177. ప్రశ్న : యెషయా గ్రంథము 45:5 నేనే యోహోవాను. నేను తప్ప మరి  ఏ దేవుడును లేరు అన్నారు. అంటే భూమి మీద ఉన్నటువంటి 33కోట్ల దేవతలలో వీళ్ళుకూడ దేవతలేనా? లేక వీళ్ళు త్రోయబడినటువంటి దేవదూతలా? ఇది నా డౌట్.

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)

జవాబు:    దానికి నేను direct గా bible ఏ చదువుతాను, మీరు కూడ మీదగ్గర బైబిల్ ఉంటే మీరు కూడ తీసిచూడండి. 1కొరింథి 8:5వచనం దేవతలనబడినవారును, ప్రభువులనబడినవారును, అనేకులున్నారు. దేవతలనబడినవారు అనేకులున్నారు. దేవతలు ఉన్నారు అనడంలేదు.  దేవతలు అనబడినవారు ఉన్నారు.  6 వ వచనం చూడండి. 8:5 నేను చదివాను.  8:6 ఆకాశమందైననూ, భూమిమీదైనను, దేవతలు అనబడినవియున్నను, మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగెను. ఆయన నిమిత్తము మనమున్నాము. ఇక్కడ క్రైస్తవ విశ్వాసానికి, మన భారతదేశంలో ఉన్నటువంటి భక్తిపరులందరికి ఉన్న విశ్వాసానికి, ఒక ముఖ్యమైన తేడా ఉన్నది బ్రదర్.  ఎవరిలో నుండి సమస్తము కలిగెనో ఆయనను మాత్రమే మనం దేవుడు అని ఆరాధించాలి, గుర్తించాలి. దేవుడు అని పిలవాలనేది క్రైస్తవుల విశ్వాసము. అయితే హిందు సోదరులకు ఉన్న విశ్వాసం ఏమిటంటే. దేవుడులేక దేవత అనేది చాలా ఉన్నతమైన గౌరవం, ఉన్నతమైనటువంటి Respect, పూజ్యభావం, ఎవరిమీద ఉంటే వాళ్ళని మనం వాడచ్చు.  విష్ణువు సృష్టికర్త కాదు.  శివుడు సృష్టికర్త కాదు. మిగితాదేవతలు కోట్లమంది వాళ్ళు సృష్టికర్తలు అని వారు నమ్మడం లేదు. ఇప్పుడు గ్రామదేవతలున్నారు.  ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ, సమక్క-సారక్క ఇటువంటిదేవతలు కూడ ఉన్నారు. దేవుడు అంటే సృష్టికర్తను మాత్రమే అనాలి, సృష్టికర్త కాని వీళ్ళను దేవుడు అని పిలవద్దు అనే వెలుగింపు హిందు సోదరులకు లేదు. వాళ్ళ ఉద్దేశ్యంలో దేవుడు అంటే అర్థం ఏమిటంటే మనకు శ్రమలు, సమస్యలు ఉన్నపుడు సహాయం చేయగలిగిన ఒక మహాశక్తి ఏదైతే ఉన్నదో, నాకంటే గొప్ప శక్తి, నాకు చేతగానిది చేయగలిగిన శక్తి, నాకు సహాయం చేయగలిగిన శక్తి, నాకు సహయం చేయగలిగి ఉండి నన్ను ఉద్దరించి, నన్ను ఇక్కట్లలోనుండి గట్టెక్కించగలిగే శక్తి ఏదైనా ఉంటే దానిని నేను ఆరాధిస్తాను. దేవుడు అని పిలుస్తాను. దాంట్లో తప్పులేదు. సృష్టికర్త బ్రహ్మాదేవుడు కాని సమక్క- సారక్కను కూడ ఆరాధిస్తాము.  అంజనేయస్వామిని ఆరాధిస్తాం.  అయ్యప్పను ఆరాధిస్తాం. వీళ్ళు అందరు మనకు సహాయం చేయగలిగిన దేవుండ్లు. గొప్ప శక్తిమంతులు.  మనకు ఏవైతే సమస్య ఉంటుందో, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు కావలసిన విధంగా పూజలు, పూజ్యాధికములు, వ్రతాలు, ముడుపులు చెల్లించడం, వాళ్ళకు మ్రొక్కుబడులు చెల్లించడం ఇవన్నీ చేస్తే, వీళ్ళు కూడ మనకు help చేస్తారు అనేది వాళ్ళ విశ్వాసం.  అలా సహాయం కలుగుతుంది కూడ వాళ్ళకు. కాబట్టి క్రైస్తవ కోణంలో నుండి దేవుడు అంటే ఏమిటంటే సృష్టికర్త మాత్రమే. ఇస్లాం కూడ చెప్పేది ఏమిటంటే only the creator must be called god.  సృష్టి సూర్యుని, చంద్రుని, పంచభూతములను, ఈ బ్రహ్మాండములను చేసినవాని మాత్రమే దేవుడు అనే నామముతో పిలవాలి. సృష్టి చేయనివాని ఎంత శక్తిమంతులైన వాళ్ళు దేవుండ్లు కాదు, అనేవిషయం.  గనుక ఇక మనకు దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు.  సృష్టికర్తనే ప్రార్థిస్తాం, ఆయననే పూజిస్తాం, ఆయననే స్తుతిస్తాం, ఆయన సేవచేస్తాం అని  అనుకున్నపుడు మిగితాశక్తులు మనకవసరం లేదు.  గనుక దేవుడు అన్నవాడు ఒకడే ఉన్నాడు.  మరి అది Common గా ఇంగిత జ్ఞానం ఎవరికైనా చెబుతుంది.  ఏంటంటే సృష్టి చేసేటపుడు ఒక్క సూర్యుని 33కోట్ల మంది చెయ్యరు గదా! భూమిని 33 మంది చెయ్యరు గదా! ఎవరో ఒక్కరే చేస్తాడు. ఆయన్నే మనం ఆరాధించాలి అనేది ఇస్లాం యొక్క concept, క్రిస్టియానిటి యొక్క concept.  హిందూయిజంలో ఏంటంటే బహుళత్వానన్ని వాళ్ళు accept చేసారు.  ఆ సృష్టికర్త తన స్థానంలో తాను ఉంటాడు కాని మనకు ఈ దైనందిన జీవితంలో మనకు ఉన్న కష్టాలలో నుండి ఆదుకునే శక్తిమంతులు కొంత మంది ఉన్నారు. వాళ్ళను మనం ఆరాధించి, ప్రార్థనలు చేసి వాళ్ళ సహాయాలు పొందటం తప్పులేదు అనేది Hinduism.  క్రైస్తవులుగా మనం అది accept  చెయ్యము.  బైబిల్ అది ఒప్పుకోవడంలేదు.  మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు. సహాయక శక్తులు నీకు అక్కరలేదు. ఆ సృష్టికర్తే నీకు సమయోచిత సహాయం చేస్తారు. ఆ సృష్టికర్తే వచ్చి నీకోరకు బలియై తిరిగి లేచాడు.  నాయొద్దకు రండి అన్నాడు. నీకు ఏం కావాలో అడగమన్నాడు. ఇక వేరే శక్తులు మనకెందుకు అనేది క్రైస్తవుని విశ్వాసం.