172. ప్రశ్న : సైన్స్ ప్రకారము మనిషి కోతి నుండి పుట్టిన వాడని చెప్తారు కదండి! ఎంత వరకు సబబు?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)

జవాబు:   నేను పాస్టర్నని నీకు తెలుసు, నేను బైబిల్ నమ్ముతానని మీకు తెలుసు.  మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేసి ఈ ప్రశ్న అడిగారో? సైన్స్ ప్రకారము అన్నావు.  అప్పటికి, ఇప్పటికి సైన్స్ అంటే నిరూపించబడినటువంటిదే సైన్స్. అది ఇంకా నిరూపించ బడలేదు.  ఎక్కడ ఎవరు దానిని నిరూపించలేదు.  ఇంకోటేమిటంటే జన్యుశాస్త్రము ఉన్నది.  ప్రతిప్రాణి పునరుత్పత్తి చేసినప్పుడు దీని డి.ఎన్.ఎ. కోడ్ పుట్ట బోతున్నటువంటి కొత్త జనరేషన్కి వస్తుంది.  ప్రతి ప్రాణి తన వంటి లక్షణాలు, రూపురేఖలు, స్వరూప స్వభావాలు కలిగిన ప్రాణినే ఉత్పత్తి చేయగలుగుతుంది. తప్ప అంతకన్న హైయ్యర్ ఆడర్ ప్రాణిని ఏ ప్రాణి ఉత్పత్తి చేయదు.  అనేది జన్యుశాస్త్రం చెబుతుంది.  కోతికి కోతే పుడుతుంది, మేకకు మేకే పుడుతుంది, పులికి పులే పుడుతుంది, పిల్లికి పిల్లె పుడుతుంది. ఏ ప్రాణికి ఆ ప్రాణి పుడుతుంది.  ఇది జన్యుశాస్త్రము.  “చార్లెస్ డార్విన్” చెప్పినటు వంటిది “హైపోతిసెస్” అంటే ప్రతిపాదిత సిద్ధాంతము.  నిరూపించబడింది కాదు.  ఇప్పుడు ప్రపంచంలో గ్రేట్ సైన్టిస్టులు అయిన వాళ్ళు “Theory of Evolution” ఇది వట్టి ట్రాష్, చెత్తవాదన అని చెప్పిన వాళ్ళు వందల మంది శాస్త్రవేత్తలు ఉన్నారు. గనుక ఇప్పుడు మనం ఆల్బర్ట్ ఐన్ స్టీన్ గానివ్వండి, ఐజక్ న్యూటన్ గానివ్వండి, గెలిలియో గానివ్వండి, కోపర్నికస్ గానివ్వండి జాన డాల్టన్ గానివ్వండి ఈ మహ శాస్త్రవేత్తలందరు కూడ దేవుడు మనుషులను సృష్టించారని నమ్మారు.  గాని కోతినుంచి వచ్చారని నమ్మలేదు.  జన్యుశాస్త్రం కరెక్టు అయితే తియరి ఆఫ్ Evolution రాంగ్.  కాబట్టి సైన్స్ దాన్ని ఖండిస్తున్నప్పుడు కోతి నుంచి మనిషి అని ఎలా అంటాం? అది దేవుడు లేడు అనే వాళ్ళకు పనికి వస్తుంది.  తప్ప మరేమి లేదు.  మనకు దేవుడు చెప్పాడు బైబిల్ లో Clear గా.  దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు అని.  గనుక మనకు అది అనవసర వాదన.