167. ప్రశ్న : సార్ నేను ఆత్మీయంగా ఎదగడం లేదు ఇంకా డౌన్ అవుతున్నాను ఎందుకు జవాబు చెప్పండి?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)

జవాబు:    మన తల్లి గర్భములో నుంచి వచ్చినప్పుడు మనము కష్టపడి ఎదిగినామా? లేక కష్టపడకుండా ఎదిగినామా? అయితే మీరు ఆత్మీయ స్థితిలో కూడా ఎదుగుదలకు 1కొరింధీ 15:49 వచనం చూడండి.  మరియు మనము మట్టి నుండి పుట్టినవాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరింతుము.  అంటే మట్టి నుండి పుట్టినవాడు ఆదాము.  ఆదాము పోలిక మట్టి నుండి మనకు కష్టపడకుండానే వచ్చింది.  అలాగుననే పరోలోక సంబంధమైన యేసు పోలికను ధరిస్తాము మనము.  

          నూతనముగా జన్మనెత్తి రెండవసారి తిరిగి పుట్టిన అనుభూతి మనకుంటే ఆత్మీయ జీవితంలో ఎదగాలంటే అపోస్తలుల కార్యాలు 2:42 మనము ఖచ్చితముగా పాటించాలి. వచనంలో వీరు అపోస్తలుల భోదయందును, సహవాసము, రొట్టె విరుచుట యందును, ప్రార్ధన చేయుటయందును ఎడతెగక ఈ నాలుగు విషయాలను తప్పకుండా పాటిస్తూ కరెక్టు ఫెల్లోషిప్లో ఉండాలి.  ప్రతివారము బల్ల తీసుకోవాలి.  ఏకాంత ప్రార్ధన, కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థనలో పాల్గొనాలి. అపోస్తలులు చేసిన భోదనే వినాలి. సహవాసంలో ఉండాలి. ఇలా చేస్తూ ఉంటే తప్పకుండా యేసు పోలికలోనికి ఎదుగుతాము.