(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: ఇది ఆథ్యాత్మికమైనది కాదు. పాప, పుణ్యాలకు సంబంధించింది కాదు. ఆర్థిక లాభం, ఆర్థిక నష్టం అనే దాంట్లో మనకు ప్లానింగ్ సరిగ్గా ఉంటే సరిపోతుంది. గ్రీన్ప్లేరిలో నేను కూడ సభ్యున్నే! నాకున్నట్వంటి విస్తారమైన ఫాలోయింగ్, మిత్రబృందం అభిమానులే వేల కోటి, లక్షల సంఖ్యలో ఉన్నారు. కనుక గ్రీన్రి అనేది త్రూ పోస్టల్ డిపార్టెమెంట్లోనే జరుగుతుంది. అందులో మోసం ఏం ఉండదు. పోస్టల్ డిపార్ట్మెంట్ ఇండియా ప్రభుత్వందే! ఎవరు ఎంత మనీ ఆర్డర్ చేస్తున్నారో, అంత రికార్డ్ ఉంటుంది. గ్రీన్ప్లేరిలో నేను ఉన్నాను. ముందు నేను కట్టాను. నాకు అప్పుడప్పుడు డబ్బులొస్తున్నాయి. దాంట్లో నష్టం ఏమీ లేదు. వేరే అన్నివేరు. ఇది వేరు ఇక పోతే ‘Amway’ అనేదొచ్చింది Multi level marketing. ఇందులో హెల్త్ ప్రాడక్ట్స్, హెల్త్ అండ్ వెల్త్ కలిసుంటాయి అనేది. ఇండస్వీవ అనే దొచ్చింది. i Pulse, i coffee అనేదొక హెల్త్ ప్రాడక్ట్. నేను సహజంగా నమ్మేదేంటంటే మనిషికి పరిశుద్ధత ఉండాలి, ఆరోగ్యం ఉండాలి. చాలా పరిశుద్ధుడైనవాడు ఆరోగ్యం లేకపోయినా దేవుని సేవ చేయలేడు. ఆరోగ్యవంతుడైనవాడు పరిశుద్ధత లేకపోయినా దేవుని సేవ చేయలేడు. పరిశుద్ధత, ఆరోగ్యము రెండు ఉన్నవాడు, చేతిలోనాలుగు డబ్బులుకూడ పట్టుకుంటే దేవుని పని ఉదృతంగా చేయగలం. మన కొరకు మనం ఇల్లీగల్ ఆక్టివిటీస్ చేయ్యలేము చెయ్యకూడదు. As far as it is legal, permitted by the government, it is white, we declared it on the paper, We pay taxes దాంట్లో తప్పు ఏమి లేదు.
ఇది చేయొచ్చా? మనము అంటే నేను కొన్ని చేసాను. కొన్నిట్లో లాభం కలిగింది, కొన్ని చోట్ల చేతులు కాలినయి. న్యాయపీఠం ముందు దేవుడు లెక్క అడిగేదేం కాదిదీ! ఒక విశ్వాసం, ఆశ ఏంటంటే, దేవా, నీవు నాకు డబ్బులిస్తే నీ సువార్త కొరకు వాడుతాను. ఇవ్వకపోతే నాకున్నంతలోనే చేస్తాను. దాన్ని పెద్ద ఆధ్యాత్మిక రహస్యంగా తీసుకోవద్దు. జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయండి, డబ్బులు సంపాదించండి. దశమభాగాలు పంపించండి. దేవుడు మిమ్మును ఆశీర్వదించి, నన్ను దీవించును గాక!