(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: ఇప్పుడు ఇది నేషనల్ రిజిస్ట్రేషన్ ఆఫ్ సిటిజన్స్, సిటిజన్ షిప్ అనేది కాంగ్రెస్ హయాంలోనే వారు Initiate చేసిన ప్రాసెస్ మరి అది. అవసరమైన విషయమే, ఎందుకంటే, మనదేశం కొంచెం అభివృద్ధి చెందుతున్న దేశం. లిబరల్ ఆటిట్యూడ్ కలిగినటువంటి దేశము. సహాజంగా భారతదేశం అంటే, అమ్మ, ఎవరు వచ్చినా కడుపులో దాచుకున్నట్టు అందరిని తన కడుపులో దాచుకునే దేశం. మన ఇరుగు పొరుగు దేశాలలో కొంచెం నియంతృత్వదేశాలు ఉన్నాయి. నిరుపేద దేశాలు ఉన్నాయి. అక్కడ వారికి సర్వైవల్ ప్రాబ్లం ఉంది. ఖాందీసికులుగా వలస వచ్చి అక్రమంగా శరణార్ధులుగా యుద్ధ సమయాలలో గాని, కరువు సమయాలలో గాని ఓ కొన్ని లక్షల మంది వచ్చేసారు. వారు భారత దేశంలో బ్రతుకుతారు. లేబర్ మార్కెట్లోకి ఎంటర్ అవుతారు. మనదేశ పౌరులకేమీ ఉద్యోగాలు దొరకవు. ఇలాగ ఎన్నో సమస్యలు. వాడునేరం చేసిన, వాని సంగతి Record లెక్కలో ఉండదు. అందుచేత దేశంలోనికి ఎవరు వస్తున్నారు, ఎవడు వెళ్ళిపోతున్నాడు? మనదేశంలో ఎంతమంది ఉంటున్నారు? వారి యొక్క ఆరిజిన్ ఏంటి? వారి యొక్క చరిత్ర ఏంటి? గవర్నమెంట్ దగ్గర Record అయితే ఉండాలికదా! గనుక జాతీయ రిజీస్ట్రేషన్ ప్రతి పౌరునికి ఉండాలి అనేది. ఇప్పుడు ఆమెరికా దేశం ఉన్నది. అమెరికాలో వాళ్ళకు సోషల్ సెక్యూరుటీ నెంబర్ ఉన్నది(SSM). వీరు ఏ ప్రాసెస్కరకు ఏ ట్రాన్స్యాక్షన్ కొరకు ఏ బ్యాంకు పోయిన, ఇంకా ఫైనాన్షియల్ మినిస్ట్రికి పోయిన అది లీగల్ అఫైర్ అయిన సరే అది ఏదైనాసరే ఆమెరికాలో మీరు పోగానే (SSM) నంబర్ చెప్పమంటాడు. ఆ SSM నెంబర్ కంప్యూటర్లో కొట్టగానే ఇతని పేరు, తండ్రిపేరు, పుట్టిన స్థలము, Date of Birth కథ ఖార్ఖానా మొత్తం వచ్చేస్తుంది. మీరు ఏమి చెప్పనక్కర్లోదు. ఆ విధంగా మనదేశ పౌరులలందరి యొక్క Record ప్రభుత్వం చేతిలో ఉండటం అవసరమే. గనుక దానిని ఇప్పుడు complete చేసారంతే BJP వాళ్ళు. దానిగురించి ఇక్కడ ఎక్కువ ఉలిక్కిపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఒక్కటే problem ఏంటంటే. ఇంత జాతీయ ప్రాధన్యత, ప్రాముఖ్యత గలిగిన ప్రాముఖ్యమైన చట్టాన్ని తెచ్చేటప్పుడు గాని, సవరణ చేసేటప్పుడుగాని, పార్లమెంటులో విస్తృతమైన చర్చ ఎందుకుపెట్టలేదనే అందరు అడుగుతున్న ప్రశ్న. రెండు, మూడు దినాలు తీసుకోండి. ఇప్పుడు పార్లమెంటు అంటే అక్కడ, BJP సభ్యులు BJP భావాలు కలిగిన వాళ్ళు మాత్రమే ఉండరు. కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు. వేరే పార్టీలు ఉంటారు. అన్ని పార్టీల ప్రాతినిధ్యం ఉంటుందక్కడ. అందుచేత తమతమ అభిప్రాయాలను అందరిని చెప్పనిచ్చి, విసృత్తస్థాయిలో చర్చజరిగిన తరువాత ఓటింగ్ ద్వారా ఈ బిల్లును పాస్ చేయించేస్తే చాలా బాగుండేది. అలాగకాకుండా హడవిడిగా అదరబాదరగా చేసేస్తున్నారు. అది NRC విషయం.
