104. ప్రశ్న : ప్రకటన 22వ అధ్యాయంలో రెండవ వచనంలో మనము మహిమ దేహాలు ధరించిన తరువాత పరలోకంలో ఆ చెట్టు యొక్క ఆకుల ద్వారా మళ్ళీ స్వస్థత ఏమిటి? రక్తమాంసము లేనట్వంటి దేహము కదా? అక్కడ మళ్ళీ మనకు రోగం ఉంటుందా? దాన్ని దేవుడు ఎందుకు స్వస్థపరచాలనే ఒక ప్రణాళిక ఉంది. క్లారిటీగా వివరించగలరు?

(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: దయచేసి మహిమ ప్రపంచం అనే పుస్తకం చదవండి. ఈ ప్రశ్నకు నేను మహిమ ప్రపంచం అనే గ్రంథంలో నేను జవాబిచ్చాను. ఇప్పుడు నాకు మీరు ఇంకొక క్లారిటీ ఇవ్వాలి. ఈ సంగతి నీకర్థంకాక అడిగావా? ఈ సంగతి అందరికి తెలిస్తే మంచిదని అడిగావా? అందులో ఒకటి గంభీరమైన ఒక విషయాన్ని, దేవుని నడిపింపుతో చెప్పాను. ఏంటంటే ఆదాము, హవ్వ వాళ్ళిదరూ పెళ్ళి చేసుకున్న తర్వాత, వాళ్ళిద్దరి కలయికలో నూతన మానవజాతి ఈ గ్రహంమీద ప్రారంభమైంది. అలాగే కడపటి ఆదాము క్రీస్తు ప్రభువారు, కడపటి హవ్వ సంఘం కడపటి హవ్వ సంఘం, కడపటి ఆదాము పెళ్ళి చేసుకున్న తర్వాత అప్పుడు కూడ కొత్త జనంగాలు పుడుతాయి. ఆ కొత్త జనాంగము పుడుతారు. గనుకనే ప్రతి జనము దానిలోనే జన్మించెను. అనే మాట 45 కీర్తనలో ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నదని. అందులో ఆఖరికి వచ్చి అంటాడు. నీ పితరులకు బదులుగా నీకు కుమారులుందురు పితరులకు బదులుగా నీకు మళ్ళీ వారసులుంటారు అని చెబుతాడు. అంటే యేసు ప్రభువనే కడపటి ఆదాముకు పితరులుండరు. ఆయనే ఆది పురుషుడు, మూలపురుషుడు గనుక! అయితే సంఘమునకు యేసుకు కలిసి పిల్లలుంటారు. ప్రతి జనము కూడ నూతన యెరుషలేమునుండే పుట్టుకొస్తుంది. పైనున్న యెరుషలేము మనకు తల్లి.

మీకు తెలుసో లేదో, సీయోను పురమా, సర్వోన్నతుని శృంగార పురమా అనేది హెబ్రోను పాట పుస్తకంలోనిది. పి.జె. పాల్గారు రాసిన పాట అందులో జనముల తల్లి అని నిన్నందరు. సీయోను పురమా అని ఒక చరణం రాసారాయన! జనముల తల్లి అనేది క్రీస్తు సంఘానికున్నట్వంటి పేరన్నమాట. క్రీస్తు సంఘానికి ఉన్నట్వంటి పేరు జనముల తల్లి అనేది బైబిల్లో ఉన్నట్వంటి ప్రత్యేకమైన ప్రవచనము. ప్రతి జనము దానిలోనే
జన్మించెను కీర్తనలు 87:5వ వచనములో. ఇప్పుడు అనేక జనములు పుట్టిన తర్వాత ఈమె పుట్టింది సీయోను లేక యెరుషలేము జనాంగం. మరి ప్రతిజనం ఆమెలో పుట్టడం అంటే అర్ధం ఏంటంటే రాబోయే కొత్త భూమి, కొత్త ఆకాశము ఉన్నది. కొత్త భూమి కొత్త ఆకాశములో కడపటి ఆదామున్నాడు, కడపటి హవ్వకు పెళైంది. వాళ్ళనుండి కొత్త జనంగాలు పుడుతాయి. వాళ్ళకవసరమైన స్వస్థత, ఈ సీయోను పురములో లేక యెరుషలేము పట్టణంలో జీవవృక్షపు ఆకులద్వారా వస్తాయి. అక్కడేం రోగాలుంటాయి? అంటే క్యాన్సర్, టీబి ఉంటాయని కాదు. పాతవి, గతించెనని అన్నాడు. కొత్త భూమి, ఆకాశము, హవ్వ కొత్త జబ్బులు కూడ ఉండొచ్చు. మరి అవి ఇప్పుడున్న జబ్బుల వంటివి కాకుండ ఏదో ఒక విధమైన బలహీనత సంభవిస్తూ ఉండొచ్చు. వాళ్ళకు బలహీనత సంభవించినప్పుడల్లా, అమ్మ ఉందక్కడ అంతరిక్షంలో, భూమి చుట్టూ తిరుగుతున్న తల్లి నూతన యెరుషలేము పట్టణం, మరి దేవుని భార్య యేసుక్రీస్తు భార్య ఆమె దగ్గరకు వెళ్తే మనకు అన్ని రోగాలు కుదుర్చబడతాయని, భూమిమీద ఉన్నట్వంటి జనాలు చెప్పుకుంటూ ఆమెకు నమస్కరిస్తారు. మహిమ ప్రపంచం అనే గ్రంథం చదవండి నాయనా! God bless you