196. ప్రశ్న : అహంకు, ఆత్మాభిమానంకు తేడా ఏమిటి? విశ్వాసికి అహం ఉండకూడదు.  అలాగే ఆత్మాభిమానం కూడా ఉండకూడదా? ఆత్మాభిమానం ఉండవచ్చా?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)

జవాబు:     చాలా మంచి ప్రశ్న అహంభావము, గర్వము, ఈ రెండు సమానార్థమైన పదాలు. ఆత్మాభిమానం అంటే నా మీద నాకు గౌరవం ఉండడం, ఆత్మగౌరవం అని కూడా అంటారు. నామీద నాకు గౌరవముండడం, ఇది ఒక ఉత్తమ లక్షణం. ఆత్మాభిమానం చెడ్డ గుణం కాదు. ఆత్మాభిమానం చాలా ఉత్తములకు ఉండే లక్షణం.  ఎందుకు ఉత్తమము అంటే నన్ను నేను గౌరవించుకుంటాను, నా ఎదుట ఉన్న వారిని కూడా గౌరవిస్తాను. ఆత్మాభిమాని వేరేవారిని కించపరచడు. తన గౌరవాన్ని తాను పరిరక్షించుకుంటూనే, వేరే వాళ్ళకు కూడా ఇలాగే ఆత్మాభిమానం ఉండొచ్చుకదా! అని గుర్తిస్తాడు. నా దృష్టికి నేను ఒక గౌరవ ప్రథమైనటువంటి వ్యక్తిని.  కాని ఎలాగు నేను అనుకుంటున్నట్లే ఎదుటివారు కూడా అనుకుంటూ ఉండవచ్చు కదా? అతనిని ఎందుకు గాయపరచాలి. నేను నా వ్యక్తిత్వాన్ని, నా భావజాలాన్ని, నా ఆలోచన విధానాన్ని, నా ఉద్దేశ్యాలను, నేను గౌరవించుకుంటూనే, నాలానే తన్ను తాను గౌరవించుకుంటే దాన్ని నేను ఘనపరచాలి, గుర్తించాలి. అంటే సమాజంలో ప్రతి ఒక్కరు తన్ను తాను అభిమానించుకుంటూ ఎదుటి వాడికి ఉన్న ఆత్మాభిమానాన్ని కూడా నాలో నాకున్న ఆత్మాగౌరవంతో సమానమైనది అని అందర్ని ఘనపరుస్తూ ఉంటే, సమాజం ఒక స్వర్గతుల్యం అయిపోతుంది. అందుకే అది ఉ త్తమ లక్షణం. కాని ఈ అహంభావి ఇంకా గర్విష్టి అనేవాడు ఇందులో 50% చేస్తాడు తన్ను తానే గొప్ప అనుకుంటాడు. వేరే వాళ్ళందరు నీచులు అనుకుంటాడు. నేను చాలా గొప్పోన్ని, మిగితవాళ్ళు అందరు చవటలు అని, నేను చాలా గొప్ప అనుకుంటారు అది గర్వం. నేను చాలా గొప్పోన్ని కాని ఇలాంటి భావజాలం ఎదుటి వారిలో కూడా ఉంది.  ఉండే అవకాశం కాని నాలాంటి మనిషే కనుక దాన్ని కూడా నేను తృణీకరించకూడదు. అనే జ్ఞానము కలిగిన మనోవైఖరి ఆత్మాభిమానం.  గనుక ఆత్మాభిమానం ఉండితీరవలసిన ఉత్తమ లక్షణం.  గర్వం ససేమిరా ఉండకూడనటువంటి దుష్ట లక్షణం.