138.  ప్రశ్న: అయ్యగారు కూకట్పల్లిలో ఎవరూ సువార్త ప్రకటించని పరిస్థితిలో ఏ వ్యూహం అవలంబించి, సువార్త విజయవంతంగా ప్రకటించి, మొట్టమొదట సంఘం స్థాపించారు. నేటి ప్రతికూలత పరిస్థితిలలో, సువార్త వ్యతిరేకత మతోన్మాదం పెరిగిపోయిన ఈ స్థితిలో సువార్తికులు ఏ జాగ్రత్తలు తీసుకుని సువార్త ప్రకటించాలి? కొన్ని గ్రామాల పొలిమేరల్లో ఈ సువార్త నిషేదం అని బోర్డ్స్ పెట్టి అడ్డుకుంటున్నారు. ఏమి చెయ్యాలి?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)

జవాబు: జవాబు చెప్పకముందు నేను ఉపోద్ఘాతంగా చెప్పగల్గిన మాటేంటంటే, శత్రు శిబిరంలో, విరోధుల మధ్యలో మనం విజయవంతంగా పనిచెయ్యాలంటే మనం అవలంబించాల్సిన వ్యూహం ఏమిటి? అని అడిగితే, ఆ వ్యూహమేంటో పబ్లిక్గా చెప్పకపోవడమే మొట్టమొదటి వ్యూహం. ఈ వ్యూహంలో పని చేద్దాం అని పబ్లిక్ లో చెప్పినాక ఒక వ్యూహం ఏముంది? ఇప్పుడు అందరూ వింటున్నారు. ఇప్పుడు రంజిత్ ఓఫీర్ పబ్లిక్ గా మాట్లాడే ఏ వేదికైనా అది ‘ఓఫీర్ లైవ్ టివీ’ గాని ‘యథార్థవాది లైవ్ టివీ’ గాని ఎనీ షో! క్రైస్తవేతరులు, క్రీస్తు విరోధులు, సువార్త వ్యతిరేకులు ఎక్కువ ఆసక్తిగా వింటారు. ఇప్పుడు చాలా మంది అట్లాంటి మిత్రులు కూడ వింటున్నారు. వాళ్ళందరు వింటుండగా ఏ వ్యూహం ప్రకారం ప్రకటిద్దాము? అని అడగటం అంత సబబు కాదు! అయినా సరే! వాళ్ళు విరోధులైనా, నాకు ప్రియమైన విరోధులు My beloved Enemies. చెప్తాను, ఏం పర్వాలేదు. వాళ్ళు విన్నా నాకేం నష్టం లేదు చెప్తాను.

            విషయం ఏంటంటే, నేను కూకట్పల్లికి వచ్చినప్పుడు 1983 సంవత్సరం చివర్న, 84 సంవత్సరం మొదట్లో అసలు ఇక్కడ మొత్తం RSS (ఆర్.ఎస్.ఎస్.) ప్రాబల్యము. ఇక్కడ ఆ రోజుల్లో MLA (యం.ఎల్.ఎ.) గా గెలిచిన బి.జె.పి. హనుమంతరావుగారు. BJP అన్నా సంఘ పరివారే కదా? హనుమంతరావు గారు చాలా మంచివాడు. అయితే పార్టీ పరంగా మాత్రం He is with sangh pariwar.

            మరి నేను ఇక్కడ సువార్త ప్రారంభించినప్పుడు నాకు బెదిరింపు ఫోనా కాల్స్ వచ్చాయి. అప్పుడు ల్యాండ్లైనే, మొబైల్స్ రాలేదు. మీరిక్కడ మీటింగ్ పెట్టరాదు. చర్చి పెట్టరాదు అన్నారు.  అంతకముందు రెండు సంఘటనలు జరిగినాయి.  హెబ్రోను నుంచి ఒక బ్రదర్. ఆయన పేరు నేను మర్చిపోయాను.  ఎంక్వైరి చేస్తే పేరు కూడ చెప్పగలను. ఆయన ఇక్కడ ప్రతి సండే, ‘సండేస్కూల్’ నడిపించేవాడు చిన్నపిల్లల కొరకు.  అప్పుడే కాలని మొదలైంది! 80లో మొదలైంది. 83,84 కల్లా నేనొచ్చాను. 84లో ఎస్టాబ్లిష్ అయ్యింది.

