(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: వాఖ్యాన పద్ధతులను గురించి నేనొక దేవుని యొక్క ప్రత్యేకమైన ఆజ్ఞను బట్టి 8 ప్రణాళిక గ్రంథాల్లో చివరిది. బైబిల్ వ్యాఖ్యాన పద్ధతులను గూర్చినట్వంటి గ్రంథం ‘ప్రమాణ వాక్యం’ అనే పేరుతో పబ్లిష్ చేయడం కూడ జరిగింది. అసలు బైబిల్ని ఎలా చదవాలి? ఎలా అర్థం చేసుకోవాలి? ఎలా వ్యాఖ్యానించాలి? బైబిల్లో ఎన్ని రకముల లేఖనములున్నవి? ఇంతకముందు కూడ హెర్మెన్యుటిక్స్ అనే టాపిక్ మీద ముందు చెప్పిన వాడ్ని నేనే కాదు ముందు చాలా మంది భక్తులు చెప్పారు. బైబిల్ వ్యాఖ్యాన శాస్త్రము అనే దాని మీద మీరు ఇంటర్ నెట్లో సర్చ్ చేసినా బైబిల్ గేట్వే అనే వెబ్సైట్లోకి వెళ్ళి సర్చ్ చేసినా చాలా క్రిస్టియన్ వెబ్సైట్స్ ఉన్నాయి. ఎన్నో గ్రంథాలున్నాయి. ఎన్నో క్రైస్తవ లైబ్రరీస్లో ఆ పుస్తకాలు దొరుకుతాయి.
వాటి సారాంశం అంత్యదినాల్లో ఉన్న సంఘానికి సింప్లిఫైడ్ ఫామ్లో, How to understand the bible, How to preach the truth only?
బైబిల్ లోని వచనాలను ఎత్తికొని చెప్పేటప్పుడు మనం, పట్టాలు దిగిన బండిలాగా ఎటో వెళ్ళిపోకుండా సత్యంలోనే ఉండటానికి తీసుకోవల్సిన జాగ్రత్తలు ఏంటి? అనే విషయం మీద, How to interpret the Bible? Howto understand? అనే దానిమీద “ప్రమాణ వాక్యము” అనే గ్రంథాన్ని ఇటీవల పబ్లిష్ చేసాను. మొత్తం అన్ని పుస్తకాలు ఇంగ్లీషులోకి వస్తాయి. దేవుడు 82వ సంవత్సరంలో దేవుడు నాతో మాట్లాడినప్పుడు ఈ 8 పుస్తకాలు నీవు నీ మాతృభాషలో వ్రాస్తావు. ఆ తరువాత ఇంగ్లీషులో కూడ తర్జుమా చేసి మొత్తం 200 దేశాలకు పరిచయం చేసినప్పుడు మార్టిన్ లూథర్ ద్వారా నేను ప్రారంభించిన సంస్కరణ ముగింపుకు వస్తుంది. ఇది నా రక్షకుడు యేసు నాకు చెప్పిన మాట! ఇది నేను నమ్మాను. అప్పుడు నేను చెబితే చాలా మంది నవ్వారు. ఏమీ పెద్దగా చదువుకోలేదు, 8 పుస్తకాలు వ్రాయడం ఏమిటి? అన్ని దేశాలు చదవడం ఏంటి అని? కాని 8 పుస్తకాలు వ్రాయడం అయిపోయింది. అందులో మూడు పుస్తకాలు ఇంగ్లీషులోకి రావడం జరిగిపోయింది. ఇంకా కొన్ని గూడ రాబోతున్నాయి! తప్పకుండా.
2020 అనేకమంది ముఖ్యమంత్రలు, ప్రధానమంత్రులు 2020 మిషన్ కలిగియున్నారు. ఓఫీర్ మినిస్ట్రీస్ కి కూడ 2020 విషన్ ఏంటంటే 2020లోపుగా ఈ 8 గ్రాంథాలు ఇంగ్లీషులో తప్పకుండా మనం పరిచయం చేయబోతున్నాం. దీనికొరకు సత్యసంబంధులందరూ దయచేసి ప్రార్థన చేయవలసిందిగా విజ్ఞప్తి!