107. ప్రశ్న : మొన్న రీసెంట్గా స్వత్యమేవజయతే పాత ప్రసంగం విన్నానండి, 2సమూయేలు 7:15లో కొట్టివేసిన సౌలుకు నా కృప దూరమైనట్లుగా అతనికి నా కృప దూరము చేయను. అక్కడ సౌలుకి కృప దూరం చేయటం అనేది, సౌలుకి ఆల్రెడీ పరదైసులోకి వెళ్ళడం అనే దాన్ని వివరించండి. సౌలు చివర్లో ఆత్మహత్య చేసుకున్నాడు కదా? ఆయన పరదైసులోకి వెళ్ళాడు అన్నది కన్ఫామే దీన్ని మీరెలా సమర్థిస్తారు? ఆదాము నుండి మోషేవరకు మరణము ఏలెను రోమా 5:18లో ఉంది కదా? మోషే ముందువరకా? ఇంక్లుడింగ్ మోషేనా? అది మోషే పునరుత్థానము గూర్చేనా?

(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: మోషే జీవిత ఘట్టం దాకా మరణం యొక్క పరిపాలన జరిగింది. మోషే జీవితంలో మరణం యొక్క పరిపాలన భంగం అయ్యింది. మరణం యొక్క పరిపాలనకు సవాలు ఎదురైంది. ఏంటంటే పునరుత్థానము చెందించబడ్డాడు.
ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న నేను కొట్టివేసిన సౌలుకు నా కృప దూరం అయినట్టు, నీ కుమారుడు సొలొమోనుకు నా కృప దూరము చేయనన్నాడు. ఇక్కడ కృప దూరమగుట అనేది సబ్జెక్టు ఇప్పుడు కృపలో ఉంటే రక్షణపొందుతారు. కృప అనేది దూరమైతే నిత్యనాశానానికి వెళతారు. అనేది సాధారణంగా ఉన్నట్వంటి కాన్సెప్టు.
కృప పొందిన వారందరు పరలోకంలో ఉంటారు. కృపకు దూరం అయిపోతే మొత్తమే భ్రష్టులైపోతారు. క్రీస్తులోనుండి వేరైపోతారు. అగ్నిగుండానికి వెళ్ళిపోతారనేది కాన్సెప్టు. ఇక్కడ కృపలో రెండు భాగాలు అనేది నేర్చుకోవలసిన కొత్త కాన్సెప్టు (concept) కొత్త భావన. అదేంటంటే భూలోక జీవితకాలములో పాపములనుండి శోధనలనుండి, సాతాను యొక్క ఉచ్చుల, వలలలోనుండి, ఉరులనుండి మనలను కాపాడే కృప. మన మనోనేత్రాలు వెలిగించే రక్షకుడు ఎవరనేది మనకు అర్థం చేయించే కృప!.
ఇంకొక కృప ఉన్నది. అదేంటంటే మనం దేవుని ముందు వెళ్ళి నిలబడటానికి మనకు ఆ యోగ్యతనిచ్చి, కృపనిచ్చి మనకు అవకాశం ఇచ్చేటటువంటి కృప. 1పేతురు 1:13 చూడండి చదవండి. యేసు ప్రభువు వారు ప్రత్యక్షమైనప్పుడు ఆయన మన కోసం కృప తీసుకుని వస్తున్నాడు. అని ఇక్కడ చెబుతున్నాడు. అంటే ఇప్పుడు మనకు కృప ఉన్నదా? లేదా? దావీదు, ‘నా బ్రతుకు దినములన్నిటను కృపా క్షేమములే నా వెంట వచ్చునని’ దావీదు చెప్తాడు. మరి ఇప్పుడు భూమిమీద మనకు కృపాక్షేమములు ఇప్పటి జీవితకాలంలో వెంట వస్తున్నయా? రావడం లేదా? ఇప్పుటి జీవితకాలంలో దేవుని కృప మనకు తోడై ఉంటే యేసు వచ్చేటప్పుడు తెచ్చే కృప ఏంటి మరి? ఎఫెసి 2:8 ప్రకారం మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు అన్నాడు. మరి కృప ద్వారా మనము రక్షణ పొందిన తరువాత యేసు వచ్చేటప్పుడు తేబడే కృప ఏంటి? అంటే మన నిత్యభవితవ్యము నిర్ణయించే ఘట్టములో కూడ స్పెషల్గా నీకు, నాకు విశ్వాసులందరికీ దేవుడు కృప ఇస్తాడు. ఈ భూమి మీద ఉన్నప్పుడు మనకు రోగ స్వస్థత, పాప క్షమాపణ, దేవుని గూర్చిన జ్ఞానము కలుగుట, దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చటానికి మనకు శక్తినిచ్చే కృప, అన్ని భూలోకసంబంధమైనట్వంటి అవసరమైనట్వంటి కృపలు.
