95. ప్రశ్న : స్త్రీలు ఆదివారం సంఘంలో ప్రభు శరీరం విరువవచ్చా? బాప్తిస్మం ఇవ్వొచ్చా? సంఘ కాపరులుగా ఉండవచ్చా?

(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: పరిశుద్ద లేఖనాలను, మనం జాగ్రత్తగా పరిశీలించి, పరిశోధించి చూస్తే, స్త్రీకి సంఘములో, దేవుని ప్రణాళికలో ప్రత్యేకమైన ఒక స్థానం ఉన్నది. ఒక విశేషమైన స్థానం ఉన్నది. పురుషునికి స్త్రీ అన్ని విషయములలో సమానము కానేకాదు. అనేది బైబిల్ ఖండితంగా చెబుతుంది. ఇప్పటి ఫెమెనిష్టులు, స్త్రీవాదులు women liberation activists దీని హర్షించరు. కాని వాస్తవం ఏంటంటే, ముందు దేవుడు ఆదామును సృష్టించి, ఆదాము కొరకు హవ్వను చేసాడు. పురుషుని కొరకు స్త్రీ చేయబడింది తప్ప, స్త్రీకొరకు పురుషుడు చేయబడలేదు. గనుక ఆమెకు తప్పకుండా నెం.2 పొసిషన్ ఉంటుంది. నెం.2 in respect and honour అని కాదు. ఆమె జీవితము యొక్క ఆశయాలను, గోల్స్ను ఫిక్స్ చేసుకున్నప్పుడు, ఎవర్నైతే దేవుడు నెం.1 పొజిషన్ లో ఉంచినాడో అతనికి నేనొక కాంప్లిమెంట్గా అతనికి నేనొక ప్రోత్సాహకముగా నేనుండాలనేది ఆడవాళ్ళ మైండ్సెట్ అయిపోవాలి.
అయిపోయినప్పుడు సమాజం బాగుంటుంది. వాళ్ళకు దేవుని ఆశీర్వాదాలు ఉంటాయి. ఇది చాలా మందికి రుచించదు. రుచించకపోయినా నేనొక మాట చెప్తాను. రుచించకపోవడం కూడ అంతన్యాయం కాదు. ఎందుకంటే ఇప్పుడొక మహిళా సంఘం అధ్యక్షురాలు అనే ఒక కథ చెప్తుంటా నేను పెళ్ళిలు చేసినప్పుడు మరి ఆమె యొక్క విప్లవాత్మకమైన ఒక ప్రసంగాలు విని, ఒక యవ్వనస్తురాలు, ఆమె శిష్యురాలైంది, ఆమె ఇంట్లోకొచ్చింది. స్త్రీలు పురుషులు సమానమే! మగవాళ్ళ జులుం నశించాలి. అనే నినాదాలు ఇచ్చి ఆ ఇంటరెడియేట్ పిల్ల, అధ్యక్షురాలి అభిమానైపోయింది. తర్వాత ఈ అమ్మాయి, ఆ అమ్మగారి కొడుకుతో ప్రేమలో పడింది. ప్రేమలో పడితే తల్లి ఈ అమ్మాయిని ఇచ్చి కొడుక్కి పెళ్ళి చేసింది.
చేసాక, మహిళామండలిలో నేర్చుకున్నట్వంటి పాఠాలే ఈమె భర్తకు తొలిరాత్రిలో చెప్పింది. ‘ఏవండీ, నువ్వు ఎక్కువ, నేను తక్కువేం కాదు, నువ్వు నేను సమానమే!’ అనేసరికి అప్పుడు మహిళా మండలి అధ్యక్షురాలు అత్తగారిగా తనకు సంక్రమించిన కొత్త హోదాలో, కొత్త కోడలికి గీతోపదేశం చేసిందనే విషయం నేను చెబుతుంటాను. ఏంటమ్మాయి? ఏంటి మాట్లాడుతున్నావే? మర్యాదగా మా అబ్బాయికి నువ్వు లోబడి ఉండు! ఆడదన్నాక లోబడితేనే, వినయంగా ఉంటేనే కొంచెం గౌరవంగా ఉంటుంది! ఇక్కడ విషయం ఏంటంటే, ప్రతి స్త్రీ కూడ తాను పెళ్ళైనప్పుడు భర్తకు లోబడటానికి ఇష్టపడదేమో గాని తన కొడుక్కి పెళ్ళి చేసినప్పుడు కోడలు మాత్రం కొడుక్కి లోబడాలని ఇష్టపడుతుంది. అంటే ఈ ప్రకృతి సిద్ధమైన విషయం, స్త్రీ తన భర్తకు లోబడాలి. ఏ స్త్రీ అయినా తన భర్తకు లోబడకపోడానికి తాను సమర్ధించుకుంటుదేమో గాని కోడలు తన కొడుక్కి లోబడకపోటానికి సమర్ధించదు. కనుక అది స్వయం ఖండన! [self