149. ప్రశ్న : క్రీస్తు జన్మదినం December 25 నే ఎందుకు జరుపుకుంటారు? అసలు ఇది బైబిల్ లో ఎక్కడ ఉంది, అని కొంత మంది మతోన్మాదుల ప్రశ్న. దీనికి మీ సమాధానం ఏంటి?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)

జవాబు:   ఇది ఎలా వుంది అంటే “రామాయణంలో పిడకల వేట”ల వుంది. అసలు యేసు ప్రభువారు ఎప్పుడు పుట్టాడో లేక December 25 నే పుట్టాడు అనేది ప్రాముఖ్యం కాదు. ఆయన కన్యక పుట్టడం, యజ్ఞపురుషుడు అవ్వడానికి ఆదాము రక్తము లేకుండా పుట్టాడు అనేది ప్రాముఖ్యం.  గాని, ఆయన 25న లేక 26న పుట్టాడు.  అనేది క్రైస్తవుడు ఎవ్వరు కూడా ప్రాముఖ్యంగా ఎంచరు. ఇతర దేవుళ్ళ విషయంలో తేది, లగ్నం అని వాళ్లు చూసుకుంటారు. గాని యేసయ్యకు అవసరం లేదు. ఎందుకంటే మనుషులకు పుట్టిన తేది ఉంటుంది.  గాని, దేవుడికి కాదు. హెబ్రీ 7వ అధ్యాయంలో ఆయన తండ్రి, తల్లి లేనివాడు వంశావలి లేనివాడు, జీవితకాలానికి ఆరంభం అంతం అంటూ లేనివాడే యేసయ్య.  ఆదిమధ్యాంతరహితుడైన యేసు, ఈ లోకంలో ప్రవేశించిన దినం క్రిస్మస్.  ఆయన పుట్టాడంటే ఆయన ఉనికికి ఆరంభం అని కాదు.  భూమి మీద అవతారానికి ముందే వున్నవాడు. నేను చెప్తానే నమ్ముతా అనేది తెలివి తక్కువ వాదన. వ్యర్థ ప్రేళాపన.