(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: యేసు ప్రభువు వారికి వాడు కనబడుతూ శోధించాడా? కనబడకుండా శోధించాడా? అని అడుగుతున్నారు. ఇక్కడ నేనైతే స్థిరంగా నమ్మేది ఏంటంటే ఏలీషా, తన దాసుని మనో నేత్రాలు తెరవబడాలని ప్రార్థించిన తరువాతనే ఆత్మల ప్రపంచాన్ని చూసే కళ్ళు అయనకు వచ్చాయి. అలాంటి బలహీనత యేసుకు లేదు. తరువాత ఆయన ఆత్మల ప్రపంచాన్ని చూడగలిగే కన్నులు ఆయనకు ఉండి ఉంటాయి. అందుచేత వాడు కనబడకుండా ఉండి, మైండ్లో ఏదైనా పెడదాం అని చుట్టు ఆవరించిన సరే ఆయన నేత్రాలకు కనబడుతుంది. ఎందుకంటే ఆయన ప్రార్థన చేసేటప్పుడు ఆకాశం తట్టు కన్నులెత్తి ప్రార్థన చేసాడు. అక్కడ దేవుని తట్టు చూసి, తరువాత ఫిలిప్పు అంజూరపు చెట్టు క్రింద ఉండకముందే నిన్ను చూచితిని అన్నాడు. అంత దూర దృష్టి, ఆత్మీయదృష్టి కలిగిన ఆయనకు వీడు దగ్గరకు వస్తే కనబడకుండా ఉండడు. మనకైతే కనబడడు గాని, యేసు కళ్ళుకు ఇప్పుడు మనం ఈ ఊల్లో లేనివాళ్ళని వేరే ఊళ్ళో ఉన్నవాళ్ళని మనం చూడలేం. యేసయ్య చూడగలిగాడు. గనుక యేసయ్య కన్నులు వేరు. ఆయన ఒక ప్రవక్తకూడ, దేవుని కుమారుడు సృష్టికర్త ఆదిసంభూతుడు. But he is also prophet, అభిషిక్తుడు అందుచేత ఆయనకళ్ళకు వాడు కనబడే ఉంటాడు. కనబడకుండా దాక్కునే అవసరం లేదు. అవకాశము లేదు కాబట్టి ఆయనను తీసుకొని ఎతైన దేవాలయపు శిఖరానికి ఎతైన పర్వతంపైకి తీసుకెళ్ళాడు. ఈ లోక రాజ్యాల మహిమ అంత చూపిస్తూ ఇదిగో నాకు సాగిలపడు అంటాడు. గనుక అప్పుడు ఒక విజ్యువల్ image అయితే ఉండి ఉండాలి. ఉంటేనే గదా సాగిలపడడం. కాబట్టి ఆదాము ముందుకు ఎలాగైతే సర్పములాగా దృశ్యరూపంలో వచ్చాడో, యేసయ్య ముందు కూడా కడపటి ఆదాము గనుక దృశ్యరూపంలో వచ్చి ఉంటాడు. But That should not matter for us. అక్కడ జరిగిన సంభవాల యొక్క ప్రాముఖ్యత గాని విలువగాని మనకున్న అదే Relavence గాని, ఆయన కనబడినా, కనబడకపోయినా దానిమీద మన ప్రాధాన్యత ఏమి మార్పురాదు. అదినేననుకుంటా అంతా అనవసరమైనటువంటి ఒక Discovery.