119. ప్రశ్న : యెషయా గ్రంథంలో సువార్త ప్రకటించుచూ, సమాధానము చాటించుచూ, సువర్తమానము ప్రకటించుచూ, రక్షణ సమాచారం ప్రచురించు వారి పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సీయోనుతో చెప్పుతున్న వాని పాదములు పర్వతములమీద ఎంతో సుందరమై ఉన్నవి.  అని యోషయా 52:20లోనూ!

            నీతి సువార్తను నేను ప్రకటించి యున్నాను అని నేనంటిని అని యోహోవా, అది నీకు తెలిసే యున్నదంటున్నాడు కీర్తనలు 40:9లో!

            కీర్తనలు 96:2లో కూడ అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి అని అంటున్నాడు. మీరింతకుముందు చెప్పినప్పుడు, యేసు ప్రభువు గురించి మాత్రమే సువార్త ప్రకటించడం జరిగింది.  గాని యెహోవాను గూర్చి సువార్త అనేది లేదు! అయితే మరి యోనా ప్రకటించింది ఏంటి? అది కూడ సువార్తనే కదా?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)

జవాబు:    సువార్త అనేది అబ్రాహాముకు కూడ చెప్పబడిందని గలతీ 3లో చెబుతాడు.  ఇక్కడ విషయం ఏంటంటే సువార్త అబ్రాహాముకు చెప్పబడింది. దావీదు సువార్త చెప్పాడు! అయితే సువార్త చెప్తానని చెప్పిన దావీదే రక్షకుని వీపు చాళ్ళు చాళ్ళుగా దున్నబడింది. ఆయన సిలువ మీద చేసిన ప్రార్థన నా దేవా, నా దేవా, నా చెయ్యి ఎందుకు వదిలేసావు? అని ప్రార్థన చేసాడు. నా వస్త్రములను వాళ్ళు చీట్లు వేసి పంచుకున్నారు.  అనే సిలువను గూర్చి యజ్ఞాన్ని గూర్చి ప్రవచనాలు చెప్పాడు కదా?

            అబ్రాహాముకు సువార్త ప్రకటించబడినా కూడ అది, మోషే, యోనా ప్రవచించినా వీళ్ళందరూ గూడ యేసును గూర్చి ప్రవచించారు.  పాత తరములోనైనా సువార్త అనేదుంటే అది జరుగబోతున్నటువంటి యజ్ఞాన్ని దృష్టిలో పెట్టుకుని సువార్త ఉంటుంది.  తప్ప యేసులేని సువార్త ఏదీ ఉండదు. అక్కడ మీరు యెషయాలోని ప్రవచనం యేసును గూర్చిన ప్రవచనమే. సువార్త ప్రకటించు వారు యేసుని గూర్చి సువార్త ప్రకటించారు. మార్కు1:11లో కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించింది. అని సువార్త ప్రకటించడం ఆయన ప్రారంభించాడు. కాబట్టి యజ్ఞపురుషుడు, ఆయన ప్రస్తావన లేని సువార్త అంటూ ఏదీ ఉండదు, ఏ కాలంలో ఏ యుగంలో ఎవ్వరు చెప్పినా!