(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: మహేందర్ Maturity లేని వాళ్ళుకు Maturity లేని కోపం వస్తది. Maturity ఉన్న వాళ్ళకి Mature కోపం వస్తది. ఇప్పుడు Maturity లేకపోతేనే కోపం వస్తది అనే సిద్ధాంతం మీరెక్కడ నేర్చుకున్నారు? బైబిల్లో కూడ కోపపడుడి అని అన్నాడు. కోపపడుడి గాని పాపం చేయకుడి అని అన్నాడు. న్యాయమైన కోపం righteous anger righteous indigination అనేది ఉన్నది. కోపం రావడం immaturity కాదు. కోపం రావడం సమాజానికి ఎంతో మేలు చేస్తుంది. ఎవడైనా తప్పు చేస్తున్నాడనుకోండి. తప్పు చేసినోడిమీద ఎవరైన కోపపడకపోతే, ఇంకా ధైర్యంగా తప్పు చేస్తాడు వాడు. సమాజం చెడిపోతుంది. ఆరోగ్యకరమైన కోపం, న్యాయమైన కోపము, పరిపూర్ణ జ్ఞానం గలకోపము, సమాజాన్ని మంచి దారిలో నడిపిస్తుంది. చెడుతనం చేసే వారికి మంచి భయం పుట్టిస్తుంది. ఎవడైన తప్పుచేయాలంటే భయపడతాడు. గనుక కోపం మీద, మీకున్న Negative feeling తీసేసుకొండి. గనుక There is a anger which is righteous anger which will help the society to walk in Right way. గనుక అలాగ తప్పు నాయన దేవుడికి అన్ని తెలుసు. అంటే ఆయనకు అన్ని తెలుసు. మీరు ఈ ప్రశ్న వేస్తారని కూడ తెలుసు ఆయనకు. ఏమండీ నేను ఈ జవాబు చెబుతానని ఆయనకీ తెలుసు. దేవుని సర్వాంతార్యామిత్వము, సర్వవ్యాపకత్వము, సర్వజ్ఞతను ఇప్పుడు వదిలేసేయండి. ఇప్పుడు given situation లో ఒక పొరపాటు జరుగుతుంది. ఒక పెద్దమనిషి అన్నోడు వాణ్ణి గద్దించకపోతే ఎందుకలా చేస్తున్నావ్రా! అనకపోతే వీడికి భయం ఎలా ఉంటుంది. గనుక తప్పును ఆపడానికి ఒక పవిత్రమైన కోపం ఉండాలి. కోపం అనేది తప్పు ఎప్పుడు కాదు నాయనా! కోపంతో మనం విచక్షణ లేకుండా ప్రవర్తించడం అది immaturity. కోపంలో కూడ విచక్షణ గుర్తుంచుకొని ఆరోగ్యకరంగా, నిర్ణయాలు తీసుకోవడం అది దేవుని లక్షణం.