(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: అసలు క్రిస్మస్ పండుగ ఆచారాలు ఏవి కూడా లేఖనానుసారమైన దేవుని ఆజ్ఞానుసారమైనవి కావు. క్రిస్మస్ పండుగ చేయమని బైబిల్లో లేదు. ఇక పండుగ చేయమనే లేనప్పుడు ఊసే లేనప్పుడు, ఇక ఆచారాలు ఎందుకు, మరల వచ్చు వరకు నా మరణంను ప్రచురించుడి అన్నాడు. గాని నా పుట్టుకను పండగ జేయుడి అని ప్రభువు అనలేదు. అపోస్తులు పౌలు కూడ చెప్పలేదు. ఇంటి మీద ‘Star’ పెట్టమని లేదు. కాని మనమే ‘Star’ కావాలని ఉంది. బైబిల్లో పెట్టోదని, చేయవద్దు అని లేదు. నక్షత్రం క్రీస్తు పుట్టుకను Announce చేసింది. గనుక, మన ఇంటిమీద ఒకటి పెడితే వీళ్ళు యేసు ఆరాధికులు అని ఊరంతా చెప్పుకుంటారు. గనుక యేసు ప్రభువారి జన్మము కూడా అనేక ప్రవచనాల నేరవేర్పు, దాన్ని కూడా మనం Celebrate చేసుకోవడంలో తప్పు లేదు. “Tree” ఎందుకు అంటే ఏ లేఖానాధారం కాదు. ఇది పెట్టడం వల్ల న్యాయపీఠం ముందు ఏ బహుమానము లేదు. అలాగే గద్దింపులేదు. ఈ ఆచారం ఎందుకు అంటే Roman Catholic Starting a Fairy tale. Commodities number (బంగారం, సాంబ్రాని, బోళం) మూడు కాని జ్ఞానుల number కాదు, అయితే ముగ్గురుని చూస్తారు. నాల్గోవజ్ఞాని అని ఒక కల్పిత పాత్ర, నీతినేర్చడానికి గాని, Holy fraud ఏంటంటే, ఆ నాల్గోజ్ఞాని తప్పిపోయి దేశదేశాలు తిరిగి ’33’ సం॥వెదికారు. అప్పటికి యేసయ్య శిలువ మీద వ్రేలాడుతున్నారు. ఈయన కొరకు తెచ్చిన బహుమానాలు ఏమి చేయాలి అని బాధపడుతుంటే, సిలువమీద యేసయ్య ఆ నాల్గోజ్ఞాని చూపులు కలిసి ఒక మౌన సందేశం గ్రహించాడు. నాకు ఇవ్వాలని తెచ్చిన ఈ కానుకలను వెళ్లి, చుట్టువున్న బీదలకు, చిన్న పిల్లలకు ఈ కానుకలు ఇచ్చేసేయి. అవి నాకు చేరినట్లే అని మౌనసందేశం యేసయ్య చెప్తున్నట్లు ఆ జ్ఞానికి తోచింది. అని చెప్పబడిన కల్పిత కథ. Actually పిల్లలకు వాళ్ల Parents gifts కొని ఆ ‘Tree’ కి తగిలిస్తారు. దీనిలో ఒక నీతి ఎంటంటే మన దేశంలో లాగే ‘మానవ సేవే మాధవ సేవ’ లాగా బీదలకు ఇవ్వడం కూడా సాక్ష్యాత్తు దేవునికే సమర్పించడం. ఇది అంతా Extra Biblical.