202. ప్రశ్న : యూదులు, ఇశ్రాయేలియులు, అరబ్బులు, క్రైస్తవులు ఈ నాలుగు రకాల వ్యక్తులు మతాలుగా పిలువబడుతున్నారు కదా! అయితే వీరందరికి దేవుడు ఒక్కడేనా? ఒక్క దేవుణ్ణి వీళ్ళందరు ఒక్కొక్క పేర్లతో పిలుస్తున్నారా? అసలు యూదులు అంటే ఎవరు? ఇశ్రాయేలియులు అంటే ఎవరు? అరబ్బులు అంటే ఎవరు? క్రైస్తవులు అంటే ఎవరు?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)

జవాబు:     అబ్రాహాము సంతానమైనటువంటి ఇస్సాకు, ఇస్సాకు యొక్క ఇద్దరు పిల్లలలో చిన్నవాడైనటువంటి ఇశ్రాయేలు జ్యేష్ఠత్వపు హక్కును పొంది ఆ ఇశ్రాయేలు నుండి వచ్చిన 12 గోత్రాల జనాంగం ఇశ్రాయేలు జనాంగం అని ప్రాథమికంగా పేరు. ఆ ఇశ్రాయేలు జనాంగము మరి ఒక రాజ్యముగా స్థిరపడిన తరువాత సమూయేలు ప్రవక్త రాజ్య పాలన పద్ధతిని నియమించిన తరువాత మొట్టమొదటి రాజు సౌలు 40 ఏళ్లు పరిపాలించాడు. రెండవరాజు దావీదు 40 ఏళ్ళు పరిపాలించాడు. తరువాత మూడవరాజు సొలోమోను ఈయన కూడా 40 ఏళ్ళు పరిపాలించాడు. ఆతరువాత సొలోమోను కొడుకైనటువంటి రెహబాము సమయం వచ్చింది.ఈ రెహబాను సమయం వచ్చినపుడు రాజ్యం రెండుగా చీలిపోయింది.  ఆ 12 గోత్రాల రాజ్యము ఒకటే రాజ్యం కాకుండా రెండు రాజ్యాలుగా చీలిపోయాయి.  ఎందుకంటే సొలోమోను కుమారుడైన రెహబాము కొంచెం కఠినంగా మాట్లాడి నేను ఎవరిమాట వినను పెద్దలమాట  వినను నాతో పాటు పెరిగిన యవ్వనస్థుల మాట వింటాను అని చెప్పి కొంచెం కఠినంగా మాట్లాడినందుకు రాజ్యం రెండుగా విడిపోయింది. తరువాత ఏం జరిగింది అంటే పది గోత్రాలు ఏమో ఒక రాజ్యం అయిపోయింది. యూదా గోత్రము మరియు లేవీ గోత్రము వారు కలిసి ఉన్నారు. దావీదు సంతతి అసలు అది కూడా ఉండేది కాదు గాని, దేవుడు దావీదుకు వాగ్దానం చేశాడు కదా తప్పకుండా దావీదు సంతతిలో ఒకడు సింహసనం మీద కూర్చుండుటకు ఒకడు ఉండకపోడు అని దేవుడు వాగ్దానం చేసాడు.  గనుక, దావీదు సంతతిలో ఎవడో ఒకడు తప్పకుండా తరతరాలకు సింహసనం మీద ఉండాలి. యూదా రాజ్యం వాళ్ళవైపు అయింది.  ఆ తరువాత మాత్రం ఆ మిగతా పది గోత్రాలు ఒక రాజ్యం అయినాయి. తరువాత యూదా వేరే రాజ్యం అయ్యింది అంచేత ఆ పది గోత్రాలదేమొ ఇశ్రాయేలు రాజ్యముగా పిలువబడింది. యూదులదేమో యూదా గోత్రపు రాజ్యంగా పిలువబడింది. ఇలా జరిగి కొంత కాలం అయిన తరువాత ఏమైందంటే ఇశ్రాయేలీయులేమో అష్షూరు రాజ్యపు చెరలోకి వెళ్లిపోయారు.  యూదా రాజ్యము బబులోను చెరలోకి వెళ్ళారు. వీళ్ళనేమో నెబుకద్నెజరు రాజు చెరలోకి ఈ పది గోత్రాలు వెళ్ళిపోయారు. తరువాత ఈ పది గోత్రాల రాజ్యములు తప్పక నెలకొల్పాలి అనే నిబంధన ఏమి లేదు. దావీదును బట్టి నిబంధన ఉన్నది గాని, ఈ పది గోత్రాలలో రాజులకు ఒక రాజ్యం అనేది లేదు. ప్రతిరాజు మీద ఎవడొఒకడు కుట్రచేసి వాడిని చంపడం. తరువాత ఇంకోరాజ్యంలో ఇంకోరాజును చంపడం ఇలా జరిగింది. ఇశ్రాయేలియులకు రాజ్యవంశం అనేది లేదు. యూదా గోత్రానికి రాజ్యవంశం ఉంది దానికి దావీదును బట్టి నిబంధన ఉంది. గనుక డెబ్బది సంవత్సారాల