126. ప్రశ్న: దానియేలు 1:11ని గూర్చి కొంచెం వివరించండి

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)

జవాబు:    మొట్టమొదటి విషయం, సకల జనులు వినాల్సింది, జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రాచీన కాలంలో నపుంసకులకు మహారాజుల సంస్థానాలలో, ఆస్థానాలలో, అంతఃపూరాలలో, ప్రాముఖ్యమైనట్వంటి ఒక స్థానం ఉండేది. ఇతియోపీయుడైనా కందాకేరాని మంత్రి నపుంసకుడు. ఇతియోపియన్ యునక్ అంటాం. He given to the position of a finance minister for king. అలాగ ఎందుకు? ఇప్పుడు నపుంసకుల మీద రాజు, నపుంసకుల మీద అధిపతే హేగే అనేవాడు. అహష్వరరోషు సంస్థానంలో ఎస్తేరు గాని, ఇప్పుడు ఆ వస్తి అనే పెద్దరాణి పదవిని కోల్పోయినప్పుడు, మళ్ళీ వేరే స్త్రీలను, ఆయన కొరకు తీసుకొచ్చి సిద్ధపరచి, ఇంకొక రాణిని తయారు చేయటానికి, హేగే అతడు కూడ నపుంసకుల మీద అధిపతి ఒక్కడుకూడ దానియేలు గ్రంథంలో అదేమాట.

            నపుంసకులు ఎందుకంటే, ఇదొక చారిత్రకమైన, సామాజికమైన విషయం. మహా రాజులు, చక్రవర్తులు, నపుంసకులును ప్రత్యేకంగా రిక్రుట్ చేసుకునేవాళ్ళు. ఎందుకంటే ఒకొక్క రాజుకు అనేకమంది భార్యలుంటారు. ఈ మహా రాజుగారు ఒక్కరి భార్యతోనే కాపురం చేసేవాడైతే, ఆమె, ఈయన ఒకరికొకరు ధర్మం జరుపుకుని, ఒకళ్ళనొకరు బిజీగా పెట్టుకుని సంతృప్తి పరచుకుంటారు. అయిపోతుంది. ఈయనకు 50-100 మంది భార్యలు. రాచ కార్యాల్లో టైం, ఓపిక ఉండదు ఒక భార్యను పలకరించాక మళ్ళీ ఇంకొక భార్య దగ్గరకి వెళ్ళటానికి ఎన్నాళ్ళో, మళ్ళీ అందరూ భార్యలయ్యాక మొదటి భార్య దగ్గరకి రాటానికి ఎన్ని నెలలో, సంవత్సరాలో తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో అంతఃపుర కాంతలు, Extra marital affairs, ఇల్లీగల్గా వేరే వివాహేతర సంబంధాలకు అలవాటయ్యే ప్రమాదం ఉన్నది. అలాంటి పరిస్థితుల్లోనే, అంతఃపురంకి వెళ్ళటానికి, అందరికి యాక్సస్ ఉండదు.  ప్రవేశం ఉండదు కదా? గనుక అక్కడ సేనాధిపతి మంత్రి, మహారాణిగారు. ఇన్వాల్వ్ అయిపోయి రాజును చంపించిన సందర్భాలున్నాయి.

            ఇకపోతే అక్కడ, అంతఃపుర కాంతలు, దాస దాసీలుంటారు. చెలికత్తెలు వారికి విరివిగా కానుకలు ఇచ్చి వాళ్ళను గుప్పిట్లో పెట్టుకొని, అంతఃపురపు రహస్యాలు దాచిపెట్టి, వీళ్ళు రహస్యంగా కలుసుకోవడం అనేది జరిగేది. అది సర్వసాధారణం అందుచేత అంతఃపురం లోపల, సర్వం, వంటలు చేయాలన్నా, క్లీనింగ్ చేయాలన్నా, కావలి ఉండాలన్నా ఈ నపుంసకలు అనేవాళ్ళను అక్కడ అపాయింట్ (Appoint) చేసుకోవడానికి ఇష్టపడేవాళ్ళు. ఇప్పుడొక మహారాణికో, రాజు కుమార్తెకో కావలిగా కండలుదిరిగిన, మంచి వస్తాదు లాంటొన్ని పెట్టాడనుకోండి.  మంచి normal healthy male person. పురుషుడు! ఆ అమ్మాయిని చూస్తే వీడికి ఒకనాడు కాకపోతే ఒకనాడు దుష్ట తలంపు రావొచ్చు.  ఆమెకైనా రావొచ్చు. ఇద్దరు హ్యుమన్ బీయింగ్సే గనుక పరవాలేదులే, ఎవరికి తెలుస్తుంది? మనం తలచుకుంటే రహస్యం దాచిపెట్టొచ్చు.  ఎంజాయి చేయొచ్చు అనే పరిస్థితి ఏర్పడి. అలాగా విస్తారంగా Extra marital Affairs జరిగేవి. వివాహేతర సంబంధాలు, శారీరక సంపర్కాలు జరిగేవి. అలాంటప్పుడు మళ్ళీ గర్భ స్రవాలు, పిల్లల్ని కనేయడాలు, ఇలాంటి చండాలమంతా జరిగేది. అందుచేత ప్రతిరాజు కూడ తన ఆస్థానంలో కొంతమంది నపుంసకులు, శండులు అంటారు. యూనక్స్ అంటే పురుషత్వం లేనివారు.  పురుషునిగా పుడతారుగాని పురుషునిగా ఉండరు. వాళ్ళకు సంభోగ శక్తి ఉండదు. అట్లాంటోలకి స్పెషల్గా తీసుకుని, వాళ్ళని అపాయింట్ చేసుకుంటే వాళ్ళతో ఈ రకమైన ప్రమాదం ఉండదు. అట్లాంటివాళ్ళు ఒక 50 మంది, వందమంది వున్నప్పుడు, రాజు యొక్క నపుంసకుల మీద అధిపతియైనవాడు అతనొచ్చి వీళ్ళను అతని యొక్క కాపుదలలో యూదా యువకులను బెట్టిండు!