209. ప్రశ్న : రంజిత్ ఓఫీర్ గారి ద్వారా 800 మంది సేవకులు దాదాపుగా తయారయ్యారు, వెయ్యి సంఘాలున్నాయి. ఓఫీర్ గారు అంటే ఇష్టము, ఆయన వాక్యమంటే ఇష్టము.  ఆయన శిష్యులు అంటే ఇష్టంలేదు. సంఘాలలో ఉన్న విశ్వాసులలో కొంతమంది అడిగిన ప్రశ్న, ఓఫీర్గారు ఇష్టమే ఆయన వాక్యము ఇష్టమే కాని ఆయన ద్వారా అభిషిక్తులైనటువంటి సేవకులు ఇష్టం లేదు. దీనికి మీ స్పందన ఏమిటి?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)

జవాబు:     కీర్తనలు 16 లో దావీదు అంటాడు. భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు అన్నాడు. అంటే భూమి మీద ఉన్న భక్తులే ఎందుకన్నాడంటే, భూలోకాన్ని వదిలిపోయిన భక్తులను ఎవడైనా ప్రేమిస్తాడు, పౌలును, బర్నబానూ, సిలనూ, తీతూ, తిమోతిని ప్రేమించేది Easy కానీ మనతో పాటుఉండి, మనకు బోధ చేస్తున్న వాణ్ణి ప్రేమించడం కష్టం. ఎందుకంటే సమూయేలు ప్రవక్త మోషే ప్రవక్త దిగివచ్చి మనం చేసే తప్పులు ఎత్తి చూపే పరిస్థితి లేదు.  ఎందుకంటే వారు రాసింది చేసింది ఏదో ఉండిపోయింది. చరిత్రలో వాళ్ళెల్లిపోయారు పని ముగించుకొని. ఇప్పుడు నేను చేసే తప్పును గద్దించే వాడు ఎవరంటే ఇప్పుడు నా ఊరిలో ఉన్న సేవకుడే. మోషే ఇష్టంగాని, మా ఊర్లో సేవకుడు ఇష్టం లేదు. అట్లాగే ఓఫీర్గారు కూడా అన్ని ఊర్లు తిరిగి అందరికి చెప్పలేడు కదా? ఆయన పుస్తకాలు రాసి ఊరుకున్నాడు. మన ఊర్లో లేడు కాని ఓఫీర్ గారి సేవకులంటే, ఆయనకు సహదాసులు మనకు అందుబాటులో ఉంటారు. వీరు కూడా దగ్గరగా ఉన్న దైవజనుణ్ణి ద్వేషించి, దూరంగా ఉన్న దైవజనుణ్ణి ఇష్ట పడుతారు. మీరు ఇంతకు ముందు అడిగిన ప్రశ్నలో ఉన్నటువంటి విభిన్నదశలోని కోరహులే. దేవుడంటే ఇష్టం కాని, దైవజనుడు అంటే ఇష్టం లేదు. ప్రత్యేక్షత కావాలి కాని, ప్రవక్త ఇష్టం లేదు. వేరే కాలఘట్టంలో ఉన్న సేవకుడు ఇష్టంగాని, మన ఊర్లో ఉన్న సేవకుడు ఇష్టం లేదు. వీళ్లందరు కోరహులే, కోరహు సమాజమే ఎక్కువ ఉన్నది. అప్పుడు ఇశ్రాయేలు సమాజంలో యోగ్యులు ఎక్కువ, కోరహులు తక్కువ, ఇప్పుడు కోరహులే ఎక్కువ అసలైనటువంటి శిష్యులు తక్కువ ఈ తరములో.