163. ప్రశ్న : యోహాను 5:37 లో మీరు ఏకాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయనను చూడలేదు, అని ఉంది. కాని పాత నిబంధన కాలంలో సంఖ్యా 12:08లో మోషేకు దర్శనముచే తెలియబరచబడింది అని ఉంది. దీనిని ఎలా అర్థం చేసుకోవాలి?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)

జవాబు:    మీకు, సమస్త క్రైస్తవులందరికీ తెలియజేసేది ముఖ్యంగా నా పుస్తకాలను చదవండి. మీ ప్రశ్నలన్నిటికి 99.9% అన్నింటికి సమాధానం అందులో ఉన్నాయి. విషయానికి వస్తే దేవునిని చూచుట అనేది అంతస్థులలో ఉంటుంది.  చూసిన భక్తుడు కూడా చూసినట్టే అనే భావనలో ఉండరు. నిర్గమ 33:11 చూడండి. అదే నిర్గమ 33:18లో దయచేసి నీ మహిమను చూపుము.  అంటే, నా ముఖమును చూసి ఏ నరుడు బ్రతుకజాలడు అనెను.  ముఖాముఖిగా మాట్లాడిన మోషేను, మళ్లీ దేవుడు ఏ నరుడు చూడలేడు అంటున్నాడు. సంఖ్యా 12:8లో దేవుడే చెప్పాడు మోషే చూసాడు అని.  కాబట్టి దేవున్ని కొంత మేరకు చూచిన తర్వాత ఇంకా చూడనిది ఎంతో ఉంటుంది. Like సముద్రంలో చంబెడు నీళ్లు తెచ్చిపెట్టుకున్నట్లు, మనుష్యులు చూసినట్లుకాదు. దేవునిలో ఇంకా లక్షరెట్లు, కోటి రెట్లు ఉంది.  సంపూర్ణ మహిమలో, అద్వితీయ కుమారుడ్ని చూసినట్లు ఏ నరుడు చూడలేడు.