(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: దేవుడు యెహేజ్కేలును నరపుత్రుడు అని పిలవడంలో మర్మసహితమైన కారణం వుందని ఏమి అనుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు యోబు గ్రంథంలో స్త్రీకి పుట్టిన నరుడు ఎట్లాగు దేవుని దృష్టికి నిర్దోషి కాగలరు. నరులు దేవుని దృష్టికి ఎలాగు పవిత్రులు అగుదురు. ఆదాము ద్వారా అందరు పాపులైన నరులు, నరపుత్రుడా అంటే నరునియొక్క పుత్రుడా, లేక పాపియొక్క పుత్రుడా, శిక్షార్హమై జాతిపుత్రుడా అని అన్వయించుకోవాలా! ఇప్పుడు అలాంటి జాతిలో పుట్టిన యెహేజ్కేలు పై దేవుని ఆత్మ బలముగా రావడం, సింహాసనీయుడైన దేవుని చూసాడు. దేవుని లేఖనం అనే గ్రంథం తినమంటే తిన్నాడు. అలాంటి అంత్యకాల ప్రవచనాలను అనేకం యెహేజ్కేలు ద్వారా దేవుడు రాయించాడు. గడిచిపోయిన నిత్యత్వమర్మాలు లూసిఫర్ గూర్చి కూడా హెజ్కేలు ద్వారా దేవుడు తేలియజేసాడు. గనుక అంత ప్రత్యక్షత విస్తారమైనటువంటి అభిషేకం కలిగిన ఇతడు “నరపుత్రుడు” అంటే అవిధేయజాతిలో పుట్టినవాడు నేను కూడా ఆయన వున్న కొండమీదికి ఎక్కగలగాలి, ఆయన హస్తం నామీదికి వస్తుంది, అలాంటి ఆధ్యాత్మిక ధన్యకరమైనవన్ని నేను ఎందుకుపోందలేను, నేను మంచి వాడ్నికాను నాలో ఆదాము రక్తము వున్నదని, పాపం వున్నదని సైతాను discourage చేస్తుంటే మనం ఎదురు చెప్పగలం. మాటిమాటికి ఈ Encouragement కొరకు దేవుడు అలా పిలిచాడు. అదే పిలుపు 8వ కీర్తనలో, హెబ్రీలో 2 అధ్యాయంలో ఉన్నది యేసుప్రభువే అని పౌలు చెప్తున్నాడు. అంటే దీనికి ఏదైన సంబంధం వుందా అంటే అది ఏమి లేదు, కాని యేసయ్య ఒక కోణంలో మనుష్యకుమారుడు, మనం మరొక కోణంలో మనుష్యకుమారులం, మన అందరి ప్రతినిథి “యెహేజ్కేల్”. యేసు మాత్రం different ఎందుకంటే మనుష్యులకు ఇవ్వబడిన లేదా అనుగ్రహింపబడిన దేవకుమారుడు The son of God given to the mankind. Jesus is son of man is that vastly different of Ezekiel the son of man. అది గుర్తు పెట్టుకోవాలి.