(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: చాలా పెద్ద బ్లండర్ అది. ఇప్పుడు విషయం ఏమిటంటే ప్రవక్త, అతని సందేశం వేరువేరు కాదు. సందేశంలో ఒక భాగం ప్రవక్త లైఫ్ కూడా. గనుక దేవుని సందేశాన్ని మాత్రమే నేను ప్రజెంట్ చేస్తాను. ఈ సందేశంలోకం లోనికి రావడానికి దేవుడు వాడుకొని, నిలబెట్టుకొని చెక్కి మలచి నియమించి వాడుకున్నటువంటి ప్రవక్తను మరుగుచేస్తాను, ప్రవక్తను దాచి పెట్టి అతని సందేశాన్నే తీసుకొని, తరువాత ఇది ప్రవక్త ద్వారా వచ్చింది అని అనేది ఫూలిష్ వైఖరి. అది ఆత్మసంబందమైనది కాదు. దేవునికి అనుకూలం కాదు. దేవుని చిత్త ప్రకారం కాదు. ఇప్పుడు ద్వితీయోపదేశకాండము, నిర్గమకాండము చదువుకుంటాను కాని మోషే సంగతి నాకు అవసరం లేదు. అని అనుకుంటే వాడికి ఆశీర్వాదం సంపూర్ణంగా రాదు. ప్రవక్త, ప్రవక్త యొక్క సందేశం ఈ రెండు కలసి ప్రజెంట్ చేయాలి. అందుకొరకే ఈ ప్రవక్త యొక్క వ్యక్తిగతం, అతని పరిచయం కూడా చాలా ప్రాముఖ్యము. సందేశమెంత ప్రాముఖ్యమో అదీ అంత ప్రాముఖ్యము. దినవృతాంత్తాలు 20:20లో యెహోవాను నమ్ముకొనుడి ఆయన పంపిన ప్రవక్తలను నమ్ముకొనుడి అప్పుడు మీరు కృతార్థులవుదురు అంటాడు. కృతార్థీ అంటే పరీక్షలో నెగ్గడం. మరి దేవుడు పెట్టే పరీక్షలో ఇక్కడ భూమిమీదగాని, పైన న్యాయపీఠం ముందుగాని న్యాయపీఠం ఎదుట జరిగే పరీక్షలో గాని, మీరు కృతార్థులు కావాలి, ఉత్తీర్ణులు కావాలంటే యెహోవాను ఆయన ప్రవక్తలను కూడా నమ్ముకోవాలి. ప్రవక్త జీవితంలో కొన్ని విషయాలు దేవుడు తన చిత్తాన్నీ బట్టి జరిగిస్తాడు. అది ఎందుకు జరిగిస్తాడు. అంటే, అతని ద్వారా సత్యం వచ్చినప్పుడు హృదయ సున్నతి లేనివారు, సంపూర్ణ విధేయత లేనివారు, సత్యాన్ని అంగీకరించరు. వాళ్ళకు అది వివాదాస్పదంగా కనబడుతుంది. మరి “ఆయన చేట ఈయన చేతిలో” ఉన్నది అనే ఒక బుక్ రాసాను నేను. అది చదవాలి. నా పుస్తకాలు అన్నీ చదివితే మీకు సరిగ్గా అర్ధంమవుతుంది. లేకపోతే దారితప్పి అడవిలో తిరిగినట్టు ఉంటుంది. ఎంత పెద్ద వేదాంత పండితుడైనా ఈ తరంలో రంజిత్ ఓఫీర్ గారి బుక్స్ చదవాలి. లేకపోతే బండి ట్రాక్ మీదికి రాదు. ఇక్కడ దేవుడు జల్లెడ పడుతున్నాడు. మనుష్యులను, పట్టేటప్పుడు భక్తుని జీవితంలో ప్రజలకందరికి అభ్యంతరకరంగా ఉండేటట్లు కొన్ని చేస్తాడు. అదేంటంటే అభ్యంతరకరముగా కాదు గాని వాళ్ళకు అట్ల కనిపిస్తది అన్నమాట. వాళ్ళు దాన్ని ప్రశ్నించడానికి అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళ విధేయతను దేవుడు పరీక్షిస్తాడు. పౌలు జీవితంలో గలతీయులకు శోధన గాను, వాళ్ళకది అభ్యంతరకరంగాను ఉండినది ఏదో ఉండింది. గాని అయినను మీరు కన్నులు ఊడపీకివ్వగలినంతగా నన్ను ప్రేమించారు. యేసుక్రీస్తు లాగా నన్ను అంగీకరించారు. దేవదూతలలాగా నన్ను అంగీకరించారు అని సాక్ష్యం ఇస్తాడు. అలా ఉన్నంత సేపు వాళ్ళు బాగుగా పరిగెత్తుచుండిరి. ఎప్పుడైతే పౌలు చెప్పిన సత్యం వాళ్ళకు నచ్చలేదో, నిజమాడినందున నేను మీకు శత్రువునైతినా అని