113. ప్రశ్న : ఇశ్రాయేలు దేశంమీద అందరి చూపు ఆకర్షిస్తున్నట్లూ కనబడుతున్నాయి. ఈ పరిస్థితులన్ని కూడ మొన్నటి వరకు నక్కలు రావడం తరువాత అన్ని మతాలను గూర్చిన సైన్స్ ఇశ్రాయేలు దేశంలో వెలువడడం! ఈ విషయాలన్నీ చూస్తా ఉంటే యేసుక్రీస్తు రెండవ రాకడ దగ్గరబడుతుందని, సూచనలైతే కనబడుతున్నట్లుగా కొందరు క్రైస్తవులు అభిప్రాయపడుతున్నారు. కొందరేమో 2000 ఏండ్లనుండి చూస్తున్నాం ఇంకా రాలేడు! అనే అపోహలో ఉన్నట్లుగా కనబడుతుంది.

            అయితే సొలోమోను మండపం కూడ మళ్ళీ కట్టబడుతుంది అని అంటున్నారు.  సొలొమోను మండపం ఎన్నిసార్లు కూల్చబడింది? ఎందుకు కూల్చబడింది? ఆఖరున ఎప్పుడు కట్టబడుతుంది? దీనికి యేసుక్రీస్తు రాకడకు ముందుండే పరిస్థితులేంటి ఇశ్రాయేలు దేశంలో?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)

జవాబు:          సొలోమోను కట్టించినటువంటి  మందిరము బబులోను రాజైన నెబుకద్నెజరు కాలంలో కూల్చి వేయబడింది.  ఆ సమయంలోనే దానియేలు షద్రకు మేషాకు అబెద్నెగో చెరగా కొనిపోబడ్డారు.  ఆ తరువాత చెర నివారణ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి జెరుబ్బాబేలు, యెహోషువా, జెరుబ్బాబేలేమో దావీదు సంతానము. ఆ యూదుల అధికారిగా నియమించబడి యెహోషువా అనే ఆయన లేవీయుడు, యాజకుడిగా నియమించబడి, ప్రధాన యాజకుడిగా  ఆకాలంలో మందిరం కట్టబడింది. జెరుబ్బాబేలు చేతిలో ఈ మందిరానికి పునాది వేయబడియున్నది అని.

            అదైన తరవాత, మరలా మక్కబీయుల కాలంలో మళ్ళీ తిరుగుబాటు ఎందుకొచ్చిందంటే మళ్ళీ ఈ రోమీయులు, ఆ మందిరం అనేది కూలగొట్టబడింది.  కూల్చివేయబడింది.  ఆ తరువాత మళ్ళీ దాన్ని హేరోదు కట్టించాడు.  హేరోదు దాన్ని 46 సంవత్సరాలు కట్టించానని యేసు ప్రభువు వారు చెబుతారు. ఈ దేవాలయమును పడగొట్టుడి, తరువాత మూడు దినములలో లేపుతాను అని యేసు ప్రభువువారు తన శరీరమనే దేవాలయమును గూర్చి ప్రవచించినప్పుడు, 46 యేండ్లు కట్టారు కదా? నీవు మూడు రోజుల్లో లేపుతావా? అని అభ్యంతర పడ్డారు.

            ఆ తరువాత దాన్ని మళ్ళీ ఏ.డి 70లో (AD-70) రోమన్ జనరల్ టైటస్ వచ్చి యెరుషలేమును నేలమట్టం చేసినప్పుడు అది నేలమట్టం అయిపొయింది. ఇన్ని సార్లు యెరుషలేము దేవాలయం కట్టించడం, కూల్చివేయడం జరుగుతానే ఉంది. అసలు ఐరానికల్ సిశ్చువేషన్ (Ironical situation) ఏంటంటే యెరుషలేము అంటే శాంతి నిలయము అని అర్థం.  అసలు దాని చరిత్రలో శాంతి లేనేలేదు. ఎప్పుడూ రక్తపాతం యుద్ధం ప్రజలను చిత్రహింస చేయడం ఘోరమైన హింసాత్మకమైన చరిత్ర. రక్తసిక్తమైన చరిత్ర! శాంతి నిలయము అనిపించుకున్న యెరుషలేముకు ఆ నామము సార్ధకం కావాలంటే సమాధాన కర్తయైన యేసు వచ్చి యెరుషలేములో సింహాసనమెక్కి, ప్రపంచాన్ని పరిపాలించాలి. Jerusalem, the so called source of peace, will never have peace without the Prince of peace యేసు రావాలి! యేసు ప్రభువు వచ్చినప్పుడే ఆ యెరుషలేము నిజంగా యెరుషలేము అవుతుంది.

            ఇప్పుడు యేసుప్రభువు యొక్క రెండవరాకడ ఉన్నట్వంటి అనేక కార్యాలు నేరవేరి తీరవలసిన సూచనలు కంపల్సరిగా ఈ సూచనలు నెరవేరకపోతే యేసు రాడు.  రావడానికి వీలు లేదు. అన్నట్వంటి సూచనలో ఒకటి, ఈ యెరుషలేము దేవాలయము కట్టబడడం.  అనేది కూడ compulsory sign to be fulfilled before the second coming of Christ.

