140. ప్రశ్న :  బైబిల్లో నీ కన్ను మంచిదైతే నీదేహమంత మంచిదైవుండును, నీలో వున్న వెలుగు చీకటైయున్న యెడల, ఆ చీకటి ఎంతో గొప్పది అని చెప్పబడింది. వివరించగలరు.

 (అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)

జవాబు:  మత్తయి 6:23లో చీకటి ఎంతో గొప్పది అంటే మంచిది అని కాదు. గొప్పది అన్నదల్లా మంచిది అని అర్థం కూడా కాదు. సాధారణంగా మన వాడుకలో వినాశనం, లేదా విధ్వంసం ఎక్కువైంది అనడం కోసం అది ఎంతో గొప్పది అంటాం డా॥ వైస్॥ రాజశేఖర్ రెడ్డి మరణ వార్త విని గుండే ఆగి 300 మంది పైచిలుకు చచ్చిపోయారు. వారి హృదయానికి గలిగిన విషాదం “గొప్పది”. ఇవి అన్ని మంచివని కాదు. నీలో వున్న వెలుగే చీకటి అయితే, అంటే నువ్వు ఏది జ్ఞానం, అని ఏది మంచిది అని నీవు అనుకుంటున్నావో, వాస్తవంలో అది ఒక చీకటి అయితే, ఆ చీకటి నీ మీద చూపించేప్రభావం చాలా గొప్పగా, బలమైనటువంటిదిగా వుంటుంది. అది సైతాను కలిగించిన ప్రభావం, ఏదైతే నువ్వు వెలుగు అనుకుంటున్నావో దాని ప్రభావం గొప్పది అంటున్నాడు. It doesn’t mean that it is good, but its evil charecter is too strong for you, that is a great darkest great distractive force.  గనుక నువ్వు గెలవడానికి చాలా కష్టం అని అర్థం.