అంటాడు. అప్పటినుండి మీరు బాగా పరిగెత్తుచుంటిరి, ఎవడు మిమ్మును అడ్డగించిరి అని అంటాడు. పౌలు పట్ల ఉన్నటువంటి వైఖరి కరెక్టుగా ఉన్నట్లయితే వాళ్ళు బాగా పరిగెత్తారు. పాలు పట్ల వైఖరి మారిపోయినపుడు సత్యం నుండి తొలిగిపోయే అవకాశం ఏర్పడింది. గనుక ప్రవక్త, ప్రవక్తనోటినుండి దేవుడు పలికిన సత్యం రెండు కలిసే ముందుకెళ్ళాలి. కొంతమంది నా దగ్గర సత్యం నేర్చుకొని, ఇతరులకు చెప్పి తరువాత ఇది ఎవరి ద్వారా వచ్చింది అనుకున్నావు? రంజిత్ ఓఫీర్ గారి ద్వారా వచ్చింది. గనుక ఆయన గూర్చి మీరనుకున్నవి తప్పు, ఆయన మంచి దైవజనుడు, మంచోడు కాకపోతే ఇవన్నీ దేవుడు ఎలా బయలు పరుస్తాడు అని అంటారు అది కరెక్టు కాదు. దేవుడు నియమించినటువంటి దైవ జనుడు, దైవజనుణ్ణి గౌరవించనివాడు. సత్యం తెలుసుకోవడం దేవుడి ఇష్టం లేదు, అది అందరు తెలుసుకోవాలి. మోషేను గౌరవించని వాళ్ళు, కనానుకు రావడం దేవునికి ఇష్టం లేదు. కోరహు యెహోవాను తిరస్కరించలేదు, మోషేను తిరస్కరించాడు. కాబట్టి కొంతమంది కోరహు సమాజం ఉన్నారు, వారు కనానుకు రాకూడదు. వారికి సత్యం తెలియకూడదు, వాళ్ళు నాశనం కావల్సిందే. ఎందుకంటే దేవుణ్ణి తిరస్కరించినోళ్ళకు శిక్ష అని అనుకుంటున్నాం, కాని మోషేను తిరస్కరించినా శిక్షే. కాబట్టి deep సీక్రేట్ ఏమిటంటే మా గురువుగారు గొప్ప దైవజనుడు, నీతిమంతుడే గాని, అందరు అపార్థం చేసుకుంటున్నారు. దీని గురించి చికాకు వారికెందుకు ముందు సత్యం చెప్తాను, సత్యం చెప్పిన తరువాత ఇది ఆయన ద్వారా వచ్చింది అని చెప్తే అంత గొప్పోడా మీ దైవజనుడు! అని అప్పుడు బోర్లపడతారు అనుకుంటున్నారు అది జరగదు. వాళ్ళలో అజ్ఞానం, చీకటి అలాగే ఉంటుంది. వారు సత్యాన్ని నమ్ముతారు కాని సైతాను నమ్మినట్టు నమ్ముతారు. దేవుడొక్కడే అని దయ్యములు నమ్ముచున్నవి. యేసు క్రీస్తు రక్షకుడని నమ్ముతున్నాయి. కాని వాటికి రక్షణ ఉండదు. అలాగే మొట్టమొదటిగా దైవజనుడి జీవితంలో ఉన్నటువంటి సమస్తము కూడా దేవుని చిత్త ప్రకారము జరిగినవే అందులో కూడా పాఠములు ఉన్నవి. ఈయన వేసిన ప్రతి అడుగు కూడా దేవుని చిత్త ప్రకారమే వేసాడు. అన్నంత ప్రత్యక్షతలోనికి ఎవరైతే వస్తారో, వారు మాత్రమే సత్యాన్ని తెలుసుకుంటాడు, తెలుసుకోవాలి. అతడే కనానుకు రావాలి. వీళ్ళు నా విషయంలో తప్పటడుగులు అన్నవి తప్పటడుగులు కావు, దేవుని చిత్తములో నేను వేసిన అడుగులు గనుకనే ఇప్పటిదాక నాకు అభిషేకం ఉంది. గనుక 40 సంవత్సరాలు అదే పదును, ఏ మాత్రం తగ్గలేదు. ఎందుకంటే నేను వేసిన ప్రతీ అడుగు దేవుడు వేయమంటే వేసాను అనేది నాకు ఉంది. దానిని తెలుసుకున్నోడే శిష్యుడు, వాడికే సత్యం దక్కాలి. వాడే బహుమానం అందుకోవాలి గనుక ఈ ప్రణాళిక నుండి కొందరు బయటకు వెళ్ళిపోయారు. ఇదంతా కూడా అజ్ఞానాన్ని ప్రోత్సాహించడం. దీనిని దేవుడు అంగికరించడు.
ఎవరైతే రంజిత్ ఓఫీర్ లైఫ్ corect కాదు అంటున్నారో ఈ తరంలో వారు కోరహు పాపం చేస్తున్నారు. ఈ సంగతి న్యాయపీఠం ముందు నిరూపించబడుతుంది. ఇది అందరు గుర్తుపెట్టుకోండి.