            దుండగులు ఆయనను కొట్టారు.  ఒక్కడెందుకు మత ప్రచారం చేస్తున్నావ్? అని! ఈ.యస్.ఐ (E.S.I) హాస్పిటల్లో అడ్మిట్ చేసే మూడవ రోజు ఆయన చనిపోయారు. తర్వాత సువార్త ప్రకటించినట్వంటి ఇంకొక సహోదరున్ని కూడ కొట్టారు. ఈయన చనిపోలేదు బ్రతికారు. ఆ నేపథ్యంలో నేనొచ్చాను. నేనొచ్చినప్పుడు నన్నందరు బెదిరించారు. నువ్వు ఇక్కడ రాకూడదు, సువార్త చెప్పకూడదు. మత ప్రచారం చేయకూడదు అని! దేవుడు ఇక్కడికి నన్నెళ్ళమన్నాడు. నాకు భారత రాజ్యాంగమే హక్కిచ్చింది. నా దేవుడు నాకు చెప్పాడు.  నా మనస్సాక్షి చెబుతుంది. మీరెవరు నన్నొద్దనడానికి? నేను చెప్తాను.  ఇష్టం లేకపోతే వినకండి! వినటం మానేయండి. చెప్పడం నా ధర్మం.  చెవులు మూసుకొండి.  తలుపులు మూసుకొండి. నన్ను రావొద్దంటే ఎలాగ? నేను మొదటనుంచి పోరాటపంధా కలిగినవాడ్ని? వరంగల్ మనిషిని. ఒద్దంటే అప్పుడింక జిద్ద్ ఒచ్చేస్తదన్నమాట. వ్యతిరేకత లేకపోతే మెత్తగుంటాను. వ్యతిరేకత ఉంటే కత్తిలాగ అయిపోతాను. నేను ముందు ఏం చేసానంటే MIG 4-10 లో అక్కడ పెద్ద పందిరేసి, చెట్టుమీద చిట్టారు కొమ్మకు పవర్ఫుల్ మైక్స్ పెట్టి, ఇక్కడనుంచి మైక్ పెడితే, కూకట్పల్లి దాక వినబడేది.  హౌజింగ్ బోర్డ్ కాలనీ నుండి! అన్ని ప్రాంతాల నుండి అభిమానులందరొచ్చారు.

            యేసు ప్రభువే ఈ లోక రక్షకుడని నేను నమ్ముతున్నాను.  ఈ విషయంలో మీకేమైన ప్రశ్నలుంటే, నన్నడగండి, నేను చెప్తాను. లేదా నేను ప్రశ్నలడుగుతాను మీరైనా సమాధానం చెప్పండి. నా ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పగలిగితే నేను యేసు మతం వదిలేస్తాను.  లేదా మీరు అడిగినదానికి నేనేమైనా చెప్పలేకపోతే, అప్పుడైనా వదిలేస్తాను. అది- ఇది చేతకాదు అడగరు, చెప్పరు. ఊరికేనే వ్యతిరేకిస్తానంటే మాత్రం నా దగ్గర మీ పప్పులుడకవు. నేను సువార్త చెప్తాను. మీకెంత దమ్ముందో, మీరేమి చేస్తానో చేయండి! కుమ్ముకుందామా మేం రెడీ! అని మైక్లో పెద్ద సౌండ్తో ప్రకటించేసాం. అప్పుడు ఒక పాతిక, ముప్పైమంది వచ్చారు. వస్తే నేను చెప్పే సభ చూట్టూరా 50మంది దుక్కలాంటి వాళ్ళని నిలబెట్టారు. ఆయుధాలేం లేవు కాని మనుషులు చేతులు కట్టుకుని నిలబడ్డారు. వస్తే కుమ్మండని చెప్పా. వాళ్ళు మాములుగా వచ్చి సువార్త వింటే వెళ్ళిపోతే వెళ్ళిపోని, వాళ్ళు కొడితే మాత్రం మీరు ఊరుకోవద్దు. మీరుకూడ అదే పద్దతిలో జవాబివ్వండి. వచ్చి చూసారు. చూస్తే ఇక్కడ గొడవ జరిగేటట్టుంది. వీళ్ళందరు సిద్ధంగా వున్నారు. మేమేం చెయ్యకూడదని చెప్పి చంకలో చిన్న శాలువా కప్పకొని, ఒక టేప్ రికార్డర్ పెట్టుకుని నా ప్రసంగాలన్ని స్పీకర్ బాక్స్ దగ్గర కూర్చొని రికార్డ్ చేసి, హనుమంతరావుగారి ఇంట్లో వెళ్ళి విన్నారు. వింటే ఒక్క తప్పు దొరకలేదు!

