(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: ఇప్పుడు లూథరన్ సంఘాలు, మెథడిస్టు, వెస్లియన్ సంఘాలు బాప్టిస్ట్ సంఘాలు, ఇలా Main line churches అంటారు. ఇలాంటి సంఘాల్లో ఆడవాళ్ళు, మంగళసూత్రాలు, గాజులు కాలికి మెట్టలు ఇవన్నీ ఉంటాయి. నుదుట బొట్టొకటి ఉండదు. ఎందుకంటే అది హిందూమత సాంప్రదాయం. హిందూ స్త్రీ అనే అనుకుంటారు. నేను హిందు స్త్రీ కాదు. యేసు ప్రభును ఆరాధించే వ్యక్తిని గనుక I dont want others to think I am a hindu women. Let them know I am not a hindu but I am other than a hindu అనే ఉద్దేశంతో బొట్టు పెట్టుకోరు.
అయితే కొంతమంది, మామూలుగా బొట్టు వేరు, పూజ చేసి పెట్టె బొట్టు వేరు. ఊరికే ఒక స్టిక్కర్లాగా ఒక బొట్టు అతికించుకుంటాము. అసలే లేదన్నట్టు కాకుండ అని పెట్టుకునే వాళ్ళు కూడ ఉన్నారు. అది పెద్ద ఇష్యూ కాదు. ఇప్పుడు మా చర్చీలకు వచ్చేస్త్రీలు, దాదాపుగా వందల సంఘాలు కట్టాను. మా చర్చీలలో కూడ కొంతమంది, కాదు చాలా మంది కూడ గాజులు, మంగళసూత్రాలు, కాళ్ళుమెట్టలు అన్ని ధరించినోళ్ళున్నారు. కొంతమంది తీసేసినోళ్ళున్నారు. అయితే అది మా సంఘ ఉపదేశం కాదు. ఆడవాళ్ళకు గాజులుండొద్దు, మెట్టలుండొద్దు, అనేది ఉపదేశం కాదు. అది వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళు నాకెందుకండి నాన్నగారు, నాకు, ప్రార్థనచేస్తుంటే ఇవ్వన్ని నాకవసరం లేదు. తీసేయాలని నా మనస్సాక్షి చెప్తుంది. అంటే అమ్మా నీ మనసాక్షి చెప్తే తీసేయి. దానికి నాకు అభ్యంతరం లేదు. నీ ఇష్టం దానికి మన సంఘమైతే అభ్యంతరం చెప్పదు. నీ మనసాక్షి వద్దంటే తీసేయి. అది వాళ్ళ అంతస్థు. కాని మరి గాజులు, మెట్టలు ఇవ్వన్ని మినిమమ్ అలంకారాలు పెట్టుకొని పరిశుద్ధాత్మను పొందినవారు సువార్తను ప్రకటించి అనేకమందిని రక్షణలోకి నడిపించినట్వంటి తల్లులు, చెల్లెలు, కుమార్తెలు కూడ ఉన్నారు. గనుక అదొక ఇష్యునే కాదు!
ఇంకోటెంటంటే స్త్రీలు ఆభరణం పెట్టుకోవడం అనేది సహజమే అని దేవుడే అంటాడు. For example కన్యక తన వడ్డానమును మరచునా? స్త్రీలు తన ఆభరణములను మరుతురా? మరి మీరు నన్ను లెక్కలేనన్ని దినములు నన్ను మరిచారు. అంటాడు అంటే స్త్రీలుగా పుట్టినప్పుడు వాళ్ళకు మినిమం అలంకరణ కాంక్ష, కొంచెమైనా ఉంటుంది. అది అసహజం కాదు. పాపం కాదు. It is okay. మరి వాళ్ళ ఎంత బిజీలో ఉన్నా బయటికి వచ్చేటప్పుడు గాజులు పెట్టుకోవడం మర్చిపోరు కదా? మీరెంట్రా మరి నన్ను ప్రార్థన చేయడం మర్చిపోయారని, లెక్కలేని దినాలు మర్చిపోయారు అని అంటాడు దేవుడు! కాబట్టి ఈ ఆభరణములు పెట్టుకోవడమే పాపం అయితే దేవుడు ఆ మాట అనడు కదా? స్త్రీలు వడ్డానం మర్చిపోరు, ఆభరణం మర్చిపోరు అనేది జనరల్ స్త్రీల గురించి అన్నాడు. గాని ఏదో పనికి మాలిన స్త్రీలని, అపవిత్ర స్త్రీలని కాదుగా! స్త్రీ సహజం అని దేవుడు అంటాడు. కాబట్టి నేనైతే నా సంఘంలో, నా ఆడపిల్లలకి, చిన్నపిల్లలకి, నేను తీసుకెళ్ళి కొంతమందికి చెవులు కుట్టించాను, సరదాగా, ఆడపిల్లలు ఎలా ఉండాలో అలా ఉండాలి.
మగవాడు, సిగ్గుపడుతూ, కులుకుతూ, తిరుగుతూ వయ్యారంగా తిరిగినా వికారం! ఆడవాళ్ళ మగవాళ్ళలా తిరిగినా వికారం. ఆడపిల్లలు ఆడపిల్లలా ఉండాలి. మొగోళ్ళు మొగోళ్ళలా ఉండాలి. అది ప్రకృతిలో సహజం. అది పెద్ద ఇష్యు కాదు!