(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: ఎందుకంటే ఆయన శరీరముగా మనం ఉన్నాము, గనుక ఆయన కూడ తీసుకున్నప్పుడు ఈ రక్తమును త్రాగుట అనేది దోషము కాకుండా పోతుంది. ఇక్కడ ఒక టెక్నికల్ ఇష్యు ఏంటంటే, రక్తాన్ని తినొద్దని అన్నాడు జంతురక్తం అయినా యేసురక్తానికి ప్రతీకే కదా? ఒక దృష్టాంతమే కదా? మరి రక్తము తింటే పాపము అన్నాడు. ఇక్కడ రక్తము త్రాగువాడే నిత్యజీవం గలవాడన్నాడు. రక్తము తింటే తప్పెందుకు? త్రాగడం తప్పెందుకు కాదు? దాన్నెందుకు మనం తీసుకోవాలి? ప్రామాణికంగా రక్తము తినుట అంటే ఘనపదార్థం అయిన తర్వాత తినటం. రక్తము, ఘన పదార్ధం ఎప్పుడవుతుందంటే, దేహమునుండి బయటికొచ్చేసినప్పుడు ఘనపదార్థం అవుతుంది గాలి తగలగానే గడ్డగట్టుకొని ఎండిపోతుంది. అది లివర్లాగా మారిపోతుంది.
గనుక తింటున్నావు అంటే దేహములో నుండి బయటకెళ్ళిపోయాక తింటున్నావు. త్రాగుతున్నావంటే అది దేహములోని ద్రవపదార్థం గానే ఉన్నది. దేహములోనుండి బయటకి పోలేదు. దేహములో ప్రవహిస్తున్నంత సేపు అది ద్రవ పదార్ధంగా ఉంటుంది.
అంటే యేసు ప్రభువులో రక్తం ఆయన లోపలి నుండి డైరెక్టుగా తీసుకునట్లా? ఇది అందరికి క్రొత్త ప్రత్యక్షతే!
ఖచ్ఛితంగా డైరెక్టుగా తీసుకున్నట్లే! యేసు ప్రభువు యొక్క ప్రాణము, మనలోపలికి ప్రవహించడానికి ప్రభురాత్రి భోజనము ఒక సాధనం అందుకే యేసులోని రక్తం డైరెక్టుగా విశ్వాసిలోనికి వస్తుంది.
అందుకే కదా, ఇప్పుడు నన్ను తినువాడు నామూలముగా జీవించుచున్నాడు. ఆయన మూలంగా జీవించడం అంటే ఈ లోకంలో ఎదుర్కొనే ప్రతి పరిస్థితిని, మన స్థానంలో యేసు ఉంటే ఎలా ఎదురుకుంటాడో, ఎలా ప్రతిస్పందిస్తాడో అలాగ మనం ప్రతిస్పందిస్తామని అర్థం. యేసుమూలముగా, మనం యేసువలెనే రియాక్టు అవుతా ఉంటాం. నేచర్, క్యారెక్టర్, లైఫ్, లైఫ్ ఎనర్జీ మన లోపలికి ఈ ప్రభురాత్రి భోజనం ద్వారా వచ్చేస్తుంది.