108. ప్రశ్న : ఈ మధ్య ఆంధ్రప్రదేశ్లో చూసినట్లేతే సీ.ఎం. జగన్ గారు క్రైస్తవ పాస్టర్లకు నెలకు 5000/- అమౌంట్ ఇస్తానని చెప్పాడు.  దానికి పాస్టర్స్ అందరూ కూడ అప్లై చేసుకోవచ్చా? చేసుకోరాదా? ఏ విధంగా ముందుకెళ్ళాలంటారు?

(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)

జవాబు: చాలా మంచి ప్రశ్న సమకాలీన ప్రాముఖ్యత గలిగిన ప్రశ్న అడిగారు. ఆక్చువల్ గా ఈ ప్రశ్నను మనం అనేక కోణాలలోనుండి మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది.  ప్రపథమంగా ఒక మతానికి సంబందించిన మత ప్రభోదకులకు, ప్రభుత్వనిధులు ఇవ్వడం అనేది సెక్యూలర్ వ్యవస్థలో ఇది ఎంతవరకు సమర్థనీయము? ఆ లెక్కనా ముస్లీం Priest లు అందరికి ఇవ్వాలి.  హిందువుల పూజార్లందరికి ఇవ్వాలి. హైందవ పురోహితులు అంటే అర్చకులు అంటే దానికి లెక్క పత్రం, అంతూ ఏమీ ఉండదు. ఎందుకంటే ఏ చెట్టుక్రిందైనా, ఏ రోడ్డు సెంటర్లోనైనా ఒక దేవత దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళవచ్చు. అలా వెళ్ళిన వారికి ఒక అర్చకుడు ఏర్పడొచ్చు, చిన్న దేవాలయం ఏర్పడొచ్చు. అతనికి కూడ ఇవాల్సి ఉంటుంది. కనుక ఈ గందరగోళం తెచ్చిపెట్టుకునేకంటే ఏ మతానికి ఉన్నట్వంటి వ్యవస్థ వాళ్ళ క్రమశిక్షణ ప్రకారం, వాళ్ళ ఆ మతాన్ని maintain చేసుకోవడానికి ప్రభుత్వం వదిలేసి, అందులో వేలు బెట్టకుండా, జోక్యం చేయకండా ఉండాలి గాని క్రైస్తవులకు ఇస్తాననడమే సమర్థనీయం కాదు! ఇది పాయింట్ నెం. 1.ప్రభుత్వం ఏంటి? మత ప్రచారానికి డబ్బులియ్యటం ఏంటి? ఇది చాలా ఖండనీయం, అభ్యంతరకరం.

