(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: బైబిల్ చదవడంలో నేను నా రక్షణ జీవితం ప్రారంభంలో నేను ఉదయం 6గంటలకు తలారా స్నానం చేసి, మోకరించి, బైబిల్ చదవడం ప్రారంభిస్తే సాయంత్రం 7,8 దాకా మోకాళ్ళ మీదనుండి లేవకుండా చదివేవాన్ని మధ్యలో nature calls కి ఒకటి, రెండుసార్లు లేవడం నా ప్రక్కన ఒక కుండలో నీరు త్రాగడం తప్ప అసలు వేరే పనికొరకు లేచేదిలేదు. అలాంటప్పుడు నేను గమనించింది ఏంటంటే ఉదయం నుండి సాయంత్రం వరకు నేను ద్వితియోపదేశకాండం వరకు బైబిల్ లో పంచకాండాలు Major portion of the old testament అన్ని గంటలు నేను చదివేవాన్ని. ఇప్పుడు ప్రతి రోజు 5 ఆధ్యాయాలు చదవడం ఆదివారం 7 అధ్యాయాలు చదవండి అని చాలా కాలంగా ప్రచారంలో ఉంది. ఇది ప్రచారం అయితే నేనంటుంది ఏంటంటే, ఆదికాండంలో 50 అధ్యాయాలు నిర్గమకాండం 40 అధ్యాయాలు, ఆ తరువాత లేవియ, సంఖ్యా, ద్వితీయోపదేశకాండం ఇవన్నీ నేను ఒకటే రోజు చదివాను వీళ్ళు 5 అధ్యాయాల కక్కుర్తి ఎందుకు నాకు అర్థంకాదు. అందుకే నేను అంటున్నాను. ఆత్మీయంగా దేవుని విషయంలో మీరు తిండిబోతులు కండి. వెనక ముందు కాకుండా కనీసము రెండు గంటలు మానకుండా బైబిల్ చదువు తాననే వ్రతం పూనితే సం॥ కాదు 6 నెలలోకి బైబిల్ అయిపోతుంది. బైబిల్ చదవాలి. మనకున్నటువంటి ఆక్సిజన్, ఆహారం, మనకున్నటువంటి ప్రాణాధారం అంతా బైబిలే. బైబిల్ చదివే దగ్గర అంతా కొంచెం, కొంచెం చదవాలి. భోజనమేమీ సమృద్ధిగా చేస్తాం. ఎందుకు అంత పిసినారితనం బాగా చదవండి. రాత్రి పగళ్ళు, చదవండి. ఎసేన్షియల్ మన జీవనోపాధి, జీవనాధారం రొట్టెముక్క సంపాదించాడానికి కుటుంబము సంసార బాధ్యతలు ఇంటిపనులు అన్ని చేయగా మిగిలిన సమయం అంతా బైబిలే చదువుతూనే గడపండి. నీకు 6 నెలలోనే బైబిల్ అయ్యిపోతుంది. సంవత్సరంలోనే ఎందుకు ముగిస్తారు? 4నెలలో ముగిస్తారు. కాబట్టి నేను 15రోజులలో బైబిల్ చదివి ముగించే వాడిని. ఆదికాండం నుండి ప్రకటన 15 రోజులలో బైబిల్ ముగిస్తే మీరు 3 నెలలకూ 4 నెలలకు ఎందుకు ముగించలేరు. నా లాగా చదవకండి 8గంటలు. మాకు పనులులేవా? అంటే అప్పుడు నేను యవ్వనస్తున్ని నాకింకా ఏమి లేవు పెళ్ళిపెటాకులు లేవు dependency ఏమీ లేదు గనుక నేను చదివాను. అంటే, పోని 2,3గంటలు అయినా చదవండి. స్నేహితులతో పిచ్చాపాటి మాట్లాడినంత సేపు చదివినా 6 నెలలకి బైబిల్ అయిపోతుంది. నేను చెప్పేది ఏంటంటే బైబిల్ చదవడం విషయంలో మీరు sparing గా కొంచెం పిసినారితనంగా ఉండకండి. మీరు అస్సలు రెచ్చిపోయి చదివేసేయండి. బైబిల్ రోజు లోపల మీరు easy గా ఆదికాండం చదివేయగలరు. తరువాత మీరు 1 day లో చదవకపోతే పోని, 1 Week లో ఆదివారం రెండవ వారం నిర్గమకాండం చదివేయండి. ఇంకా ఫిలేమోను, 3 యోహాను ఇవన్నీ One, One పేజీ పత్రికలు యూదా half పేజీ పత్రిక. Total New Testment రెండు రోజులలో చదివేయుచ్చు. ఆకలి ఉండాలి. అంత భారము తృష్ణ లేనప్పుడు, మీరు రోజుకి 5 అధ్యాయాలు ఆదివారం 7అధ్యాయాలు చదివినా కూడ ఒరగబెట్టేది ఏమి ఉండదు అక్కడ. చదివాం అనేపేరు తప్ప లోపలికి మహిమరాదు. ఆకలితో చదవాలి అవురావురుమని. అప్పుడే మహిమ లోపలికి వచ్చేది.