కానీ నిత్యతంలోకి వెళ్ళిపోతున్నాం. Eternal Fate and Eternal destiny అనేది మన నిత్య భవితవ్యమ్ అనేది నిర్ణయించే ఘట్టంలోకి వెళ్ళినప్పుడు అప్పుడు మనకు ఇంకా చాలా కృప అవసరం అవుతుంది. గనుక ఈ
భూమి మీద మాత్రమే కొంత మందిని దండించి, నిత్యత్వంలో వాళ్ళ ఆత్మలను కాపాడడం అనేది కూడ దేవుని కృపారక్షణలోని ప్రత్యేక విధానం. దీన్ని మీకింకా క్లియర్గా చెప్పటానికి నేనొక విషయం మీ దృష్టికి తీసుకుని వస్తాను. 1కొరింథీయులకు 5:4 చదవండి శరీరము నశించుటకై అంటే మరణించడమే! యేసు దినమందంటే రెండవ రాకడ సమయంలో న్యాయతీర్పు సింహాసనముకెళ్ళె సమయంలో వీరి ఆత్మ రక్షింపబడాలంట! వాని ఆత్మ రక్షింపబడినట్లు ఇప్పుడు వీని శరీరము నశించుటకై అట్టి వారిని నేను సాతానుకు అప్పగించాను. అంటే సాతాను గాడు మరణము యొక్క బలముగలవాడు. అని బైబిల్ చెబుతుంది. ఆది నుండి వాడు నరహంతకుడు. వాడు మనుషులను చంపాలని చూస్తుంటాడు. గనుక వానికప్పగించే, కాపుదల లేదన్నమాట, కాపుదల లేకపోతే డెఫినెట్లీ ఏ అక్సిడెంట్, ఏదో కలిగించి చంపేస్తాడు. ఆ రీతిగా వారి శరీరము నశించినటైతే, ఇక వాడు పాపము చెయ్యడానికి అవకాశం ఉండదు. గనుక యేసుక్రీస్తు రెండవరాకడ దినమందు వాని ఆత్మయైన రక్షింపబడుతుందన్నాడు. అంటే భూమి మీద కాపాడి కృపను దూరముచేసి పరలోక నూతన మహిమలో ప్రవేశించే కృపను ఇస్తున్నాడు. ఈ కాన్సెప్టె పౌలు విషయంలో జరిగింది అని నేను చెబుతున్నాను.
పౌలు శరీరము నశించాలని దేవుడు నిర్ణయించాడు. వాడు బ్రతికి ఉండకూడదు, వాడు జీవించి ఉంటే రెండు నష్టాలు జరుగుతాయి. వాడింక ఎక్కువ పాపం చేస్తాడు. రెండవది అతనిలాగానే ప్రవర్తించే ఇతరులకు భయముండదు. వాడు చచ్చిపోతే వేరేవాడు అదేతప్పు చేయ్యకుండ ఉంటాడు. సౌలురాజు దేవుని కాపుదలను పోగొట్టుకున్నాడు, దేవుని కృపను పోగొట్టుకున్నాడు. అతనివలె నేను జీవించగూడదు అని భక్తులు, భక్తి నేర్చుకుంటారు. అందుచేత వాడు చచ్చిపోవాలి. వాడు చచ్చిపోతే రెండవ లాభమేంటి? ఈ శరీరము నశించింది గనుక ఇంక దేవునికి ఇష్టంకాని తప్పులు వాడు చేయకుండ పరలోక మహిమలో ప్రవేశించడానికి కనీసం ఆ కృపైనా పొందుతాడు. గనుక కృప దూరం అయిందంటే భూలోక కృప మాత్రమే దూరమైంది. రాకడ కృప దూరము కాలేదు. అనే విషయం ఇక్కడ వీడికి జరిగినట్లు ఈ కొరింథీ సంఘములోని ఎల్దరుకు జారత్వంలో పట్టబడినట్వంటి ఆ మనిషికి జరిగినట్టు భూలోక కృప మాత్రమే దూరమైంది. పరలోకానికి చేర్చే కృప దూరం కాలేదు. అదీ విషయం.
రెండవ ప్రశ్న ఏంటంటే, ఆత్మహత్య చేసుకున్నాడు కదా? అని దానికి జవాబు అపోస్తలుల కార్యాలు 17:30 ఆ అజ్ఞానకాలములు దేవుడు చూచి చూడనట్టు ఊరకుండెను. ఆత్మహత్య చేసుకున్నోళ్ళు అందరికీ ఒకే రకమైన తీర్పు వర్తిస్తుందని మనం చెప్పలేం! వాడు అజ్ఞానమును బట్టి చేసాడా? లేకపోతే అసలు ఎందుకు ప్రాణం పోయింది? ఎప్పుడు పోయింది? ఏ దశలో ఏం అనుకున్నాడు? ఆ చర్య జరిగినప్పుడు ఆ ప్రక్రియ జరిగినప్పుడు వాడి అంతరంగ విశ్వాసం ఏమిటి? దేవుణ్ణి ఏ రీతిగా చూసాడు? అవన్ని ఆ కేసునుబట్టి, Contextual గా, సిచ్చువేషనల్గా (Contextual and situational) దేవుడే తీర్పు తీరుస్తాడు. కనుక తొందర పడి ఎవరికి మనం తీర్పు తీర్చొద్దు. కాని ఒకటి మాత్రం వాస్తవం. ఆత్మ హత్య చేసుకొమ్మనేది దేవుడిచ్చే తలంపు కానేకాదు. దేవుడు ఎప్పుడు కూడ ఆత్మ హత్య చేసుకోమని చెప్పడు. ఆత్మహత్య చేసుకొమ్మని ఎప్పుడూ సైతానే చెప్తాడు! సైతాను స్వరాన్ని వినకండి. ఎవరైనా మీరు ఎన్ని కష్టాల్లో ఉన్నాసరే, మీరు ఆత్మహత్య చేసుకోవడానికి వీలులేదు. మీరసలు ఆ తలంపే రానియొద్దు. ఏ కష్టమైనా ఎదుర్కుందాం, ఈ లోకములోనే దేవుని కృప పొంది. జయం పొందుదాం. యేసయ్య సరిపోతాడు మనకు! ఎంత భయంకర సమస్యలో అయినా యేసయ్యను పేరుపెట్టి పిలిస్తే వచ్చేస్తాడు. ఆత్మహత్య చేసుకునే కర్మ యేసయ్య పిల్లలకు పట్టదు పట్టబోదు. గనుక దయచేసి Don’t think of suicide. suicide is a very foolish stupid thought.