(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: స్త్రీలు గాని, పురుషులు గని ఇలాగు ఏకాంత ప్రార్థనలో ఉండాలి అని బైబిల్లో ఎక్కడ చెప్పలేదు. 1కొరింథీయులకు 11:5 ఏ స్త్రీ తలమీద ముసుగువేసుకొనక ప్రార్ధన చేయునో లేక ప్రవచించునో ఆ స్త్రీ తన తలను అవమానపరచును. ఏలయనగా అది ఆమెకు క్షౌరముచేయబడునట్టుగానే యుండును. ప్రవచించును అన్నాడు. ప్రవచించుట అంటేనే సంఘముకొరకైన సందేశము. 1కొరింథీ. 14:3 క్షేమాభివృద్ధియు, ఆదరణయు, హెచ్చరికయు కలుగునట్లు ప్రవచించువాడు మనుష్యులతో మాట్లాడు చున్నాడు. దేవుని సందేశాన్ని మనుషులకు అందించుట ప్రవచించుట గనుక ప్రార్థన, ప్రవచనము జరుగుతుంది అంటే చుట్టూ జనం ఉన్నారని అర్థం. చుట్టూ ప్రజలుంటేనే ప్రవచనం అని అర్థం. నేనొక్కన్నే తలుపేసుకొని సందేశిస్తే అది ప్రవచనం కాదు. ఏ స్త్రీ ప్రార్థించునో లేక ప్రవచించునో అంటే ప్రజల మధ్యలో అని అర్థం. కాబట్టి సంఘారాధానలో స్త్రీ తప్పకుండా ముసుగువేసుకోవాలి. సంఘారాధానలో,సమాజకూటల్లో పురుషుడు తలను కప్పకుండా ఉండాలి. ఏకాంత ప్రార్ధన ఎలాగైన చేయవచ్చు కాని సమాజకూటాల్లో మాత్రం ఈ నియమాన్ని పాటించాలి.