రెండవ సంగతి, మేము మీకు హానరోరియం ఏదో ఒక నెలసరి జీవనభృతి ఇస్తాము.  అని చెప్పి అడుగుతూ, మీకు బైబిల్ కాలేజీ సర్టిఫికెట్ ఉన్నదా? మీ ఆర్డినేషన్ సర్టిఫికెట్ ఉన్నదా? మీరు పాస్టర్ అని ఎలాగ నమ్మాలి? మీకున్న అధికారం ఏంటని? ఇవన్ని అడుగుతున్నారు. ఇప్పుడు ఇది డైరెక్టుగా మనకున్న మతస్వాతంత్య్రంలో జోక్యం చేసుకోవడమే.  ఎందుకొరకంటే, బైబిల్ కాలేజీలో మీరు గ్రాడ్యుయేషన్ అయ్యారా? చదువుకున్నారా? ఒక సర్టిఫికెట్ ఉన్నదా? అని అడుగుతున్నారు. ఎందుకండీ మీకావివరాలు అంటే రేపు పొద్దున మీరు ఎక్కడైనా సువార్త చెప్పుకున్నప్పుడు, మరి ఏ అధికారంలో చెప్పుకుంటున్నారు? మిమల్ని పాస్టర్గా ఎలా గుర్తించాలి? అనే సంగతి కలెక్టర్ ర్యాంకు నుండి లోకల్ యస్.ఐ. ర్యాంకు వరకు అధికారులు అడుగుతా ఉన్నారు. ఇదంతా కూడ లేనిపోని ఒక న్యూసెన్స్(Nuisance) సృష్టించడమే తప్ప, ఇంకేం కాదు. ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఇష్యు ఏంటంటే సువార్త చెప్పేవాళ్ళకు బైబిల్ కాలేజి డిగ్రీ ఉండి తీరాలనే నియమం బైబిల్లో లేదు.  ఇటు రాజ్యాంగంలో లేదు. మత ప్రచారం చేసుకోడానికి సామాన్య పౌరుడు సరిపోతాడు.  దానికి (Qualified, Certified, Ordained) అక్కరలేదు. ఇప్పుడు నాకు ఏ సర్టిఫికేట్ లేదు.  ఏ ఆర్డినేషన్ లేదండీ.  యేసే దేవుడని నా హృదయంలోని అభిప్రాయం. నేను చెప్పుకుంటాను దానికి సర్టిఫికెట్ అక్కరలేదు.  నా విశ్వాసాన్ని నేను ప్రకటించుకుంటాను. ఇప్పుడు బాబా సాహేబ్ గారు రాజ్యాంగంలో పొందుపరచిన మతస్వాతంత్య్రంలో ఉన్న క్లాస్ (clause) ఏమిటి? ప్రతి పౌరుడు తనకున్న విశ్వాసాన్ని తను ప్రచారం propagate చేసుకోవచ్చు. అంతేగాని ప్రతిపౌరుడు తన విశ్వాసాన్ని చాటింపు చేసేటప్పుడు తగిన అర్హతలు కలిగి ఉండాలని బాబాసాహేబ్గారు చెప్పలేదు.  గనుక ఇదంతకూడా నాన్సెన్స్, అర్థరహితమైన వ్యవహారం నేను వ్యక్తిగతంగా, రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ అధ్యక్షునిగా, ఇండియా ప్రజా బంధు పార్టీ అథ్యక్షునిగా ఒక సాధారణ భారతీయ పౌరునిగా దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాను. అసలు దీంట్లో గౌర్నమెంట్ జోక్యం చేసుకోనే వద్దు. ఇది రెండవ ఇష్యు.

గౌర్నమెంట్ అడగొద్దు! నువ్వు నేను పాస్టర్ అనుకుంటే నాకు డబ్బులివ్వాలని అనుకుంటే ఇవ్వు! అంతేగాని నీకు అర్హత, సర్టిఫికెట్ ఉందా? అంటే ఇక్కడ లక్షలమంది రక్షణ పొందారు. వాళ్ళను రక్షణలోకి నడిపించినట్వంటి నాయకున్ని చూస్తే వాళ్ళకు ఏ సర్టిఫికెటు ఉండదు.

            కొంతమందికి మంచి సర్టిఫికేట్ ఉంటుంది. వాళ్ళు ఏదో ఒక సంస్థలో చర్చిలో జేరి, ఉద్యోగం చేస్తుంటారు తప్ప. వాళ్ళు ప్రచారం చేసేదుండదు. ఎవర్ని కన్విన్స్ చేసేదుండదు, ఎవర్ని కూడ ప్రభులోకి నడిపించలేరు. గనుక అది కూడ గవర్నమెంట్ మాట్లాడవలసిన సబ్జెక్టు కాదు. Some so-called bible college graduates and so-called qualified people, they are totally fruitless in the ministry వాళ్ళు ఫలరహితంగా, ఫలాలు లేకుండా  ఉన్నారు. కొంతమంది మోకాళ్ళ ప్రార్థన జీవితమే వాళ్ళ బైబిల్ కాలేజీ. ఏకాంతంగా బైబిల్ చదువుకోవడమే వాళ్ళకున్నట్వంటి క్వాలిఫికేషన్. మరలాంటివారు వేలమందిని ప్రభులోనికి నడిపించారు.  మరి మీ సర్టిఫికేట్ ఏంటి మీ అర్హత ఏంటి అనే అధికారము, అలా ప్రశ్నించే అధికారం అసలు గౌవర్నమెంట్కు ఎవరిచ్చారు? అదొకటి.

