(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: ఆధునిక భారత చరిత్రలో ఒక గొప్ప విషాదం, అంబేద్కర్ గారి మరణం. ఈ రోజు నేను కూడా Happy గా లేను. మా తల్లి తండ్రుల మరణ దినం రోజు ఎటువంటిదో, అంబేద్కర్ గారి వర్థంతి దినం కూడా నాకు హృదయం దుఖఃపడుతుంది. అయినప్పటికీ సంతాపపడి, దుఖఃపడుతూ ఉండడం అంత నిర్మాణాత్మక క్రియాశీలకత కాదుగాని, వారి యొక్క వ్యక్తిత్వం, ఆలోచనధోరణి అనుసరించాలి. వారు అనుభవించిన బాధలలో నుండి, ఎదుర్కొని నిలబడి అంత ఎత్తుకి ఎదిగి మన రాజ్యాంగ నిర్మాణాధిపతి అయ్యారు. ఆయనలాగా మనం కూడా, మన యువత కూడా ఉన్నతమైన సంకల్పంలో ఎదిగి ఉండాలనేది ముఖ్యమైన అంశం. మా ఐ.పి.బి.పి. పార్టీకి కూడా అంబేద్కర్ గారే మా స్పూర్తి ప్రధాత. గనుక ఇప్పుడు మనం తప్పక ఆయన ఆశయాలు సాధిస్తాం. దేశంలో ప్రతి ఒక్కరు కూడా ఒక్కరు ఒక్కరు అంబేద్కర్ కావాలనే పిలుపునిస్తున్నాను.