191. ప్రశ్న : అయితే యేసయ్య దేవుడు మనిషిని తన స్వరూపంలో, తన పోలికలో చేసుకొని నాసికారంధ్రములో జీవవాయువు ఊదగా మనిషి జీవాత్మ ఆయెను అని ఉంది. మళ్ళీ పరిశుద్ధాత్మ మనకు యేసయ్య పోయినకా పెంతుకొస్తు రోజున పరిశుద్ధాత్మ వస్తది అని అంటారు గదా అయ్యగారు 120మందిపైకి.  అది ఇది ఏమి same పరిశుద్ధాత్మనా అదే పరిశుద్ధాత్మ? ఇదేమి పరిశుద్ధాత్మ?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)

జవాబు:     కాదు కాదు అది వేరు, ఇదివేరు దేవుడు మట్టిబొమ్మలోనికి పరిశుద్ధాత్మను పంపాడు అనే మాట లేదు అక్కడ. ఆయన తన శ్వాసమును ఊదగా నరుడు జీవాత్మ ఆయెను. ఇప్పుడు దేవుడు, దేవుని శ్వాసము ఆమట్టిలోపల అప్పటిదాకా మట్టికి జీవం లేదు. మట్టి ముద్ద, అంతే.  ఆ  మట్టి ముద్దకు ప్రాణము రావడానికి ఊదాడు. మట్టిని ఆయన ఊదక ముందు, మాంసం, రక్తము, ఎముకలు కండరాలు, ఇవి ఏమి ఏర్పడలేదు.  ఆయన ఊపిరి ఊదిన తరువాతనే ఆ మట్టికి అవన్నీ భాగాలు ఏర్పడి, ఆ సజీవమైన మనిషి శరీరంగా, ఆదాముగా ఆమట్టి ముద్ద లేచి నిలవబడింది.

అంతే తప్ప ఇప్పుడు సృష్టిలో భాగంగా మట్టిని మనిషిగా మలచడానికి అవసరమైనటువంటి సృష్టికర్త ఆత్మగా ఆయనలోనికి ఆ శ్వాసము ఊదబడింది. అప్పుడు ఆ creation process complete అయ్యింది. ఇప్పుడు విశ్వాసి రక్షణపొందిన తరువాత లోపల నివసించడానికి ఆత్మ రూపిగా దేవుడు రావడానికి ఆ శ్వాస ఊదడానికి ఏమి సంబంధం లేదు. అదేమో మట్టిని మనిషిగా చేసే ప్రక్రియ.  ఇక్కడ ఏమో, రక్షింపబడిన పాపి దేవుని కొరకు బ్రతికే శక్తిని ఇవ్వడానికి దేవుడు వచ్చి వీడి, లోపల నివసించే ప్రక్రియ.  దానికి దీనికి ఏమి సంబంధం లేదు. ఎందుకంటే ఆదామును దేవుడు రక్షించడానికి చేయలేదు అక్కడ.  ఆయననుండి జీవాత్మ ఆయెను అని ఉంది. కాని పొందెను అని లేదుగా! He himself became a living spirit అని ఉంది.  కాని he received the living spirit అని లేదు!