చెర తీరిన తరువాత, ఆ యూదా పౌరులు మరల తమ దేశానికి వచ్చారు. మళ్ళీ యెరూషలేము గోడలు కట్టబడ్డాయి, మందిరం కట్టబడింది, మళ్ళీ రాజ్యం నెలకొల్పబడింది. కాని ఈ పది గోత్రాల వారు ఒక రాజ్యముగా చేర్చబడలేదు, ఇది కూడా మా పితరుల దేశం అని ఈ పది గోత్రాలు వారు యూదా రాజ్యం భూభాగంలోనికి వచ్చి నివసించడం మొదలుబెట్టారు. అప్పుడు ఈ పన్నెండు గోత్రాలకు కూడా యూదులు అని పేరు వచ్చింది. ఆ యూదా బెన్యామీను గోత్రాలు, లేవి గోత్రం వాళ్ళేమో ఒక రాజ్యం.  యూదా రాజ్యం చెదిరిపోయింది. అందుచేత అన్నా అనే ప్రవక్తి ఆశ్రయ గోత్రికురాలు అని ఉన్నది. మరి చెదిరిపోయిన వాళ్ళు ఎట్లా వచ్చారు ఇక్కడికి అంటే వచ్చారు. కాని రాజ్యముగా గుర్తింపు రాలేదు. యూదా రాజ్యములోనే అన్ని గోత్రాల వారు బ్రతకడం మొదలుబెట్టారు. ఇప్పుడు ఇక అరబ్బులు అన్నారు. అరబ్బులు ఎవరు అంటే ఇవాళ్ళ మనం సిరయాను అరబ్బు దేశం అంటాం. యాకోబు యొక్క మేనమామ లాబాను రిబుకమ్మ యొక్క అన్నగారు. అతని గూర్చి సిరియా వాడైనా లాబాను అని ఉంది. అంటే అంత పాతది సిరియా కంట్రీ క్రీ.పు2000 ఏళ్ళనాడు సిరియా దేశం ఉంది. లాబాను సిరియా వాడు గనుక సిరియన్లను అరబ్బులు అంటున్నాం. గనుక ఇశ్మాయేలులో నుండి వచ్చిన వాళ్ళె అరబ్బులను చెప్పడానికి వీలులేదు. అబ్రాహామును తమ తండ్రిగా చెప్పుకుంటున్న విభిన్న జాతులు ఉన్నారు. గనుక మొత్తము ఒక పదునాలుగు జాతుల వారు ఉన్నారు. మొయాభీయులు, అమొరీయులు. ఎవరు అంటే లోతు సంతానం. ఆ విధంగా అబ్రాహాము చుట్టాలు. అబ్రాహాము అన్నకొడుకు లోతు. లోతు పిల్లలు తరువాత ఎదోము, ఏశావు పిల్లలు, ఇజ్రాయేలు పిల్లలు కూడా అరబ్బులే. ఇజ్రాయేలు సంతానం కాదు కదా, ఎదోము అనేవాడు ఇశ్రాయేలు సంతానమే అబ్రాహాము ఇస్సాకుల సంతానమే యాకోబుకు అన్నా, ఇస్సాకుకు పెద్ద కొడుకు జన్మతహా అయినా సరే ఏదోము పిల్లలు కూడా ఇపుడు అరబ్బులుగానే పిలువబడుతున్నారు. (Dr. Anis Shorrash గారు రాసిన బుక్, అందులో రాసారు దాదాపు 13, 14 పాయలుగా వచ్చినటువంటివి. ఆయన కూడా ఒక అరబ్బుదేశానికి చెందినవాడు. గనుక అరబ్బు జాతులు పదునాలుగు వేరేవేరే మూలాల్లోంచి వచ్చిన వారు అనే సంగతి ఆయన అందులో క్లియర్గా చెప్పారు. ఆ బుక్ చదువండి తెలుస్తుంది.)

                ఇశ్రాయేలీయులకు యూదులకు ఎందుకు పడదు?

                ఇశ్రాయేలీయులు, యూదులు ఒక్కటే వాళ్ళకు పడిరాకపోవడం ఏమిలేదు. అంతా ఒకటే. ఇప్పుడు ఇశ్రాయేలు అనేదేశం ఉంది కదా వాళ్ళనే Jews and Isreals వారిని, అంటే వారు ఒకరే గాని వారిని యూదులు, ఇశ్రాయేలియులు అని పర్యాయపదాలుగా పిలుస్తున్నారు. ఎందుకనగా యూదా రాజ్యం మళ్ళీ Restoration జరిగి, పది గోత్రాల రాజ్యం Restoration జరగక పోయినందుకు, యూదుల రాజ్యంలోనికి వారు కూడా వచ్చియున్నందుకు ఆ భూభాగమును ఇశ్రాయేలు దేశం అని పిలిచారు, యూదాదేశం అని పిలిచారు. యూదులు, ఇశ్రాయేలీయులు అనేది పర్యాయపదాలుగా మారిపోయాయి. ఇశ్రాయేలీయు, యూదులు ఇద్దరు ఒక్కటే.