135. ప్రశ్న: 1యోహాను 5:7లో సాక్ష్యమిచ్చువారు ముగ్గురు అనగా ఆత్మయు, నీళ్ళును, రక్తమును ముగ్గురు ఏకీభవించియున్నారు. ఈ ముగ్గురిలో రెండవ వ్యక్తి మూడవ వ్యక్తి ఎవరు? నీరు, రక్తము అనేవి వ్యక్తులా? వ్యక్తులైతే ఎవరు? వివరించండి.

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)

జవాబు: నీళ్ళు, రక్తం వ్యక్తులని అక్కడ లేదు. ఒక మాట, ఇప్పుడు వ్యక్తులు అంటే మనలాగ కళ్ళు, తల, పొట్ట, చేతులు, అవయువాలు ఉండి, ఆకారాలు ఉండాలని కాదు. ఇక్కడ విషయం ఏంటంటే దేవుని దగ్గరకి వచ్చేటప్పటికి, పదార్ధంకి కూడ వ్యక్తిత్వం వస్తుందనేది ఇక్కడొక దేవరహస్యము. ఆధ్యాత్మిక రహస్యం! దేవుడు సృష్టికర్త గనుక.  మన దగ్గరకు వచ్చేసరికి ఇవి వ్యక్తులుకాదు, పదార్థాలు! ఇప్పుడు ఈ గ్లాస్ లో నీళ్ళున్నాయి. ఇది మనం చూసినప్పుడు, ఇది పంచభూతాల్లో ఒకటి. ఒక పదార్థం. కాని దేవుడు ఆ నీళ్ళతో మాట్లాడతాడు.  ఆ నీళ్ళు సమాధానం ఇస్తాయి. Because he is the creator.  దేవుని దగ్గరకు వచ్చేసరికి, దేవుడు ఇంటరాక్షన్ మొదలుబెట్టేసరికి Everything gains, Acquires personality and individuality. ఇదొక దేవరహస్యం.  అందుకే ఆయన నీవు కొండతో మాట్లాడమన్నాడు.  కొండను నీవు ఎత్తబడి సముద్రంలో పడిపో  అని నీవు ఆజ్ఞాపిస్తే అది లోబడుతుంది అన్నాడు. సముద్రమును గద్దించాడు. తుఫానును, గాలిని, ఆయన గద్దించాడు.  గనుక ఆయన ఆజ్ఞాపించినప్పుడు పంచభూతాలు, పదార్థాలు ఒక పర్సన్లాగా ఆయనకు రియాక్ట్ అవుతాయి. ఇంటారాక్షన్ జరుగుతుంది.

            కీర్తనల గ్రంథంలో, సముద్రమా, గాలి, తుఫాను, అగ్ని మీరందరూ యోహోవాను సన్నుతించండి అని అంటాడు. గనుక అవన్ని గూడ పంచభూతాలు. నీరు, అగ్ని, తుఫాను, గాలి, వాయువు ఇదంతా! అందుచేత వ్యక్తులు అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వ్యక్తి గదా? నీళ్ళనే వ్యక్తి ఉన్నాడా? రక్తం అనే వ్యక్తి ఉన్నాడా? అనే ప్రశ్న రాజేష్ గారు అడిగారు.  అయితే పరిశుద్ధాత్మ అదే వ్యక్తి మనలో కార్యము చేసి, యేసే రక్షకుడు మనం పాపులమని ఒప్పించి, యేసుని రక్షకునిగా స్వీకరించి ఆయనకు లోబడి, విధేయులమై బాప్తిస్మము పొందాలి. అనే ఒక గ్రహింపు పరిశుద్ధాత్మ దేవుడు కలిగించిన తర్వాత, ఆయన మాటకు లోబడి మనం యేసురక్తమును ఆశ్రయిస్తాం. ఆయన మాటకు లోబడి మనం నీళ్ళలో బాప్తిస్మము పొందుతాం. రేపు క్రీస్తు న్యాయపీఠం ముందు, ఇతన్ని నేను కడిగాను అని రక్తము మాట్లాడుతుంది. ఇప్పుడు హేబెలు యొక్కరక్తము నీళ్ళలోనుంచి నాకు మొరపెట్టుచున్నది అని దేవుడే చెప్పాడు. మరి హెబేలు ఒక వ్యక్తి, రక్తము ఒక వ్యక్తి కాదు కదా? రక్తమంటే ద్రవ పదార్థము కాని రక్తం మొరపెట్టింది మరి! దేవుని దగ్గరకు వచ్చేసరికి రక్తం మాట్లాడుతుంది. నీళ్ళు మాట్లాడుతాయి. గాలి మాట్లాడుతుంది. ఇసుకరేణువు కూడ మాట్లాడుతుంది. ఆయన రాళ్ళుకేకలేస్తాయి అన్నాడు! సో హ్యూమన్ పెరామీటర్స్ వేరు! దేవుని పెరామీటర్స్ వేరు.  కాబట్టి పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి. ఆయనను నమ్మమని సువార్త ప్రకటన చేత తన అవసరం ఏంటో ఒప్పించి, మారుమనస్సులోకి, విశ్వాసంలోకి నడిపించిన తర్వాత అతడు యేసురక్తాన్ని ఆశ్రయిస్తారు. అప్పుడు ఆరక్తం నీతో, నాతో మాట్లాడదు.  కాని దేవునితో మాట్లాడుతుంది. ఇతడు నన్ను ఆశ్రయించాడని! నీళ్ళలో బాప్తిస్మం పొందుతాం.  ఆ నీళ్ళు నీకు, నాకు మాట్లాడదు.  కమ్యూనికేషన్ ఉండదు. గాని దేవుడు అడిగితే చెబుతుంది. అవును ఇతడు నాలో బాప్తిస్మము పొంది, మునిగి లేచాడు. అతడు సాదృశ్యరూపిగా పాతిపెట్టబడ్డాడు అని!

So, anything will talk with God, interact with God, and communicate with God though they willnot communi cate anything to the human being. దేవునికి సాక్ష్యం అవసరము అయితే ఇవ్వన్ని సాక్ష్యం ఇస్తాయి. సో నీళ్ళు, రక్తం అనే వ్యక్తి లేదు. దేవుని ముందు ఈ పదార్థాలు వ్యక్తులుగా మారుతాయి అని!