(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: అలా తీసుకొచ్చినా దాని వల్ల ప్రయోజనం ఉండదు నాయనా! ఒక విషయం చెబుతాను. ఇప్పుడు హిందూ సాంప్రదాయంలో గుడిలో ప్రసాదం తెచ్చి ఇంట్లో తింటారు. ఇప్పుడు క్రైస్తవ సాంప్రదాయంలో అలాగే ప్రసాదం తెచ్చుకుని ఇంట్లో తింటే దాంట్లో ఆశీర్వాదం ఉంటుందనే కాన్సెప్టు మనకు లేదు. అక్కడ క్రీస్తు శరీరముగా సంఘము ఒక సమాజముగా, సమూహంగా సమావేశమైనప్పుడు రొట్టె విరిచి ప్రార్ధన పూర్వకంగా తిన్నప్పుడు అనేకులమైన మనము రొట్టె ఒకటే, పాత్ర ఒకటే!. మనం అనేకులం గనుక మనం ఏకశరీరమనే సాక్ష్యం అక్కడ వస్తుంది అందరం కలిసి ఒక రొట్టెనే తింటున్నాం, ఒక్క పాత్రలోనిది త్రాగుతున్నాం. గనుక మనము ఒక్క శరీరమని పౌలుభక్తుడు చెప్తుంటాడు.
అందుచేత ఇప్పుడు ఇంటికి తీసుకుపోయి తినడం అనేది, for example మీరే ఊహించండి! రొట్టె విరిచిన తర్వాత యాభైమంది, యాభై ముక్కలు ఇండ్లలోకి తీసుకొనిపోయి తిన్నారనుకోండి, వీళ్ళందరు ఏక శరీరమనే దృశ్యం అక్కడ కనబడదు కదా? కాబట్టి దాని వల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. కనీసం అలా ఇంట్లోకి మీరు కావాలనప్పుడు, మీరొక పని చేయొచ్చు. ఏంటంటే ఒక దైవజనున్ని ఎవరినైనా request చేసి, ఆయన మీ ఇంట్లోకొచ్చి మీతోపాటు మోకరించి ప్రార్థన చేసి, రొట్టె విరచి మీకివ్వొచ్చు. ఆయన మీ ఇంట్లోకొచ్చి మీరు మీ సతీమని, మీ పాస్టరు గారు, ముగ్గురు కలిస్తే అదే సంఘం. యేసయ్య కోరింది ఇద్దరు లేక ముగ్గురు అనే అన్నాడు కదా ఆయన! ఆయనకు వందలమందేం అక్కరలేదు. ఆ ముగ్గురు, మీరు, మీ భార్యగారు, పాస్టరుగారు, మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా పెద్దలుంటే వాళ్ళు రక్షణ పొందిన యవ్వనస్తులుంటే వాళ్ళు ఎంతమంది ఉంటే అంతమంది. వాళ్ళు ఉదయం తీసుకున్న వాళైనా, తీసుకోలేని వారైనా సరే మీ ఇంట్లో పాస్టరుగారిని రిక్వెస్ట్ చేస్తే వారు వచ్చి మోకరించి రొట్టె విరువవచ్చు.
మా సంఘంలో మేము అలాగే చేస్తుంటాం ఆరాధనకు రాలేని వాళ్ళకొరకు మా ఇంట్లోకొచ్చి ప్రభుబల్ల ఇవ్వండి అన్నప్పుడు మళ్లి అక్కడ మోకరించి, ప్రార్ధన చేసి, రొట్టె విరచి ఇవ్వొచ్చు. అంత ఆశీర్వాదం ఇక్కడ కూడ ఉంటుంది.
ఆలస్యం అయినప్పుడు చర్చికి వెళ్ళి తీసుకోవచ్చా?
చర్చికి వెళ్ళినప్పుడు కూడ మీతోపాటు కనీసం ఒకరిద్దరు ప్రార్ధన చేసి తీసుకోవాలి. అది సంఘముగా చేయవలసిన పనిగాని ఒంటరిగా చేసే పని కాదు.