121. ప్రశ్న : ఫినేహాను రోషము గలిగి దేవుని సేవకు పూనుకున్నాడు కదా? ఒక పాపం జరుగుతుంటే దాన్ని ఖండించాడు. అలా రోషముగా ఉండకపోతే నరకం వెళ్ళతారా?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)

జవాబు:   నరకానికి వెళ్ళరు కాని కిరీటం అనేది దొరకదు. ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనించాలి. నరకం తప్పించుకోవడం, పరలోక రాజ్యాన్ని స్వతంత్రిచుకోవడం కేవలం యేసురక్తం ద్వారానే జరుగుతుంది.  యేసురక్తం మీద మనకున్న విశ్వాసమనేది నిర్ణయిస్తుంది, మనం నరకపాత్రులం కాదు. మనం నిత్యజీవానికి వారసులము అనేది నిర్ణయిస్తుంది యేసు రక్తమే!

            అయితే యేసురక్తమందు విశ్వాసముంచిన తర్వాత వీడు పరలోకంలోకెళ్ళి ఏ అంతస్థులో ఉంటాడు. ఏ లెవెల్, హోదాలో ఉంటాడు. ఏ అధికార పదవిలో ఉంటాడు. ఒక రాజా? మంత్రా? గుమాస్తనా? మంత్రా? తోటమాలీ? ఎవరు? దేవుని రాజ్యంలో అందరికి సమానస్థాయి ఉండదు. ఏ అంతస్థులో ఉంటాడు? డైరెక్టుగా కొన్ని ప్రపంచాలు పరిపాలించే మహా రాజా? లేకపోతే మహారాజుల రథం నడిపించే వాడా? ఏస్థానంలో ఉంటాడు? అనేది వీడి యొక్క attitude బట్టి, భక్తిలో యధార్థతను బట్టి సత్యమును ఎంత ప్రేమించాడో, ఎంతవరకు యదార్థవంతునిగా ఉన్నాడు? భక్తిసాధన ఎలా చేసాడు? దేవుని చిత్తమునకు ఎంతవరకు విధేయుడైనాడు? ఈ factors మీద ఆధారపడి ఉంటుంది. అందుకొరకు అతి ఉన్నతమైన స్థానాన్ని మహిమలో అందుకోవడం కొరకు మనం ఫినేహాసులాంటి రోషం కలిగి ఉండటం ముఖ్యం.  ఫినేహాసులాగా రోషం లేనోళ్ళు కూడ కొందరు పరలోకానికి వెళ్తారు. ఏదో  footpath మీదనో, ఏదో బండ్లు నడుపుకుంటానో, ఏదో క్లర్క్ పనో, గుమస్తా పనో చేస్తారు. అందరూ రాజులు కారు.