(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: ఓ…… ఇది చాలా అవసరమైన ప్రశ్న ఎందుకంటే అపోస్తలుల కార్యముల 17:30లో అంతటను, అందరును మారుమనస్సు పొందవలెనని దేవుడు మనుష్యులకు ఆజ్ఞాపిస్తున్నాడు. గనుక మనం ఏది తెలుసుకోకపోయిన ముందు తెలుసుకోవలసిన విషయం. అంతట అందరు మారుమనస్సు పొందాలి అన్నాడు. అంటే అందులో పాస్టర్లున్నారు, బిషప్పులు ఉన్నారు. పోపుగారు కూడా ఉన్నారు. గనుక అంతట అందరు అంటే మాములు విశ్వాసులు మొదలుకొని, మీరు, నేను అందరం కూడా. మారుమనస్సు కంటే ముఖ్యమైన అంశము ఈ తరంలో ఏది లేనే లేదు. దీనికి నేను పెద్ద ప్రసంగం చేశాను. లోగడ మా కార్యాలయానికి ఎవరైనా రాగలిగితే, నేను 2 గంటల ప్రసంగము చేశాను. మారుమనస్సు 2 విధాలు. మరి జీవార్థమైన మారుమనస్సు అంటే, ఒక పాపి రక్షణపొందడానికి పొందవలసిన మారుమనస్సు. రక్షణార్ధమైన మారుమనస్సు అంటే పొందిన రక్షణను ఆవ్యక్తి కాపాడుకోవడానికి, కొనసాగించడానికి పొందవలసిన మారుమనస్సు. ఒక అన్యుడుగా ఉన్నప్పుడు దేవుడే తెలియకుండా ఉన్నప్పుడు అతడు యేసువైపు తిరిగడానికి పొందేది జీవార్థమైన మారుమనస్సు. యేసు ప్రభుతో నూతనంగా జన్మించిన తరువాత రక్షణను కాపాడుకోడానికి, కొనసాగించుకోడానికి పొందేది రక్షనార్ధమైన మారుమనస్సు. ఫిలిప్పి 2:12 చెప్పినట్లు భయంతోను, వణుకుతోను మాన సొంతరక్షణను కొనసాగించుకొనుడి అని. ఆ ప్రకారము ప్రక్రియ చేయడానికి అనుదినము పొందవలసినది అది రక్షణార్ధమైన మారుమనస్సు. మరి Bascically మారుమనస్సు అంటే అర్థం ఏంటంటే మనం నడుస్తున్న దారి సరియైనదికాదు, నేను వెళ్ళాలి అనుకున్న ఊరికి పోయే దారి ఇదికాదు. నేను రివర్స్లో వెళుత్తున్నాను అనే సంగతి గ్రహించినప్పుడు ఒక మనిషి నడక ఆపేసి, ఉన్నట్టు ఉండి ఉన్నపలానా నడక ఆపేసి గిరుక్కున వెనక్కి తిరుగుతాడు. Right about – turn అంటారు. గిరుక్కున వెనకకి తిరిగి opposite వైపు నడక start చేస్తాడు. ఎందుకంటే నేను తూర్పుకి వెళ్ళవలసిన వాణ్ణి. పడమటికి వెళ్ళుతున్నాను. By mistake అని అర్థము అయ్యింది. నేను నడక ఆపి గిర్రున తిరిగి మళ్ళీ తూర్పుకు వెళుతున్నాను. ఆ గిర్రున తిరిగేటటువంటి sudden change of attitude in mind. దేవుని వైపు సత్యం వైపు అప్పటిదాకా విముఖంగా ఉన్న ఆ సంగతుల వైపు గిర్రున తిరగడం sudden change of mental attitude towards god. దానిని repentance అంటారు.
మారుమనస్సు అంటే మనస్సు మారడం కాదు. దేవునిపట్ల దైవిక విషయాలపట్ల మనకున్న మానసిక attitude అనేది చటుక్కున మారడం. That is repentance. అయితే ఇప్పుడు డేవుడు ఎవరు? అని తెలుసుకున్నప్పుడు దేవతలని ఎన్నెన్నో అనుకున్నాను, ఇంకా దేవుడే లేడు అనుకున్నాను. ఉన్నాసరే ఎవరెవరో అనుకున్నాను. కాని ఇప్పుడు నాకు అర్థమైయింది యేసయ్యనే రక్షకుడు అనుకున్నప్పుడు ఇతర విశ్వాసాలు, సిద్ధాంతాలు అన్నిటినుండి యేసువైపు తిరుగుతాడు. అది జీవార్థమైన మారుమనస్సుకాని తరువాత కూడా రక్షణార్థమైన అన్నాను గదా! అది అనుదిన మారుమనస్సు. అసలు ఇది తప్పుదారి అని తెలియగానే దేవుని తట్టు గిరుక్కున మళ్ళుకోవడం అన్నాను గదా. ఒక విశ్వాసికి అదే పరిస్థితి అనేక సార్లు సంభవిస్తుంది. ఒక సాటి సహోదరుడి పట్ల నా attitude సరియైనది కాదు అని గ్రహిస్తే, వెంటనే ఆస్థితినుండి గిర్రుకున్న మళ్ళుకోవడం, తప్పును సరిదిద్దుకోవడం. నా సిద్ధాంతం సరియైనది కాదు. నా బోధ సరియైనదికాదు…. లేకపోతే నేను చేస్తున్న కొన్ని క్రియలు దేవునికి అసహ్యమైనవి అని తప్పని గ్రహించిన నాకు తెలిసిన ప్రతివిషయము నుండి ఆ క్షణములో ఉన్నట్టు ఉండి sudden గా గిర్రున మళ్ళీ దేవుని తట్టు తిరగాలి. ఇది తప్పని తెలిసినాకా అందులోనే కొనసాగకూడదు. అప్పుడు రక్షణను కొనసాగించుకోలేము. తప్పులు అనేవి జరుగుతూనే ఉంటాయి. మనకు తెలిసికొన్ని, తెలియకకొన్ని మన దృష్టికి రాగానే చట్టుక్కున దేవుని వైపుకి తిరిగి ప్రభువా నన్ను క్షమించు! అని ఈ దారి మళ్ళీ నేను నడవను అని ఎప్పుడు దేవునితట్టు తిరుగూతునే ఉంటే అనుదిన నిరంతర మారుమనస్సు. మారుమనస్సు అనేది once for all experience కాదు. నీటి బాప్తిస్మం జీవితానికి ఒక్కసారే. మారుమనస్సు ఒక్కసారికాదు. రక్షణపొందడానికి ఒక్కసారి పొందాం. దానిని కొనసాగించడానికి గంటకు ఒక్కసారి నిమిషానికి, ఒక్కసారి పోందుతూనే ఉండాలి. Its a constant con tinual attitude of turning away from everything that is wrong, from every thing that is a not right, that is pleasing to god. దేవునికి ఇష్టం కానిది అనిపించిన ప్రతిసారి, దేవుని తట్టు తిరిగి వెళుతూనే ఉండాలి. అది continuous process of turning away from everything that is not right. ఈ మారుమనస్సు అందరము పొందాలి. నేను పొందాలి. అందరం పొందాలి. లేకపోతే రాకడలో ఎత్తబడటం కష్టం.