(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: దానికి చాలా విభిన్న కోణాలలో అర్థం యేసుప్రభువే చెప్పారు. మత్తయి 20:16లో, ఈ ప్రకారమే కడపటివారు మొదటివారగుదురు. మొదటివారు కడపటివారగుదురు. ఈ ప్రకారమే అన్నాడు. అంటే అక్కడ చెప్పిన నేపథ్యం, కాంటెక్స్ట్ ఏంటంటే, ఒక ధనవంతుడు తన తోటలో పని చెయ్యడానికి కూలివారు దొరికే అడ్డా, అక్కడ పనివారు అందుబాటులో ఉండే స్థలాలకు వెళ్ళి, దినమంతా పని చేయండ్రా బాబు, ఒక దేనారము ఇచ్చుకుంటా నీకు అని కూలి కుదుర్చుకున్నాడు. తర్వాత మధ్యలో అప్పుడప్పుడు కొంతమంది వచ్చి ‘మేం పనిచేస్తాం!’ అంటే పని చెయండి! మీకు ఇవ్వాల్సింది మీకు ఇస్తాలే అంటాడు. ఆఖరున ఒక గంట సేపట్లో డ్యూటీ దిగిపోతామనే సమయంలో ఒకడొచ్చాడు, వాడిని కూడ గంటసేపటికి పని చేయించుకుని వెళ్ళేటప్పుడు, ముందు ఒప్పుకున్న వాళ్ళందరికి ఒక్కొక్క దేనారము ఇచ్చేసాడు. ఈ ఆఖరున వచ్చినవాడికి కూడ ఒక దేనారము ఇచ్చాడు. ఇస్తే వాళ్ళందరు తిరగబడ్డారు.
దినమంతా పని చేసిన మాకు ఇచ్చినంత జీతము, ఒక్క గంట పని చేసిన వారికి కూడ ఇస్తారా? ఇది అన్యాయము అంటే అప్పుడు యజమానుడు, ‘ఈ డబ్బు మీది కాదు, మీ తాతది కాదు, మీ కష్టార్జితము కాదు, నాది’. నా సొంత సొమ్ముతో నాకిష్టం వచ్చినట్లు చెయ్యడం న్యాయము కాదా? మీరేమిటి అన్యాయం అంటున్నారు. మీరు ఒప్పుకున్నది, మీకు ఇచ్చాను కదా! మరి ఇవతల వీడికి ఎంత ఇస్తున్నానో నీకెందుకు? ఇంకొకరితో నీవు పోల్చుకోవడం ఏంటి? నువ్వు ఎంత కూలికి ఆశపడి పనికొచ్చావో, అంత నీవు ఆశపడ్డ కూలీ, నీవు ఒప్పుకున్న కూలీ నీకిచ్చేసా! మిగతావాడు ఎంత తింటున్నాడు. అది నువ్వు పట్టించుకోవద్దు అసలు! అది నీ సబ్జెక్టు కాదు. అని చెప్పి నీకిచ్చినంత వాళ్ళకు ఇవ్వటానికి నాకు ఇష్టం అయ్యింది. నేను మంచివాడనైనందున నీకు కడుపుమంటగా ఉన్నదా? అని మత్తయి 20:15 లో చెబుతాడు. ఈ ప్రకారమే అన్నాడు. అంటే యేసు ప్రభువువారు రెండవసారి వచ్చినప్పుడు ఎంత లాంగ్ టైం సేవ చేసారు అనేది మాత్రమే పరిగణలోనికి తీసుకోడు . గాని How long you have served the Lord అని కాదు. What quality of service you have offered to God. నీ సర్వీస్ యొక్క క్వాలిటీ ఏంటి ? 40ఏండ్లు సేవ చేసాను అనేది అతిశయంగా చెప్పుకోవచ్చు. కాని నాలుగేండ్లలోనే ఒకడు దేవునికి ప్రీతికరమైన సేవ చేసి ఉండొచ్చు. ఇక్కడ టైం డ్యూరేషన్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాడు.
అంటే ఒకడు చాలా సంవత్సరాలు సేవ చేసాడు. ఒకడేమో ఒక సంవత్సరమే సేవ చేసాడు. అయితే ఆ కాలముయొక్క నిడివిని బట్టి బహుమానాలు ఉండవు. చేసిన సేవయొక్క గుణాలను బట్టి, పరిస్థితులను బట్టి, విధానాన్ని బట్టి, ఆ సేవకుని విలువ గుర్తించబడుతుంది.
