. రాళ్ళతో కొట్టారు, ఆ గాయాలు మానిన చర్మం మీద మచ్చలు మిగిలిపోతయి కదా! వాటిని నేను పొందిన శ్రమల చిహ్నాలుగా అవి మిగిలిపోయినాయి. యేసుప్రభు వారి ముద్ర అని ఆ context లో చెప్తాడు. ఇకమీదట నన్ను ఎవడు శ్రమపెట్టకండి. అంటే ఇంతకు ముందు పొందిన శ్రమలకు ఈ చిహ్నాలు మిగిలిపోయినాయి. మళ్ళీ నన్నెవరు కొత్తగా శ్రమ పెట్టకండి అంటాడు.