(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: ఆదికాండములో ఉన్నట్వంటి, ఆ సృష్టి కథనంలో చెప్పినట్వంటి విషయాలు మాటలు చాలా వరకు అలంకార భాషలో యోగికార్థంలో తీసుకోవాలి. ఉదాహరణ దీనికి సహాయకరంగా ఉండటానికి ఇంకొక విషయం చెబుతాను.
ఆదికాండము 1:26లో, దేవుడు మన స్వరూపమందు, మన పోలిక చొప్పన నరులను చేయుదము, వారు ప్రతి జీవిని ఏలుదురు గాక అన్నాడు. వారిని స్త్రీని గాను, పురుషుని గాను దేవుడు సృష్టించాడని చెబుతుంది మొదటి అధ్యాయంలో, రెండవ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత 18వ వచనంలో నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అంటాడు. ఒక్కే దినముననే స్త్రీని పురుషున్ని చేస్తే మరి నరుడు ఒంటరిగా ఎప్పుడున్నాడు? ఒకే దినమున స్త్రీని, పురుషుని చేస్తే, నరుడు ఒంటరిగా ఎప్పుడు లేడు కదా? ఒంటరిగా ఉండటం మంచిది కాదని ఎందుకన్నాడంటే అక్కడ సంగతులను ఆయన సృష్టించినట్వంటి ఆర్డర్, విధానం, మెతడ్ అనేది రెండవ అధ్యాయంలో చెప్పాడు. మొదటి అధ్యాయంలోనేమో, భూమి ఆకాశములను, స్త్రీని పురుషుని సృజించాడు అని చెప్పాడు. రెండవ అధ్యాయంలో ఎలాగు జరిగిందో, ఆ విధానం వివరించాడు. అంటే దేవుడు కథనము లేక చెప్పే విధానము అనేదాంట్లో ఒక టెక్నిక్ ఉపయోగించాడు. అదేంటంటే ఒకే సంగతిని ముందు టూకిగా చెబుతాడు. తర్వాత వివరిస్తాడు. లేకపోతే ముందుగా వివరించి తర్వాత టూకీగా ఒక సెంటెన్స్లో చెప్పేస్తాడు. ఈ రెండు జరుగుతాయి.
ఇక్కడ మీరు, ఈ ఆకాశములను భూమిని సృజించెను. తరువాత చాలా కాలమైనాక సూర్యున్ని చేసాడనేమాట. విషయం ఏంటంటే, అక్కడ సూర్యుడు భూమి చేయబడ్డ తర్వాత సూర్యుడు ఉనికిలోకి వచ్చాడని కాదు. అక్కడ ఏంటంటే, ఆకాశములలో ఈ జ్యోతులు, నక్షత్రములు అన్ని ఉన్నాయి. ఆ లెక్కన ఈ నక్షత్రములన్ని కూడ భూమి తర్వాత వచ్చియా! కోటానుకోట్ల నక్షత్రాలు భూమి పుట్టిన తరువాతనే ఉనికిలోనికి వచ్చినవై ఉండాలి. కాని ఇవాళ సైన్స్ ఏం చెబుతుందంటే ఈ భూమికంటే కొన్ని కోట్ల సంవత్సరాలకు ముందునుండే సూర్యుడున్నాడు, నక్షత్రాలున్నాయి. విశ్వముయొక్క ఆయుష్కాలము, భూమి యొక్క ఆయుష్కాలం ఎంత? భూమి వయసు చాలా తక్కువ! విశ్వం వయసు చాలా ఎక్కువ. అని ఇవాల సైన్స్ చెబుతున్నది. గనుక సూర్యున్ని కలిగించాడంటే, కనబడే స్థితికి తీసుకువచ్చాడని అర్థమేకాని, ఆయన నాలుగవ దినమున లేని సూర్యున్ని ఉనికిలోకి తెచ్చాడని అర్థంకాదు. ఇది మనం ఎందుకు నమ్మాలి అంటే సూర్యుడు మన ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యము.
యేసుక్రీస్తు ప్రభువు వారు రెండువేల యేండ్ల క్రితము, కన్య మరియ గర్భము ద్వారా పుట్టినాడు. యేసు క్రీస్తు జననవిధం ఎట్లనగా అన్నాడు. యేసు పుట్టాడని బైబిల్ చెబుతూనే, ఆ బైబిల్లోనే యేసయ్య, లోకము పుట్టకముందే నేనున్నాను, నా మహిమ ఉన్నదని అన్నాడు. లోకము పుట్టకముందే ఉన్నట్వంటి నీతి సూర్యుడు, రెండువేల యేండ్ల క్రితము అంటే ఆదామును దేవుడు చేసాక నాలుగువేలయేండ్లుగడిచాక ఇలా ప్రత్యక్షమైనాడు. అంతకముందు ఉన్నాను, ఇప్పుడు పుట్టాడు అంటాడు. ఇప్పుడు పుట్టినవాడు ఇంతకముందే ఉన్నాడు. మరియమ్మ గర్భమందు పుట్టినవాడు అంతకముందే ఉన్నాడు. ఆదాము పుట్టకముందే ఉన్నాడు. అయితే ఎప్పటినుంచో ఉన్నవాడు, ఇప్పుడు మనుష్యులకు కనబడే స్థితిలోకి రావడం కూడ ఒక పుట్టుకే అన్నట్టు. ఇప్పుడు యేసుకు సాదృశ్యం అయినట్వంటి భౌతిక సూర్యుడు కూడ అంతకముందు కనిపించిన స్థితిలో ఉన్నాడు. ఆ కనబడే స్థితినుండి యేసును కనబడే స్థితికి తెచ్చినట్టుగా, ఆ సూర్యున్ని దేవుడు కనబడే స్థితికి తెచ్చాడు.
ఇప్పుడు నాలుగువేల యేండ్ల తరువాత యేసు ప్రభువు వారు పుట్టాడంటే, అది ఆయన మొదటి ఉనికి కాదు కదా? ఇది మీరు ఆలోచించాలి. ఆదాము తర్వాత 4000 సంవత్సరాలు అయ్యాక నీతిసూర్యుడొచ్చాడు. అయితే అంతకముందు ఉన్నాడుగా? అలాగే ఈ సూర్యుడూ ఉన్నాడు. ఇదీ విషయం, అందుకే ఇప్పుడు సైన్స్-బైబిలు కొ-ఇన్సైడ్ అవుతాయి. ఇప్పుడు భూమి తర్వాత సూర్యుడొచ్చాడనుకుంటే, సూర్యుడు పుట్టాడనుకుంటే సైన్సుకు, బైబిలుకు క్యాష్ అవుతుంది. భూమి పుట్టించబడిన తర్వాతనే నాలుగు రోజులైనాక సూర్యుడు పుట్టాడనుకుంటే సైన్సు కు బైబిల్కు క్లాష్ వస్తుంది. కాని నీతి సూర్యుడిలాగా అంతకముందే ఉండి కనిపించని స్థితిలోనుండి కనబడే స్థితికి ఆయన వచ్చాడు. అనుకుంటే అప్పుడు సైన్సుకు బైబిల్కు క్లాష్ రాదు. ఇదీ విషయం! నేను చెప్పిన విషయాలు బాగా మీరు ఆలోచించండి. దేవుడు మీకు వివేకం అనుగ్రహిస్తాడు.