193. ప్రశ్న : నాకు చిన్న doubt .  దేవునికి ఆదాము పండు తింటాడు, పాపం చేస్తాడు అనిముందుగానే తెలిసి ఉంటుంది కదా! అయితే పండు ఎందుకు పెట్టుంటాడు? లేకపోతే ఆ పండు తినాలి ఆదాము, అని చెప్పి దేవుడు ఆదామును గురించి అనుకుని పెట్టాడా?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)

జవాబు:     నేను చెబుతానమ్మ తప్పకుండా, మీరు ఏ చర్చికి వెళ్ళతారమ్మ? మన శ్యామ్ కిషోర్ కి channel ద్వారా నా వందనాలు.  JCILM Members అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు అమ్మ.  ఈ సమాధానము, ఈ ప్రశ్నకు జవాబు నేను చెబుతాను.  చాలా సార్లు చెప్పాను.  మీరునా పుస్తకాలు చదవాలి దయచేసి.  Must and should గా చదవాలి రెండో ఆప్షన్ లేదు.  చదివేదాకా బైబిల్ లో ఇటువంటి కీలకమైన విషయాలు మీకు ఎప్పటికి అర్థంకావు. ఇంక ఏ భక్తులు రాసిన పుస్తకాలలో కూడ జవాబులుండవ్. నేను రాసిన పుస్తకాలను తప్పక మా కార్యాలయానికి సంప్రదించి మీరు తెప్పించుకోండి.  ఇదినేను ఇచ్చే సలహా.  

          ఇప్పుడు మీరు అడిగినదానికి సమాధానం చెబుతాను. దేవునికి అన్నీ తెలుసు అనేది అది జగమేరిగిన సత్యం.  అందులో for example గా చెబుతాను.  ఒక క్లాస్ ఉంది.  క్లాసు రూమ్ లో ఒక  40 మంది విద్యార్థులున్నారు. అందులో ఒకడు dull head ఉన్నాడు.  వీడికి English రాదు, Maths రాదు, Telugu రాదు.  వాడికి ఏమి చెప్పినా బుర్రకు ఎక్కదు.  వాడొక weak person.  అయితే వాడిని చూస్తే Teacherకి తెలుస్తుంది.  ఏంటంటే ఈసారి వీడు పరీక్షలో ఖచ్చితంగా fail అయిపోతాడు అని తెలుస్తుంది కదమ్మా.  Class Teacher, (or) subject Teacher & dull student ని చూసి జ్యోష్యం చెపుతుంది.  ఈ సారి వీడు గట్టెక్కడం కష్టం.  తప్పక Fail అవుతాడు అని ఆ Teacher అంచనావేసింది. వేసిన కూడా వాడు పరీక్షకు అయితే హాజరు కావాలి.  ఏమ్మా వీడు ఎలాగు Fail అవుతాడని వీడికి పరీక్ష పెట్టకుండా ఉంటారా? ఎట్లాగు Fail అవుతాడు అని పరీక్షపెట్టకుండా ఉండరు. పరీక్షెందుకు పెట్టావ్ అంటే అది Process, Routine అది.  అయితే వాడు Fail అయ్యేరకమా? Pass అయ్యే రకమా? అని ఒక Teacher ఏ చెప్పగలిగినప్పుడు ఆదాము యొక్క Obedience ని Test చేయడానికి proove చేయడానికి విధేయుడైతే  విధేయుడని, అవిధేయడైతే అవిధేయుడని practical గా prove కావాలి అని ఒక Test దేవుడు పెట్టాడు. Test ఎందుకు? దేవునికి ముందే తెలుసు కదా! అని మనము అనకూడదూ, ఎందుకంటే అది విశ్వానికి తెలియాల్సిన అవసరం ఉంది. అది ఆదామునకు తెలియాల్సిన అవసరం ఉంది. అందుచేత అతడు విధేయుడా? కాదా? అని పరీక్ష పెట్టడం. ఆదాము Fail అయిపోయాడు. అది దేవునికి ముందే తెలుసు.  అది మనకు సంబంధం ఉన్న విషయం కాదు. దేవునికి ముందే తెలుసు.  మీరు ఈ ప్రశ్న అడుగుతారు అని ముందే తెలుసు. నేను ఈ జవాబు చెబుతానని ముందె తెలుసు, దేవునికి అన్ని ముందే తెలుసు. ఒక విద్యార్థికి practical side నుండి మనం చూస్తే fail అయ్యాడని pass అయ్యాడని సర్టిఫికేట్ ఇవ్వడానికి పరీక్ష అనేది ఒకటి జరగాలి. ఏదేనులో జరిగింది అదే.