97. ప్రశ్న : యోహాను 17:4 వ వచనంలో చిన్నడౌట్ ఉంది. యేసు ప్రభువు వారు సిలువవేయకముందే నేను సంపూర్ణంగా నేరవేర్చాను. అంటే ఇంకా సిలువవేయబడలేదు కదా? అప్పుడే సంపూర్ణం అంటున్నాడు. భూమిమీద నెరవేర్చుటకు నీవు నా కప్పగించిన పనిని, నేను సంపూర్ణముగా నేరవేర్చి నీ నామమును మహిమపరచితిని అంటాడు. సంపూర్ణంగా నెరవేర్చాడు కదా, ఇంకా సిలువ ఎందుకు?

(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: కాదు కాదు! ఆయన ఆ మాట చెబుతున్నట్వంటి ఆ గడియకు ముందు ఏం జరగాలో అది చేసాడు. ఇప్పుడు ఆయన లెక్క ఎప్పుడు అప్పజెప్పుతున్నాడో ఆ డేటున ఉన్న స్టేటస్ ను ఆయన చెప్పాడన్నమాట. ఆ తరువాత కూడ ఆయన చేసిన కార్యక్రమాలు బోలెడున్నాయి. ఇప్పుడు మన కొరకు విజ్ఞాపన చేయుటకు నిరంతరము ఆయన జీవించుచున్నాడు అని అన్నాడు. మరింకా మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నానని అన్నాడు. మరి ఇవన్ని చేస్తున్నాడు కదా? ఆయన కార్యక్రమాలు అయిపోలేదే! ఇంకా అపుతానే ఉన్నాయి కదా? ఏ రోజైతే తన గురించి తాను లెక్క చెప్పుకుంటున్నాడో, ఇప్పటివరకైతే కంప్లీట్గా చేసాను. ఇప్పుడు లోకాన్ని విడిచి నీదగ్గరకు వస్తున్నాను. నా మహిమ నాకిచ్చెయమని చెప్పాడు, అక్కడ ఆయన చేసిన ప్రార్థన అది.