201. ప్రశ్న : ఆదికాండంలో దేవుడు భూమిని, చంద్రుడు సూర్యుణ్ణి సృష్టించాడు అని ఉంటుంది. కాని జలములను సృష్టించాడు అని ఎక్కడ లేదు కదా?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)

జవాబు:     దేవుడు ఆదియందు భూమి ఆకాశములను సృజించెను అన్నాడు. అందులో ఉన్న ఈ ఐదు ఎలిమెంట్స్ని చూశారా! వాటితో ఒక్కొక్క యుగము చేసినప్పుడు దేవుడు ఒక్కొక్క పాత భూతమును తన చేతితో పట్టుకొని నాల్గింటిని కొత్త భూతలుగా చేసాడు.  అది విషయం. సామెతలు 30:2,3 నిశ్చయముగా నేను మనుష్యులలో నావంటి పశుప్రాయుడు లేడు అంటాడు ప్రవక్త యాకె కుమారుడైన ఆగూరు.  నేను జ్ఞానాభ్యాసము చేసికొన్నవాడను కాను పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానము పొందలేదు అని అంటాడు. ఇంకా ఆకాశమునకెక్కి మరల దిగినవాడెవడు? తన పిడికిళ్లతో గాలిని పట్టుకున్నవాడెవడు? బట్టలో నీళ్లు మూటకట్టినవాడెవడు? భూమియొక్క దిక్కులన్నిటిని స్థాపించినవాడెవడు? ఇక్కడ ఆకాశము, భూమి, గాలి, నీళ్లు ఇంకా అగ్ని గురించి మాత్రం చెప్పలేదు. దేవుడు ఒకసారి ఆకాశాన్ని జానతో కొలిచాడు అని యెషయా ప్రవక్త అంటాడు. గాలిని తన పిడికిటిలో బంధించినవాడు అంటే విశ్వంలోని గాలిని దేవుడు తన పిడికిటిలో పట్టుకున్నాడు. బట్టలో నీళ్ళు మూటకట్టినవాడు.  అనగా దేవుడు చేసిన మహాత్కర్యాలు ఏమిటో, ఆయన పేరేమిటో నీకు తెలుసా? ఆయన కుమారుడి పేరెంటో తెలుసా? నాకు తెలియదు గనుక నేను పశుప్రాయుడను. అని ఆగూరు ప్రవక్త చెబుతున్నాడు. గనుక దేవుడు ఈ బ్రహ్మాండమును పంచభూతాలతో సృష్టించాడు. అయితే ఒక యుగము అంతరించి కొత్త యుగము మొదలైనప్పుడు పాత యుగంలో ఉండే ఐదు భూతాలలో ఒక భూతాన్ని కాపాడుతాడు.  మిగతా నాలుగింటిని కొత్తగా చేస్తారు. ఒకసారి పాత యుగంలో నీటిని కొత్త యుగంలో కూడా ప్రవేశపెడదాం అనుకున్నాడు. దాని బట్టలో మూటగట్టి నీళ్ళన్నింటిని తన పక్కలో పెట్టుకుని మిగతానాలుగింటిని నూతనమైనదిగా చేసాడు. ఇంకొక్కసారి గాలిని బంధించి కొత్తదిగా చేసాడు. అలా ఒక్కొక్క యుగం ఆరంభము అయినపుడు నాలుగు భూతాలను కొత్తగా చేసి ఒకటి పాతదే Continue చేసాడు. అయితే ఇప్పుడు మనము ఉన్న యుగము అంతరించినపుడు. ఇదిగో సమస్తము నూతనమైనవిగా చేయుచున్నాను అని ప్రకటన గ్రంథంలో దేవుడు చెప్తాడు. విశ్వచరిత్ర గ్రంథం చదవండి అందులో కూడా నేను చెప్పాను. ఆదికాండం1:1లో చెప్పినట్టు. ఆకాశము, భూమిని చేసినపుడు భూమి మీద ఉన్న నీళ్ళను కలిపినటువంటి భూమినే చేసాడు. అయితే దేవుడు చేసిన భూమిలో 3లో 2వ వంతు నీళ్ళు ఉన్నాయి. పంచభూతాల లెక్క ఏమిటంటే ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క భూతాన్ని కాపాడి నాలుగింటిని కొత్తవిగా చేశాడు అనేది బైబిలులో ఉన్నటువంటి చరిత్ర.