            ఎక్కడైనా మతాన్ని దూషిస్తాడేమో, దేవతల్ని దూషిస్తాడేమోనని చూసారు. అప్పుడు హనుమంతరావు గారు ఆర్డర్ ఇచ్చారేంటంటే, అందరూ పాస్టర్స్ వేరు, ఇతడు వేరు. ఇతని జోలికి మీరు వెళ్ళకండి. అతన్ని మీరేం అనొద్దు. అతను చేసేదేదో చేసుకోని! అతను మన దేవతలను, పురాణాలను గౌరవించి మాట్లాడినప్పుడు మనం ఎలాగ వ్యతిరేకిస్తాం? నీ తల్లి పూజ్యురాలు, గొప్ప స్త్రీ, మహానుభావురాలని మన తల్లికి, ఆయన నమస్కారం పెడుతున్నాడు.  మనమాయన్ని ఎట్లా కొడతాం? మన తల్లిని మనం అవమానించి నట్టే! మన తల్లికి నమస్కారం పెట్టిన వాళ్ళని మనం వెళ్ళి కొడతామా? మీరు రంజిత్ జోలికి వెళ్ళకండని చెప్పారు.

          ఆ తర్వాత సంఘం బలపడింది. తర్వాత మళ్ళీ ఈ మతోన్మాద శక్తులేం చేసారంటే నన్ను ఏదో రకంగా చికాకు పెట్టాలని నా ‘చెతక్’ స్కూటర్ ఎత్తుకుపోయారు. మళ్ళీ కొంతమంది పోలీస్ అధికారులవల్ల వాళ్ళువెళ్ళి బెదిరించారన్నమాట! మా గురువుగారి బండిది! మా గురువుగారు అంటారేంటి? మీరు హిందువులు కదా? అన్నారు. మేం క్రైస్తవులం కాదు, కాని రంజితన్న మాకందరికి గురువు. అయన్ని మేం గౌరవిస్తున్నాం. జాగ్రత్త మళ్ళీ తీసుకొచ్చి పెట్టెయ్యండి అని చెప్పారు. అది జరిగిన తర్వాతనే నన్ను శంకర్పల్లిలో కొట్టారు. ఆ తర్వాత చేవేల్లలో ఒకసారి కొట్టారు. అంటే వాదానికి సిద్ధపడ్డాము, కొడితే దెబ్బలు పడ్డాం. అవసరమైతే జవాబు ఇవ్వడానికి అన్నిరకాల అని రంగాల్లో మేం తయ్యారుండి గట్టిగా నిలబడ్డాం. గనక ఇవాళ నేను సంఘం బెట్టిన తర్వాతనే ఒకరొకరొకరు చాలామంది దాదాపు 20 సంఘాలు కె.పి.హెచ్.బి. కాలనీలో.

            మొట్టమొదట Be a good Apologist. ఎదుటివారి అభ్యంతరాలకు జవాబు చెప్పగలిగినట్వంటి విషయపరిజ్ఞానం కలిగి పౌలులాగా తర్కించి వినయంతో మీలో నిరీక్షణను గూర్చి హేతువడిగే ప్రతివానికి సమాధానం చెప్పడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండు. సాత్వికంతో సమాధానం చెప్పాలి. Be a good Christian Apologist. అవతలవాళ్ళు ఎందుకొద్దంటున్నారు? దానికి జవాబు ఏంటి? వారి అభ్యంతరాలకు సమాధానం ఏంటి? సామరస్యంగా చెప్పగలిగే సమర్థులుగా మనముండాలి.

