(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: మంచిది, నీవు ప్రశ్నయితే అడిగావు కాని, ఇందులో ఆధ్యాత్మిక మర్మం ఏమీ లేదు. ఇందులో ముఖ్యమైన సంగతేంటంటే, మాములుగా మనలాంటోడు చెయ్యలేని పని చేసాడు గనుకనే సంసోను దైవశక్తి, దైవబలం కలిగిన వాడు. ఆయన అడవి అంతా తిరిగి అన్ని నక్కలను పట్టుకొచ్చాడంటే మనం చేయ్యలేనిది ఇంకెన్నో ఆయన చేశాడు. ఇప్పుడు ఇన్ని నక్కలు ఎలా దొరికాయి? అని సంసోను గురించి మీరడిగితే సింహమును ఎలా చీల్చి చంపాడని కూడ మీరు అడగాలి. మనం సింహాన్ని చీల్చగలమా? చీల్చలేం కదా? గనుక దేవుని శక్తి పొందుకుని దేవుడిచ్చిన సామర్థ్యం చేత సాధారణ మానవులు చేయలేనివెన్నో కార్యములు సంసోను చేసాడు. గనుక దేవుడే అతనికి శక్తిని ఇచ్చినప్పుడు ఏదైనా చేస్తాడు. ఏ అసంభవమైన కార్యమైనా చేస్తాడు. తరువాత ఇవన్ని కూడ ఫిలిష్తీయుల చేలలోకి ఎలా పరిగెత్తినాయి? అంటే దేవుడే ఇలాగ చేయమని ప్రేరేపించెనని ఉంది కదా!
సంసోను ఫిలిష్తీయులకు ఏమైనా చెయ్యమని దేవుడు రేపెను అనే మాట ఉంది. ఏ దేవుడైతే సంసోనును ఏదైనా చెయ్యమని రేపాడో, ఆ దేవుడే నక్కలను నడిపించి, అన్ని వాళ్ళ పొలాలను తగులబెట్టెటట్టుగా చేశాడు. దేవుడు వాటిని తోలుకుని పోయాడంతే! ఎందుకంటే ఫిలిష్తీయులకు శిక్ష రావాలని కదా దేవుని ఉద్దేశ్యం. గనుక ఈ నక్కలను నడిపించడం కూడ దేవుని కార్యమే!