ఇప్పుడు సిటిజన్ షిఫ్ అమెండ్మెంట్ బిల్లుకూడ, ఇది అది కూడ వేరు వేరు విషయాలు. ఒకేసారి takeup చేసారు. ఇప్పుడు ఇందులో ఇంకొక విషయం మీరు సిటిజన్ షిప్ apply చేసుకునేటపుడూ హిందూ అని రాస్తే వేరే స్టేటస్ వస్తుంది. హిందూ అని రాయకుండా ముస్లిం అని రాస్తే ఇంకొటి గాని రాస్తే నీకు గుర్తింపు ఉండదు. అనే ఒక వివక్షపూరితమైన ఒక class పెట్టారు. అంటే అప్పుడువాడు త్వరగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం కొరకైనా కూడ నేను హిందువుని అని రాసుకోవాలి. అంటే వీళ్ళు ఎంత మూర్ఖంగా పనిచేస్తున్నారంటే సిటిజన్షిప్ నాకు రావాలి అని ఆశపడి ఒకముస్లిం హిందూ అని రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు అనుకోండి. అతని మనస్సులో అల్లాహ్ మీద భక్తిపోతుందా. కాని వీళ్ళు record స్థాయిలో అందరిని హిందువులుగా మార్చాలి. అనేది ఒక కుటిల ప్రయత్నం ఇందులో కనబడుతుంది. అసలు మత ప్రసక్తి అనేది అడగకుండా, నువ్వు ఏ మతం అని అడగకుండా ఇంతకాలం నుండి ఇండియాలో ఉంటున్న వాళ్ళకి పౌరసత్వం ఇస్తున్నాం. అని వాళ్ళు ప్రకటించేసి ఇంతకాలంనుండి ఉన్నట్టు ప్రూఫ్ చూపించు చాలు. నీ మతం నాకు అనవసరం. అనుంటే చాలా బాగుండు. అందరు చేతులేత్తి మ్రొక్కేవాళ్ళు. అందుచేత వీళ్ళు ఏంటంటే అనుమానస్పదంగా, అనుమానం రేక్కేత్తించేవిధంగా, కొంచెం అనుమానాలు రేపే విధంగా పనిచేస్తున్నారు. కేంద్రం దీనిని అడ్డుకోవాలి. దేశ స్థాయిలో విస్తృతంగా చర్చలు జరగాలి. ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్లు ఒకటి. నేషనల్ రిజిస్ట్రేషన్ బిల్లు ఇవి హిందుత్వకోణంలో హిందుత్వానికి అనుకూలంగా ఉంది. Really హిందుత్వం ప్రతి ఒక్కరికి ఇష్టమే. హిందూత్వం అనేది ముస్లింకి ఇష్టమే. క్రిస్టియన్స్కి కూడ ఇష్టమే. ఇవి రాజకీయ హిందూత్వాలు. మొన్న మన తెలంగాణ ముఖ్యమంత్రిగారు గౌరవ ముఖ్యమంత్రి కె.సి.ఆర్. గారు కూడచెప్పారు. నేను హిందువుని బాబు. కాదా మరి? మీదేమో రాజకీయా హిందుత్వం. నాదేమో అసలైన హిందుత్వం అన్నారు. ఈ సందర్భంగా, ఈ channel ద్వారా వారికి అభినందనలు, నమస్కారాలు, కృత్తజ్ఞతలు తెలియచేస్తున్నాను. మనందరి మనోభావాలు ప్రకటించారు కె.సిఆర్. గారు. Real హిందుత్వం అంటే అందరికి ఇష్టమే. ఇది రాజకీయ హిందుత్వం. ఇతర మతాల వారిని అణచివేసి హిందువులుగానే దేశాన్ని చేస్తాం. అనే కుట్రయత్నంలో వారికి చేదోడు వాదోడుగా ఉంటాం. అనేవిధంగా ఎన్.ఆర్.సి. దీన్ని సిటిజన్ షిప్ ఆమెండమెంట్ తీసుకొచ్చారు. అని దీని ఒక అనుమాన ఉద్రిక్త వాతావరణంను సృష్టించారు. గనుక వెంటనే వారు ఆ ప్రయత్నాలు మానేసి పార్లమెంటులో విస్తృతస్తాయి, అలాగే దేశవ్యాప్తంగా కంట్రీవైడ్గా మేధావులతో సమాలోచన జరిపించి, అన్ని పార్టీల ప్రముఖులతో సమాలోచన జరిపించి అప్పుడు ఏదైనా పని చేయనివ్వండి. దానిని అందరు హర్షిస్తారు.