            తర్వాత, మనం ఎంత సామర్థ్యంతో ఎంత సాత్వికంతో సమాధానం చెప్పినా దుర్మార్గంగా వచ్చి మనమీద దాడి చేసే వాళ్ళుంటారు. దాని మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఆత్మరక్షణ పద్ధతులు కూడ ఉండాలి. క్రైస్తవులు వాళ్ళదగ్గర బ్యాగ్లో కారంపొడి పెట్టుకుంటే సరి! ఈ గుండాలు వచ్చినప్పుడు కళ్ళలో కారంపొడి పోసి పోలీసెషన్లో కెళ్ళి అప్పగించాలి! అలాంటి పద్ధతులు, మన ఆత్మరక్షణ! తర్వాత అన్ని సభలలో తప్పకుండా ఎక్కడనుంచో, ఊహించలేని కోణంలోనుంచి కొన్ని కెమెరాలు ఫిక్స్ చేసి రెడీగా ఉండాలి. వీళ్ళొచ్చి కొట్టి, ద్వంసం చేసినప్పుడు మొత్తం రికార్డ్ అయివుండాలి. చేవేళ్లలో అలాగే జరిగింది. చేవెల్లెలో పాస్టర్ కాలేజ్ శౌరీబ్దారు పెట్టిన మీటింగ్లో లో అక్కడ కూడ కొట్టారు. నా వెన్నుపూస విరిగిందక్కడే! దేవుడు బాగుచేసాడు. అక్కడ నాలుగు బైబిల్లు తెచ్చి, చింపి ఆ సభలో వేదికమిదకెక్కి మూజ్యికల్ instruments పగులగొట్టారు.  కీబోర్డ్ వేరే సహోదరునిది, అదీ పగులగొట్టారు. ఆ కీబోర్డు దాదాపు 75వేలు, అక్కడునట్వంటి అన్ని ఎక్వింమెంట్స్ పగులగొట్టి నాలుగు బైబిల్లు తెచ్చి చింపి, అగ్గిపుల్లతో కాల్చేసారు.  వాళ్ళందర్ని జైలికి పంపించారు. అంటే వాళ్ళూహించని విధంగా ఎక్కడనుండో చీకట్లోనుండి ఒక కెమెరా ఫిక్స్ చేసి, మొత్తం ఎపిసోడ్ అంతా శూట్ చేసారు. తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లెంట్ ఇచ్చి వాళ్ళని గుర్తుపడతారా? అంటే ఆ గుర్తుపడతాం.  అని వెళ్ళి వాళ్ళ ఇల్లు చూపించి, వాళ్ళని తెల్లారే లోపల లాక్కప్లో పెట్టారు. తర్వాత కోర్టుకు హాజరుపరిచారు. అక్కడ వాళ్ళు చేసిన దుండగం యొక్క ఆధారాలు వీడియో! గవర్నర్ రంగరాజుగారు అనుకుంటాను.  నేను కూడ వెళ్ళికలిసాను ఆ టైంలో హోం మినిస్టర్ దేవేంద్రనాయుడుగారు, వారు కూడ వచ్చారు. అంత తతంగం జర్గింది. కేసు బెట్టినప్పుడు, మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులు కాళ్ళమీద పడ్డారు. తప్పైందండి! ఏదో తెలియకుండా చేసారు. అంటే తెలియకుండేం కాదు. తెలిసే కావాలని చేసారు. ఇప్పుడు మేం కేస్ పెట్టాం గనుక మీకీమాట వచ్చింది.  పొరపాటైందని ఈ మాట మాట్లాడుతున్నారు. మేం కేస్ పెట్టకపోతే ఇదే తప్పు మరో సారి గూడ జరుగుతుంది. గనుక పడండి మీ స్వయంకృతం మీది. స్వయంకృతాపరాధం.  తర్వాత చేవెళ్ళెలో మన సహవాసంలో ఉన్నట్వంటి పాస్టర్ గారు మంచి మందిరం కట్టారు. ఇంకా చాలా మంది మందిరాలు కట్టారు బ్రిటిష్ హయ్యాంలో కూడ మందిరాల్లే వక్కడ మేం సేవ ఆరంభించినాక మందిరాలు తయ్యారయాయి. వ్యూహం ఏమిటి అంటే ముందు మన ప్రెసెంటేషన్స్ కరెక్టుగా ఉండాలి. మనం తప్పు చేయకూడదు, ఎవర్ని విమర్శించి, దూషణగా మాట్లాడి అలాంటి తప్పులు మనం చేయకూడదు. తర్వాత మనం తప్పు చెయ్యకపోయినా సరే అన్యాయంగా మన మీద దాడి చేస్తే ఎవిడెన్స్ సేకరించే ఎవిడెన్స్ ఉండాలి. చట్టపరంగా చర్య తప్పకుండా తీస్కోవాలి. మనం ఆయుధాన్ని కాకుండా వాళ్ళు మన మీదికొచ్చి దాడి చేసేటప్పుడు కాస్త మిర్యాల పొడో, లేక కారం పొడో, ఏదో ఒకటి వాళ్ళ మీద చల్లడం ఈ విధమైన చర్యలతో వాళ్ళను బంధించి పోలిసులకు రెడ్ హ్యాండెడ్గా పట్టించగలిగే సిద్ధపాటు మనకుంటే రెండు మూడు కూటాలు చూస్తారు. నాలుగో కూటానికి రారు. అలా క్రైస్తవ సంఘం కూడ మేల్కొవాలి వ్యుహాత్మకంగా జాగ్రత్తగా సువార్త వ్యాప్తి చెయ్యాలి.