For Example బాప్తిస్మము ఇచ్చు యోహాను ఆరు నెలలే ఆయన సేవ చేసాడు. కాని స్త్రీలు కనిన వారిలో ఇంతకంటే గొప్పవాడు ఇప్పటిదాకా పుట్టనేలేదు అని అన్నాడు యేసయ్యా! గనుక దేవుని సేవలో వేరియస్ aspects ఉన్నాయి. రేపు క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రముఖులుగా ఎంచబడిన సేవకులు తక్కువ స్థాయిలో కనిపిస్తారు. చాలా మంది దృష్టిలో ఇప్పుడు పెద్ద ప్రముఖులు కాదులే అనిపించుకున్నోళ్ళు ఉన్నత సింహాసనము మీద కూర్చోవడం చూస్తాం. అంటే దైవజనులకు మనమిచ్చే విలువలు కూడా, ఇవే మనమనుకున్న విలువలు, పలానా సేవకుడు గొప్పవాడు, పలానా సేవకుడు మాములు సేవకుడు అనుకునే. ఈ అస్సెన్మెంట్ (Assessment) క్రీస్తు న్యాయపీఠం ముందు దేవుడివ్వడు. అక్కడ అస్సెస్మెంట్ వేరు. ఇక్కడ మామూలు పాస్టరు గారు వస్తే అక్కడ మూలన కూర్చోమంటా. ఇంటర్నేషనల్ స్పీకర్ వస్తే ఉన్నత ఆసనం మీద కూర్చోబెడతాం. రేపు దేవుని రాజ్యంలో ఆ ఉన్నత ఆసనం మీద కూర్చున్నవాన్నే మూలకు కూర్చోమంటాడేమో! మనమందరము మూలకు కూర్చోబెట్టినటువంటి ఆ పల్లెటూరు భోధకున్ని, దేవుడు ఉన్నత సింహసనము ఎక్కిస్తాడేమో!
ఇప్పటి మానవలోకంలో మొదటివారిగా ఎంచబడిన ఘనత వహించిన విశ్వాసులు, దైవజనులు దేవుని రాజ్యంలో కడపటివారుగా మారిపోయే ప్రమాదం ఉన్నది. వాళ్ళ సేవయొక్క క్వాలిటీ వాళ్ళు పట్టించుకోకపోతే! నాకిన్ని లక్షలమంది వచ్చారు అని విర్రవీగడం కాదు. ఎన్ని లక్షలమంది నీకున్నారనేది దేవుడు గౌరవించే విషయం కాదది! ఆ వచ్చిన లక్షలమందిలో ఎంతమందిని నీవు షద్రకు, మేషాకు, అబెద్నెగోలుగా తయ్యారు చేయగలిగావు? నీ సేవ యొక్క క్వాంటిటీ (quantity) కాదు, నీ సేవ యొక్క క్వాలిటీ ఏంటి?
బండెడు గడ్డి ఉంటుంది, చిన్న నిప్పు రవ్వ అంటిస్తే పిడికెడు బూడిదైపోతుంది. అదే బండినిండ బంగారం ఉందనుకో నిప్పు దాన్నేం చెయ్యలేదు. కాల్చిన తర్వాత బండెడు బంగారం, బండెడు బంగారంలాగానే ఉంటుంది. So, the quality of ministry is important క్వాంటిటీ కాదు. డ్యూరేషన్ కాలము కాదు. అని ప్రభువు చెప్పే మాట!
దేంట్లో మొదటిగా ఉంటారు వీళ్ళు? బహుమానం అందుకోవడంలో, దేవుని రాజ్యంలో స్థానాలు అగ్రస్థానాలు! అందులో దేవుడు ముందు పిలిచి బహుమానాలు ఇవ్వడం. ప్రాముఖ్యత అనే మెట్టుమీద వాళ్ళు మొదటివారుగా ఉంటారు. ఇప్పుడు ఫస్టుక్లాస్లో వచ్చాను అంటాం, అంటే ఒకటే బ్యాచ్ కదా? ఫస్టు, సెకెండ్, తార్డ్ అందరూ కూడ ఒకటే బ్యాచ్ కదా? ఒకటే తారీఖున వారి రిసల్ట్స్ వచ్చినయి కాని ఆర్డర్లో (Order) ఫస్టు, సెకెండ్, తార్డ్ అనేది ఉంటుంది. అందులో మొదటివాడు.