154. ప్రశ్న : గర్భవతియైన మరియమ్మకు వయస్సు ఎంత ఉండవచ్చు.

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)

జవాబు:   ఆధారాలు ఏమి లేవు కాని, కొందరు చరిత్రకారులు చెప్పిన విషయం. యోసేపుకు ఈమెకు చాలా Age gap ఉండవచ్చు.  యోసేపే గనక బ్రతికి ఉంటే మరియమ్మను యోసేపేచూసుకునేవాడు. భర్త కాబట్టి యేసుప్రభువారు సిలువలో అప్పగింతలు పెట్టడం ఉండదు. యోసేపు ముసలివాడై చనిపోయి, మరియమ్మ నడి వయస్సురాలు కాబట్టి యేసు మీద పడింది కుటుంబ భారం.  చాలా సంవత్సరాలు యేసయ్యే కుటుంబభారం మోసాడు. కాని నేను వెళ్లిపోతే నా స్థానంలో తల్లిని చూసుకోవాలని ప్రియ శిష్యుడికి అప్పగించాడు. ఇది అంతా మనం ఊహించి Most probable, Situation గాని బైబిల్లో లో ఆధారంలేదు.