132. ప్రశ్న. ఇది బైబిల్లోని ప్రశ్నకాదు. ఒక ఫ్యామిలీ ప్రాబ్లం ఉంది.  దానికి ఒక క్రైస్తవుడిగా ఎలా డీల్ చెయ్యాలి? అన్న ప్రశ్న ఉంది. ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీలో అందరూ క్రైస్తవంలోకి వచ్చారు. అందరూ కూడ లాస్టు 10-12 సంవత్సరముల నుండి రక్షణలో ఉన్నారు. అయితే వాళ్ళ నాన్న రక్షణ కోసం వాళ్ళింకా ప్రార్ధన చేస్తున్నారు. వాళ్ళ నాన్నకు రక్షణ లేకపోగా ఒక మాంత్రికుడిగా మారిపోయాడు. ఆయన బయట వాళ్ళకే కాకుండా కుటుంబస్తులకి కూడ మంత్రప్రయోగం చేస్తున్నాడు అయితే దేవుడు ‘నీ తల్లిని తండ్రిని సన్మానింపమన్నాడు కదా? వాళ్ళ నాన్నకి వాళ్ళు దూరం వదిలేయటం మంచిదా?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)

జవాబు: తల్లిదండ్రులను సన్మానించాలి, లోబడాలి, విధేయులు కావాలన్నదంతా కూడ They apply to the Normal people Abnormal people కొరకు కాదు. ఇంట్లో వాళ్ళకే చేతబడులు మంత్రాలు చేసేవాడు, తండ్రైనా, ఎవరైనా మనం దూరం కావాల్సిందే! ఒక విషయం చెప్తాను. సౌలురాజు బైబిల్లో అభిషేకం పోగొట్టుకుని దురాత్మ, సైతాను పాలైపోయాడు.  దయ్యం పాలైపోయాడు! దేవుడు అభిషేకించిన దావీదు మీదికి ఈటే విసురుతావున్నాడు. చంపుదామని! ఇప్పుడు సౌలు సొంత కన్న కొడుకు యోనాతాను తండ్రికి విరోధంగా దావీదుతో చేతులు కలిపాడు. అది రాజ్యద్రోహం కాదు భక్తిసాధన! దేవుడు అభిషేకించిన దావీదు మీద నా తండ్రి అన్యాయముగా పగ పెట్టుకున్నాడు. తండ్రి పక్షమున నేనుండను! దేవుని పక్షం! దేవుడు ఎన్నుకొనిన దైవజనుని పక్షంగా ఉంటానని బయటకు వచ్చాడు.

            గనుక తల్లిదండ్రులను సన్మానించాలంటే వాళ్ళ నార్మల్ పీపుల్ (Normal People) అయినప్పుడే!వాళ్ళు సైతాన్ వశం అయిపోయిన తర్వాత వాళ్ళను తల్లిదండ్రులుగా కాదు సైతాను సైన్యంగా మనం వాళ్ళను చూడాలి. మనకు మానవ రిలేషన్స్ కంటే భక్తి ముఖ్యం. రక్షణ ముఖ్యం. వాళ్ళు మాత్రం ఆయనకు దూరంగా ఉండాల్సిందే ఆయనకు లోబడి ఉంటే యేసు మతమును విడిచిపెట్టమంటాడు. వదిలేస్తారా వీళ్ళు మరీ? కనుక ఇదంతా Extra-Ordinary issue Abnormal man. వీళ్ళకు ఆ వచనం వర్తించదు. వీళ్ళు యోనాతానులైపోవాలి. యోనాతానులాగ తండ్రికి దూరంగా దేవునికి దగ్గరగా బ్రతకాలి.