            మూడవ ఇష్యు ఏంటంటే, అసలు మనకున్న హక్కులేమిటి అన్న విషయంలో క్రైస్తవ సమాజమే ఒక ఏకాభిప్రాయంలోకి రావాలి.  క్రైస్తవ సమాజంలోనే కొంతమంది, బైబిల్ కాలేజీ గ్రాడ్యువేట్లుగా ఉన్నవాళ్ళు అలాంటి సర్టిఫికేట్ లేకుండ సేవచేసేవాళ్ళను చిన్న చూపు చూస్తారు. అసలు గుర్తించనే గుర్తించరు. వీడు వాడ్ని చిన్న చూపు చూస్తాడు. ఆ చిన్నవాడు అనబడ్డవాడేమో వందలమందిని వేలమందిని ప్రభులోకి నడిపిస్తూ ఉంటాడు. వీడు నేనేదో గొప్ప క్వాలిఫైడ్ అనుకుని విర్రవీగేవాడు, కాలర్ ఎగరేసేవాడు ఎందుకూ కొరగాకుండా, ఏమీ ఫలము లేకుండా ఉంటాడు.  గనుక ఇప్పుడు గవర్నమెంట్, మీ సర్టిఫికేట్ ఏంటని అడుగుతున్నది. నేను ఏ ఆత్మలు సంపాదించలేకపోయినా గవర్నమెంట్ అడిగిందోకటి నాదగ్గర ఉన్నది గదా? అనే గర్వం వచ్చేస్తావున్నది. గనుక ఇది మల్టీ ఫేసిటెట్ ప్రాబ్లమ్గా మారిపోయింది.

            గనుక first of all నేను చెబుతున్నాను.  అసలు మత విషయాలలో మీకు క్వాలిఫికేషన్ ఏంటి? ఎందుకు సేవ చేస్తున్నారు? ఎప్పటినుండి చేస్తున్నారు? మీ సర్టిఫికేట్ ఏంటని? అడుగుతున్నారు గదా.  క్రైస్తవ నాయకులను! మరి హిందూ పురోహితులు, పూజారులు, అర్చకులందర్ని కూడ అడగండి! అడుగుతున్నారా మరి? ఈ చెట్టు క్రింద దేవాలయాలు, రోడ్డు సెంటర్లో దేవాలయాలు, చౌరస్తాల్లో దేవాలయాలు, రోడ్లు బ్లాక్ చేసి, ట్రాఫిక్ obstruction చేసి, ట్రాఫిక్ న్యూసెన్స్ చేస్తున్నట్వంటి చిన్న – చిన్న దేవాలయాలకున్న అర్చకులందరికి అడుగుతున్నారా మరి? మీకేం అర్హత ఉంది అని? మా విశ్వాసం సార్ అని అంటాడు.  ఆయన ! దాన్నందరూ గౌరవించాలి గనుక ఎవరుపడితే వాళ్ళు ఎక్కడైనా గుడులు పెట్టుకోవచ్చు.  రోడ్డు సెంటర్లో, ఊరు మధ్యలో ఎక్కడైనా పెట్టొచ్చు.  మరి చర్చీలకు మాత్రం బోలెడు రూల్సన్ని వర్తింపజేస్తారు. ఇదంతా మనువాదుల మతవివక్ష! మతసంబంధమైనట్వంటి స్వాతంత్ర్యాన్ని అణచివేసే మనవాదుల కుట్రయే అని నేను స్థిరంగా నమ్ముతున్నాను. ఈ టోటల్ ప్రాసస్ అంతటిని ఆపాలని ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటికెషన్ బిల్ కోర్టులో వేయ్యాలని డిసైడ్ అయిపోయ్యాం.

            క్రైస్తవ నాయకులందరూ కలసి రండి ఆర్కేపీ (RKP) నాయకత్వంలో మీరు పని చేస్తే మీకుండే వెసలుబాటు వేరు. సౌకర్యాలు వేరు ఆర్కేపీ (RKP) న్యాయకత్వంలో ఎంతమంది వస్తే అంతమందిని కూడ గట్టుకుని ప్రాసస్ అంతటిని వెంటనే ఆపేయాలని ఒక బిల్ వేయబోతున్నాం.