contradiction]. గనుక స్త్రీలందరికీ నేను దండంబెట్టి చెబుతున్నాను. మిమ్ములను దేవుడు సృజించిన ఉద్దేశం, పర్పస్ వేరు. ఆ పర్పస్లో మీరు ఇమిడి పోవాలి. ఆ ధర్మంలో ఇమిడిపోవాలి. అప్పుడు మీకు ఈ లోకంలో పరలోకంలో దైవాశీర్వాదం ఉంటుంది. ఇక్కడ మనం సబ్జెక్ట్లోకి వస్తే స్త్రీలు ససేమిరా, fledged pastors గా ఉండటానికి వీలు లేదు. బాప్తిస్మం. ఇవ్వడం ప్రభురాత్రి భోజనం విరువడం, సంఘ కాపరిత్వం చేయడానికి వీలు లేదు. కారణం ఏంటంటే స్త్రీ సంఘమునకు సూచన పోలిక! పురుషుడు క్రీస్తుకు పోలిక, సూచనయై ఉన్నాడు. గనుక స్త్రీలు, పురుషులు కలిసిన సమాజము క్రింద కూర్చుంది. ఇక్కడ పురుషుడు నిలబడి పరిపాలిస్తున్నాడనుకొండి. క్రీస్తు ప్రతిరూపాలు అక్కడ కొన్ని ఉన్నాయి. సంఘముయొక్క ప్రతిరూపాలు కూడ కొందరు స్త్రీలున్నారు. పురుష, స్త్రీ ప్రతిరూపాలు కలిసిన సంయుక్త, సంకీర్ణ, మిశ్రమ సమాజం అక్కడ ఉన్నది. ఇక్కడ నిలబడి పరిపాలన చేసేవాడు మాత్రం ఖచ్చితంగా క్రీస్తు యొక్క ప్రతిరూపము. అంటే సంఘం యొక్క ప్రతిబింబాలు క్రింద కూర్చుంటే, క్రీస్తు ప్రతిబింబం పరిపాలన చేస్తుంది. పర్వాలేదు. పోలిక కరెక్టుగానే అమర్చబడి కనబడుతుంది. అట్లా కాకుండా పురుషులందరూ క్రిందనే కూర్చొని, ఒక్క స్త్రీ వచ్చి పరిపాలన చేస్తుందనుకోండి, అంటే క్రీస్తు యొక్క ప్రతిరూపాలు, ప్రతిబింబాలు క్రింద కూర్చున్నాయి, సంఘం యొక్క ప్రతిబింబం క్రీస్తు మీద పరిపాలన చేస్తుంది. సంఘం క్రీస్తును ఏలుబడి చేసినట్టుగా ఆ విషయం ఉంటుంది.
గనుక ఈ ఫిగరేటివ్ అరేంజ్మెంట్ అనేది ఉల్టా-పల్టా, తలక్రిందులైపోతుంది. క్రీస్తు సంఘం ఏలాలి తప్ప, సంఘము క్రీస్తును ఏలకూడదు. అది అసంభవం! అలాగే క్రీస్తుయొక్క ప్రతిరూపము సంఘముయొక్క ప్రతిరూపాన్ని ఏలాలి, అధికారం చెయ్యాలి. తప్ప! సంఘం యొక్క ప్రతిరూపం క్రీస్తు ప్రతిరూపాన్ని ఏలకూడదు. అనే ఈ పోలికల యొక్క అరేంజ్మెంట్ కొరకు, స్త్రీ అధికారము చేయుటకు నేను సెలవియ్యను. మౌనంగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకోవాలి అని దేవుడన్నాడు. స్త్రీలు గ్రహించాలి, సంఘం ఎలాగు క్రీస్తు ముందు వినయం కలిగి ఉంటుందో, నేను నా స్వపురుషుడైన భర్త ముందు, క్రీస్తు ప్రతిరూపమైనట్వంటి సంఘంలోని పురుషుల ఎదుట నేనొక భక్త సమాజంలాగ మౌనంగా, అణుకువ కలిగి ఉండటంలో నాకు supreme respect and dignity ఉన్నది అనేది ఆడవాళ్ళందరు గ్రహించవలసిన విషయం. అంతే గాని మొగవాళ్ళు బాప్తిస్మం ఇస్తే, మేం ఇస్తాం. వారు ప్రభుబల్ల ఇస్తే మేం ఇస్తాం. వారు ఎక్కువేంటి? మేము తక్కువేంటి? అది మాట్లాడుతున్నారంటే, వీరు ఆదికాండం 2వ అద్యాయాన్నే నమ్మడం లేదు పురుషుని కొరకు నేను చేయబడ్డాను. అతడు పని చేస్తే నేను సహకరించాలి. తప్ప నేను పని చేస్తే అతడు సహకరించడం కాదు. అనే విషయాన్ని వారు విస్మరిస్తున్నారు. వారు భక్తిగల స్త్రీ అనటానికి అవకాశం లేదు.