(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: ఖచ్చితంగా అధికారాలు ఉంటాయి. దానికి రెండో ప్రశ్న లేదు. ఎందుకంటే మనకు అపోస్తులులు అనిపించుకున్న వారిలో ఇద్దరు ప్రముఖ అపోస్తలులు ఉన్నారు. ఒక అపోస్తలుడు పేతురు. ఇంకో అపోస్తలుడు పౌలు. పేతురేమో తన జీవనోపాధిని విడిచిపెట్టి విశ్వాసం మీద ఆధారపడి తన వలలను వదిలి పెట్టేసి సువార్త సేవకు బయలుదేరాడు. యేసయ్య పనికి బయలుదేరాడు. పౌలు ఆయనకునట్టువంటి వృత్తి డేరాలు కుట్టే డేరాలు బాగుచేసే వృత్తి. ఆ వృత్తిని విడిచిపెట్టకుండానే పౌలు సేవ చేసాడు. పేతురేమో విశ్వాసులు తెచ్చే కానుకల మీద ఆధారపడి బ్రతికాడు. పౌలేమో తన స్వహస్తములతో పని చేసి జీవనం గడుపుకున్నాడు. జీవన ఆధారంగా తన వృత్తిని ఎంచుకున్నాడు. గనుక పేతురు ఎక్కువ పౌలు తక్కువ అనడానికి వీలు లేదు. ఇద్దరు అపోస్తులులే. అది గాక మీకు మాదిరిగా ఉండడానికే నేనిలా చేసాను. మీ కానుకల ద్వారా నేను బ్రతకడం నాకధికారం లేదని కాదు. కానుకలు తీసుకొని బ్రతికిపోడానికి నాకు అధికారం ఉన్నది. కాని మీకు మాదిరి కనపరచడానికే నేను స్వహస్తాలతో కష్టపడి పని చేసాను. అని పౌలు భక్తుడు చెప్పాడు. పేతురేమో తన జీవనోపాధిని వదిలేసాడు. పౌలేమో continue చేసాడు.
గనుక ఉద్యోగం చేస్తూ దేవుని సేవ చేసినవాళ్లు కూడా Brethren assemblies లో Hebron assemblies లో చాలా మంది ఉన్నారు. నాకు తెలిసిన వారు ఎంతో మంది అద్భుతంగా job చేస్తూ వేల మంది ఆత్మలను సంపాదించినవారు ఉన్నారు. ఉద్యోగం వదిలేయాలి అని మంకు పట్టుపట్టి వదిలేసి ఒక ఆత్మను సంపాదించనివారు కూడ ఉన్నారు. పేరుకు మాత్రము సిద్ధాంత రీత్య నేను సేవకుని గనుక అభిషిక్తున్ని గనుక నేను job చేయకూడదు. అని భీష్మించుకుని, job వదిలేసి కూడా ఏం ఆత్మలను సంపాదించలేని వారు ఉన్నారు.
అందుచేత ఇబ్బంది లేదు. దేవుడు మీపై అభిషేకం ఉంచినట్లయితే మీరు ఉద్యోగం చేస్తూ కూడా సేవ చేయొచ్చు. ఇటీవలి కాలంలో ఒక Bank manager, Bank officer గా ఉంటూ విశేషంగా సేవ చేసి లక్షల మంది ఆత్మలను ప్రభు దగ్గరికి నడిపించిన DGS Dinakaran గారు మనకు మంచి ఉదాహరణ. ఈ విషయంలో మీరు దేవుని పని చేయండి. ఒకవేళ దేవుడు మిమల్ని full time సేవకు పిలిస్తే, దేవుడే ఆజ్ఞాపిస్తే అప్పుడు resign చేయండి. ఆ స్పష్టత మీకు రానంతవరకు job continue చేస్తూ సువార్త ప్రకటించండి. దేవుడు మిమల్ని ఆశీర్వదించి ఫలింపచేయును గాకా ! God bless you!