161. ప్రశ్న : చిన్నపిల్లలు చనిపోతే సంఘం అనే శరీరంలో ఏ అవయవాలుగా వుంటారు.

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)

జవాబు:    సంఘం అనేది దేవునికి సాటి అయిన సహాయం కావాలి.  గనుక చనిపోయిన పిల్లవాడి ఆత్మ ఆ శరీరంలో ఏ వయస్సువరకు ఉండాలని భూమిమీద నిర్ణయమయిందో అంత వయస్సు వరకు పరదైసులోనే ఎదిగే అవకాశం వుంటుంది. ఎందుకంటే పసిపిల్లలు గాని, ముసలివాళ్లు గాని ఉండే అవకాశం లేదు అని లేఖనం చెప్తుంది. ఎంత వయస్సు వాళ్లైన యవ్వనమందు వున్నట్లే వుండాలి. కాబట్టి చిన్న పిల్లలైన, వాళ్ల జీన్స్ బట్టి అక్కడికి వెళ్లిన తర్వాత అక్కడి వారిచే వారు పొందిన ఉపదేశాన్ని బట్టి, వధువు సంఘంలో ఏ భాగంలో వారు ఉండటం సరైనదో అక్కడ పెట్టేస్తాడు. ఒక మనిషికి DNA, Brought up Teaching బట్టి ఆయన decide చేస్తాడు.