            ఎందుకంటే యేసు ప్రభువువారు రాకముందు ఒక వ్యక్తి నాశనపాత్రుడగు పాప పురుషుడు వస్తాడని 2థెస్సలోనిక 2వ అధ్యాయంలో ఉంది. నాశన పాత్రుడగ పాప పురుషుడు వచ్చి ఏది దేవుడనబడునో, ఏది పూజింపబడునో, దాన్నంతటిని ఎదిరించుచూ, తానే దేవుడనని తన్ను కనపరచుకొనుచు, దేవుని ఆలయంలో కూర్చుంటాడు. ఇది జరిగేదాక ఆ దినము రాదు.  గనుక ఎవ్వడును మిమ్మల్ని మోసపరచనియ్యకుడి. అని పౌలు భక్తుడు 2థెస్సలోనికయలో రాస్తాడు. మీరు స్కోఫీల్డు కామెంట్రీగాని, డేక్స్, థామ్సన్ ఏది చూసిన 2థెస్సలోనిక పత్రికకు ముందు ఆ భక్తులు కామెంటేటర్స్ ఇచ్చినట్వంటి పరిచయ వాక్యాలు ఏంటంటే మొదటి శతాబ్దంలో యేసు రెండవ రాకడను గూర్చిన ఆ తప్పుడు అభిప్రాయములను ఖండించి అసలు సిసలైన సత్యాన్ని భోదించడానికే పౌలు భక్తుడు ఈ పత్రిక రాసాడు అని ఈ కామెంటెటర్స్ అందరూ చెబుతారు.

            అదేంటంటే యేసు ప్రభువు రాకడ ఇప్పుడే వచ్చేస్తుందనే మొదటి శతాబ్దంలో నమ్మారు. అనుకున్నారు. ఇప్పుడప్పుడే రాదు బాబు! ముందు ఈ నాశన పాత్రుడైన పాపపురుషుడు వస్తే తప్ప! వాడు వచ్చి యెరుషలేము దేవాలయములో వాడు కూర్చొని నేనే దేవుణ్ణి అంటాడు. అప్పుడుగాని యేసురాడు! రావడానికి వీలులేదు.

            మరి వాడొచ్చి కూర్చొవాలంటే దేవాలయము ఉండాలి కదా? ఆ దేవాలయం ఎప్పుడు లేదు. అంతేకాకుండా దానియేలు గ్రంథము, The old testament revelation అనిపించుకున్నటువంటి దానియేలు 9వ అధ్యాయంలో 27 వచనంలో అతడు వారమువరకు అనేకులతో నిబంధన స్థిరపరచును. అర్థవారమునకు బలిని అర్పణమును నిలిపివేయును వారం అంటే ఏడు యేండ్లు అర్థవారం అంటే మూడున్నర సంవత్సరాలు మూడున్నర సంవత్సరాలకు వాడు వచ్చి బలిని, నైవేద్యమును నిలిపివేస్తాడు. అంటే నిలిపివేడానికి బలి అంటు ఒకటి జరుగుతూ ఉండాలి కదా? అంటే లేవీయ యాజకత్వ ధర్మముననుసరించి, పాతనిబంధన ధర్మశాస్త్ర పద్ధతులు అనుసరించి యెరుషలేములో ఈ బలికర్మాకాండ, యజ్ఞ-యాగాదులు జరుగుతాఉండాలి. అలా జరుగుతున్నప్పుడు వాడు వచ్చి, ఇదంతా ఆపివేయండి! యెహోవా కాదు నేనే దేవున్ని అని అంటాడు. అది జరిగినాక యేసు మధ్యాకాశానికి మేఘాలమీద వస్తాడు. ఇది బైబిల్లో ఉన్నటువంటి జరుగబోతున్న సంగతుల ప్రత్యక్షత.

            కనుక యెరుషలేము దేవాలయము కట్టబడటం అనేదాని మీద అందరూ దృష్టి పెట్టడం అనేది సహజమే. యేసు రెండవరాకడ మీద ఆసక్తి ఉన్నవారుగాని, అంత్యకాలపు సంభవాలమీద మినిమమ్ నాలెడ్జ్ ఉన్నవారి అందరి దృష్టి ఇప్పుడు యెరుషలేము మీదనే ఉన్నది, ఉంటుంది, ఉండాలి. పాతకాలం భక్తులు చాలా మంది ఏం, చెప్పారంటే Jerusalem or Israel దేవుడు ఏర్పాటు చేసిన క్లాక్ అన్నమాట దాన్ని చూస్తే యెరుషలేములో జరిగే సంభవాలును బట్టి ఇప్పుడు ఎంత టైం అయ్యింది? రక్షకుని రెండవ రాకడ ఎంత దగ్గర్లో ఉంది? అనే అంచనాలకు మనం రావచ్చు. (Jerusalem or Israel) అనేది గడియారం లాంటిది.